breaking news
unuse
-
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. నిధుల వినియోగంలో వైఫల్యం
దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో వెనుకబడుతోంది. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం నామమాత్రంగా ఉంటోంది. ఇందుకు అభ్యర్థుల నుంచి స్పందన తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.నిధుల వినియోగంలో భారీ వ్యత్యాసంకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి రూ.11,500 కోట్లు కేటాయించారు. అయితే, నవంబర్ 2025 వరకు చేసిన ఖర్చు కేవలం సుమారు రూ.500 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 4 శాతం మాత్రమే. ఇంకా మిగిలి ఉన్న నిధులు దాదాపు రూ.10,800 కోట్లు.గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. అప్పట్లో నిధుల వినియోగం లేకపోవడంతో బడ్జెట్‌ను రూ.2,667 కోట్ల నుంచి రూ.1,078 కోట్లకు తగ్గించగా అందులోనూ కేవలం రూ.680 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పథకం పట్ల యువతలో ఆసక్తి ఉన్నప్పటికీ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను స్వీకరించడంలో వారు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం తొలి దశ లేదా పైలట్ ప్రాజెక్ట్ పరిశీలిస్తే, మొత్తం 1.27 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు అభ్యర్థుల కోసం 82,000కు పైగా ఆఫర్లను జారీ చేశాయి. అయితే, వీటిలో కేవలం 28,000 మంది అభ్యర్థులు మాత్రమే ఆఫర్లను అంగీకరించారు. దీనివల్ల తొలి దశలో అంగీకార శాతం కేవలం 34 శాతానికే పరిమితమైంది.ఈ పథకం రెండో దశలో అభ్యర్థుల ఆసక్తి మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ దశలో 1.18 లక్షల అవకాశాలు లభ్యం కాగా, కంపెనీలు 83,000కు పైగా ఆఫర్లను ఇచ్చాయి. కానీ, అభ్యర్థుల నుంచి అంగీకారం లభించినవి 24,600 కంటే తక్కువగానే ఉన్నాయి. దీని ఫలితంగా రెండో దశలో అంగీకార రేటు 30 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే, నవంబర్ 30, 2025 నాటికి ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారి సంఖ్య కేవలం 2,066 మాత్రమే ఉండటం పథకం నత్తనడకను సూచిస్తోంది.కారణం ఏంటి?ఈ పథకం కింద ఇంటర్న్‌లకు నెలకు రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.6,000 గ్రాంట్, బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం చాలా స్వల్పమని, అందుకే యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చకపోతే బడ్జెట్లో కేటాయించిన భారీ నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
గ్రీన్‌కార్డు ఆశలు తీరే మార్గం.. భారతీయ అమెరికన్లకు శుభవార్త!
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లకు శుభవార్త. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న 2.30 లక్షలకు పైగా గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకుని, పునరి్వనియోగించాలన్న సిఫారసుపై అధ్యక్షుడి సలహా మండలి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా, మరింత మంది గ్రీన్‌కార్డులను అందుకునేందుకు వీలు ఏర్పడింది. దీని ప్రకారం..ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు అదనంగా 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటిని జారీ చేస్తారని ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ భుటోరియా చెప్పారు. అధ్యక్షుడు బైడెన్‌కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో భుటోరియా సభ్యుడు. ఇందుకు సంబంధించిన సిఫారసులను మండలికి గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో వలసదారులకు అందజేసే శాశ్వత నివాస పత్రం. ఉపయోగంలో లేని గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మున్ముందు గ్రీన్‌కార్డుల వృథాను అరికట్టేందుకు పలు సిఫారసులను చేశామన్నారు. వీటి అమలుతో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. తమ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ, ఉద్యోగ ప్రాతిపదికన వలసదారులకు ఏటా నిరీ్ణత సంఖ్యలో గ్రీన్‌కార్డులను జారీ చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కి కాంగ్రెస్ ఇస్తుంటుంది. అయితే, పరిపాలనా పరమైన జాప్యంతో జారీ అయిన గ్రీన్‌కార్డుల్లో కొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అనేక ఏళ్లుగా ఇలా కార్డులు లక్షలుగా పేరుకుపోయాయని భుటోరియా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు చర్యలను తాము సూచించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి...1992 నుంచి ఉపయోగంలో గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు తోడుగా స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటినీ జారీ చేయాలి. రెండోది..ఆ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోయినప్పటికీ, అన్ని గ్రీన్ కార్డ్‌లు వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావడం. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందస్తుగా వర్తింపజేయడం’అని ఆయన వివరించారు. ఈ సిఫారసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉండే గ్రీన్‌కార్డుల ప్రభావం ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, ఫిలిపినో అమెరికన్లు, చైనీస్ అమెరికన్ల కుటుంబాలపైనే ఉంటుందని చెప్పారు. గ్రీన్‌కార్డుల కొరత ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే హెచ్–1బీ వీసాదారులపై ఉంటుందని, వారి పిల్లల వలస హోదాపైనా పడుతోందన్నారు. 2020 గణాంకాల ప్రకారం 42 లక్షల కుటుంబాలు సగటున ఆరేళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డు కోసం సగటున దశాబ్ద కాలంపాటు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
– దిష్టిబొమ్మల్లా తయారైన సబ్‌కంట్రోల్ కార్యాలయాలు అనంతపురం సెంట్రల్ : ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ కార్యాలయాలు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ఇటీవల నేరసమీక్షా సమావేశంలో ఎస్పీ రాజశేఖరబాబు స్వయంగా సబ్‌కంట్రోల్ కార్యాలయాలు తెరవాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాలు అదుపు చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్‌సబ్ కంట్రోల్ కార్యాలయాలు నిర్మించారు. పాతూరులో గాంధీ విగ్రహం సర్కిల్, టవర్‌క్లాక్, కలెక్టరేట్‌కు సమీపంలో సర్ థామస్ మన్రో విగ్రహం వద్ద, బళ్లారి బైపాస్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఓ కానిస్టేబుల్ నియమించి నిత్యం వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు శాంతిభద్రతల పరిరక్షణ చేపట్టేందుకు వీటిని వినియోగించాలి. కానీ కొన్ని నెలల నుంచి సబ్‌కంట్రోల్ కార్యాలయాలు తలుపులు తెరుచుకున్న పాపాన పోలేదు. దుమ్ము, చెత్తా, చెదారంతో అవి దీనావస్థకు చేరుతున్నాయి. టవర్‌క్లాక్ కూడలిలో రాజకీయనాయకుల ప్లెక్సీ కట్టుకునేందుకు సబ్‌కంట్రోల్ రూం ఉపయుక్తంగా మారుతోంది. అక్కడ పోలీసులకు సంబంధించి ఓ ఆఫీసు ఉందని ప్రజలకు కనిపించని రీతిలో కట్టేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడ గాడిలో పడుతుంది అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.


