breaking news
Unlimited Pani Puri
-
జియో ఎఫెక్ట్: అపరిమిత పానీ పూరీ
-
జియో ఎఫెక్ట్: అపరిమిత పానీ పూరీ
అహ్మదాబాద్: అపరిమిత కాల్స్.. అపరిమిత డేటా అంటూ క్రేజీ సమ్మర్ ఆఫర్లతో వినియోగదారుల మనసు దోచుకుంటూ ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది రిలయన్స్ జియో నెట్ వర్క్! జనంలో జియో పట్ల పెరిగిన ఆసక్తి అంతా ఇంతా కాదు.ఎక్కడ పదిమంది కలిస్తే అక్కడ చర్చ జియోపైనే సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకున్నాడు గుజరాత్ పానీ పూరీ వ్యాపారి.. తన పానీ పూరీ గిరాకీ పెంచుకోవడానికి ఏకంగా జియో పానీ పూరీ ఆఫర్ నే మొదలుపెట్టాడు. గుజరాత్ లోని పోరుబందర్ కు చెందిన రవి జగదాంబ అనే పానీపూరీ వ్యాపారి రూ.100 చెల్లించి అపరిమితంగా పానీ పూరీ తినవచ్చంటున్నాడు. అంతేకాదండోయ్ మనోడు నెల ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చాడు. రూ.1000 చెల్లించి 30 రోజులు పానీ పూరీని ఉచితంగా తినవచ్చంటున్నాడు. అయితే తనకు సాధారణంగా వచ్చేగిరాకీ కంటే జియో ఆఫర్ పెట్టాక వచ్చే గిరాకి బాగా పెరిగిదని ఈ వ్యాపారీ చెప్పుకొచ్చాడు. మన రాష్ట్రంలో కూడా ఆ మధ్య కరీంనగర్ రైస్ మిల్లర్లు జియో రైస్ అంటూ వ్యాపారం మెదలు పెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు జియో ఆఫర్ ను క్యాష్ చేసుకుంటున్నారు.