breaking news
Transfer Duty Daksha
-
పురపాలికలకు అందని రూ. 2,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక ప్రజలకు కనీస సేవలు కూడా చేయలేకపోతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సాయం అందడం లేదు. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలతోపాటు కుటుంబ వారసత్వ పంపకాల సమయంలో రిజి్రస్టార్లు మ్యుటేషన్ ఫీజుల రూపంలో ఫీజు వసూలు చేస్తారు. అలాగే భూ హక్కుల బదిలీ కింద ట్రాన్స్ఫర్ డ్యూటీలు, సేవా పన్నులు సైతం కట్టించుకుంటారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసినప్పటికీ, ఇందులో మ్యుటేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా వాటా ఇవ్వాలి. అయితే 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు పురపాలికలకు రావాల్సిన రూ. 2,500 కోట్ల విలువైన మ్యుటేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలు విడుదల కాలేదు. దీంతో పట్టణాల్లో ఎన్ని భూ లావాదేవీలు జరుగుతున్నా ఆయా మున్సిపాలిటీలకు పైసా లాభం ఉండట్లేదు. కొన్ని పురపాలికల్లో కాలువల్లోని పూడిక తీయడానికి, చెత్త ఎత్తే ట్రాక్టర్లకు డీజిల్ పోయించడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. మ్యాచింగ్ గ్రాంట్ రూ. 800 కోట్లు స్థానిక సంస్థలను పరిపుష్టం చేసేందుకు కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ వస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆయా పట్టణ పాలకమండళ్లకు రూ. 800 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రూ. 800 కోట్లు ఇంకా విడుదల కాలేదు. ఈ మొత్తం విడుదలై యుటిలైజేషన్ సరి్టఫికెట్ (యూసీ) పంపిస్తేనే తిరిగి మున్సిపాలిటీలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పట్టణ ప్రగతి కింద ప్రతి మున్సిపాలిటీలో దోబీఘాట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చాలా మున్సిపాలిటీల్లో పనులు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే దోభీఘాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణాలకు రూ. 282 కోట్లు రావలసి ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాలక మండళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
‘ట్రాన్స్ఫర్’ చేయరూ
► టీడీ బకాయిలపై తకరారు ► నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగాయంటున్న సర్పంచులు సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ(టీడీ) బకాయిలు అందకుండా పోయాయి. ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెలా భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ బకాయిలను రిజిస్ట్రేషన్ల శాఖ గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం లేదు. ఎవరి వాదన వారిది.. పంచాయతీరాజ్ శాఖ నుంచి తమకు ఆయా గ్రామ పంచాయతీల డీడీవో కోడ్లు, పీడీ అకౌంట్ల వివరాలు అందకపోవడమే ప్రధాన కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అంటుండగా, ట్రాన్స్ఫర్ డ్యూటీని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని తాము కోరినా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పందన కరువైందని పంచాయతీరాజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. వడ్డీలు కట్టలేక సతమతం రెండేళ్లుగా పంచాయతీలకు అందాల్సిన టీడీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉపాధిహామీ పథకం కింద మూడు నెలల కిందట దాదాపు రూ.350కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని దుస్థితి. – అందోల్ కృష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇప్పటి వరకు టీడీ బకాయిల మొత్తం సుమారు రూ.కోట్లు 600 16 నెలలుగా విడుదల చేయడం లేదు ఆస్తి విలువలో టీడీగా వసూలు చేసేది 1.5% 30 రోజులు ఈ మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేయాల్సిన సమయం: 30 రోజులు(నెల)