breaking news
TMC protests
-
ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?: సీఎంపై ఫైర్
శివసేన రెబల్ ఎమ్మెల్యేల కారణంగా మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏక్నాథ్ షిండే.. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ థాక్రే సర్కార్‌కు సవాల్ విసిరారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేలంతా అసోంలో క్యాంప్‌లో ఉన్నారు. కాగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు బీజేపీ సర్కార్, శివసేన రెబల్ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాడిసన్ బ్లూ హోటల్ ఎదుట తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వంలో కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, శివసేన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న అసోంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే బీజేపీ ప్రభుత్వం, అసోం.. రాజకీయాలే ముఖ్యమా..? అంటూ మండిపడ్డారు. తృణముల్ కాంగ్రెస్ నేతల నిరసనలతో పోలీసులు, భద్రతా సిబ్బంది హోటల్ వద్ద అలర్ట్ అయ్యారు. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Members and workers of Assam unit of TMC protest outside Radisson Blu Hotel in Guwahati where rebel Maharashtra MLAs, including Shiv Sena's Eknath Shinde, are staying. Party's state president Ripun Bora is leading the protest here. pic.twitter.com/rfoD0fQSKU — ANI (@ANI) June 23, 2022 ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: అనర్హత వేటు గండం.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ -
గాంధీ విగ్రహం వద్ద టీఎంసీ నేతల నిరసన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు నేటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనుంది. ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ విషయంపై భేటీ అయిన తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశం ప్రారంభించక ముందు టీఎంసీ నేతలు నోట్ల రద్దు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దును కొందరు నేతలు గొప్ప నిర్ణయంగా పేర్కొంటుండగా.. మరికొందరు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దుచేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే తన నిర్ణయాన్ని వెల్లడించారు.