breaking news
TMC MPs
-
అఖిలపక్ష భేటీలో రగడ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాజకీయ యుద్ధం మొదలైంది. ఆదివారం పార్లమెంట్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్ సహా 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున పార్టీ పార్లమెంటరీ పక్ష నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో టీఎంసీ రెబెల్ ఎంపీల విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఇంకా అధికారికంగా పూర్తిస్థాయి ఆమోదం తెలపలేదని, రికార్డుల ప్రకారం తమ పార్టీ బలం ఇంకా 28గానే ఉందని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ప్రస్తావించారు. టీఎంసీ రెబల్స్‌ను అఖిలపక్ష భేటీకి పిలిచినందుకు నిరసనగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన(యూబీటీ), డీఎంకే, ఆప్, జేఎంఎం, ఆర్జేడీ సహా వామపక్ష పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్లీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు–2026(లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచే డీలిమిటేషన్ బిల్లు)పై కాంగ్రెస్ సభ్యులు ఖర్గే, ప్రమోద్ తివారీ నిరసన వ్యక్తం చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీలు, అయోధ్య రామాలయ ట్రస్టులో కోట్ల రూపాయల విరాళాల చోరీ, ఈ20 పెట్రోల్ వంటి అంశాలను పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్‌చేశారు. నియోజకవర్గాల పునరి్వభజన బిల్లుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు ఇస్తుందంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కొట్టిపారేశారు. ఇది ప్రజాస్వామ్య హత్య అయోధ్య రామమందిర విరాళాల చోరీ, ఇథనాల్ బ్లెండింగ్, విద్యార్థుల సమస్యలు, మణిపూర్‌లో కల్లోలం తదితర కీలక సమస్యలు, తాజా పరిణామాలపై వర్షాకాల సమావేశాల్లో తప్పనిసరిగా చర్చించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డీఎంకే సభ్యుడు టిఆర్ బాలు విన్నవించారు. శివసేన(యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే సారథ్యంలోని శివసేన పార్టీలో చేరడం, వారి విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడం అన్యాయమని శివసేన(యూబీటీ) సభ్యుడు అరవింద్ సావంత్ స్పష్టంచేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు బీజేపీలో చేరడాన్ని ‘హైజాక్’గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎన్.డి.గుప్తా అభివర్ణించారు. ఇది చెల్లుతుందా లేదా అని తేల్చాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.సభలు సజావుగా సాగేలా సహకరించండి ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై పార్లమెంటరీ నిబంధనలను లోబడి సమగ్రమైన చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు. సభలో గందరగోళం సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలని విపక్షాలను కోరారు. చట్టసభల సమయం వృథా కాకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు రిజిజు చెప్పారు. గతంలో మెజార్టీ లేక ఆమోదం పొందని రాజ్యాంగ సవరణ బిల్లులపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'ఆమె మమ్మల్ని నమ్మట్లేదు. అందుకే..'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తన ఎంపీలపై నమ్మకంపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కడ వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారోనని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు కచ్చితంగా తమ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఓటు హక్కు వినియోగించుకోవాలని హుకుం జారీ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సుగతాబోస్, కేడీ సింగ్‌వంటి ఏంపీలు కూడా కోల్‌కతాలోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారంట. ఈ నెల 1న టీఎంసీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఒక ఎస్సెమ్మెస్ రూపంలో సమాచారం అందింది. ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నారో చెబుతూ ఎన్నికల కమిషన్ పంపించే పత్రాల్లో నింపి వాటిని టీఎంసీ కార్యదర్శి(మమతకు విశ్వసనీయుడు) మానిక్‌దాకు ఇవ్వాలని ఆ సమాచారం ఉంది. దీని ప్రకారమే ఓటు హక్కు కోల్‌కతాలో వినియోగించుకోవాలనుకున్న ఎంపీలంతా కూడా ముందు ఆ పత్రాలను మమత వద్దకు పంపి ఆ తర్వాతే ఎన్నికల కమిషన్‌కు పంపించారట. ఇదే విషయాన్ని ఓ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఎంపీ తెలుపుతూ 'ఆమె మమ్మల్ని పూర్తిగా నమ్మడం లేదు. అందుకే ముందు మా ఓటింగ్‌కు సంబంధించిన పత్రాలను ఆమెకు పంపించాం. ఆ తర్వాతే అవి ఎన్నికల కమిషన్‌కు వెళ్లాయి' అని తెలిపారు. అంతేకాదు, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఈ పత్రాలన్నింటిని స్వయంగా తీసుకెళ్లి ఎన్నికల కమిషన్‌కు సమర్పించారంట. -
ఢిల్లీలో టీఎంసీ ఎంపీల ఆందోళన
-
నోట్లు రద్దుపై టీఎంసీ ఎంపీల ఆందోళన
-
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్‌సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు.


