breaking news
tittle issue
-
మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!
మిస్ సుప్రానేషనల్ 2024 అందాల పోటీలు పోలాండ్లోని మలోపోల్స్కాలో జరిగాయి. ఆ పోటీల్లో భారతదేశానికి చెందిన సోనాల్ కుక్రేజాతో సహా సుమారు 68 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సోనాల్ 12వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని జైపూర్‌లో జన్మించిన సోనాల్ యూఎస్ఏలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌ను అభ్యసించింది. అంతేగాదు కొత్త క్రిప్టో సేవలతో భారతదేశ ఆర్థిక ప్రపంచాన్ని మార్చే ఒక స్టార్టప్ యునికాన్ వ్యవస్థాపకురాలు కూడా. మహిళల సామాజిక నిబంధనలను ఉల్లంఘించి ఆర్థికంగా స్వతంత్రంగా మారాలిని ఆమె కోరుకుంటోంది. అంతేగాదు ఆమె గతంలో లైవా మిస్ దివా సుప్రానేషనల్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక ఈ మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని ఇండోనేషియాకు చెందిన హరాష్ట హైఫా జహ్రా సొంతం చేసుకుంది. ఆమె ఇండోనేషియా ఎంట్రెప్రెన్యూర్, మోడల్, అందాల రాణి. ఆమె గతంలో పుటేరి ఇండోనేషియా 2024 కిరీటాన్ని పొందింది. ఆమె పర్యావరణ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. కాగా, ఈ అందాల పోటీల జాబితాలో ఫిన్లాండ్కు చెందిన అలెగ్జాండ్రా హన్నుసారి, థాయ్‌లాండ్‌కు చెందిన కసామా సూట్రాంగ్, ప్యూర్టో రికోకు చెందిన ఫియోరెల్లా మదీనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెథియా అంబ్రోసియో, దక్షిణాఫ్రికాకు చెందిన బ్రయోనీ గోవెండర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జెన్నా డైక్స్ట్రా, డెన్మార్క్ లార్సెన్‌కు చెందిన విక్టోరియా లార్సెన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?) -
'ఆంధ్రాపోరి' టైటిల్‌కు తొలగిన చిక్కులు
హైదరాబాద్: 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ మార్చాలన్న పిటిషన్‌ని గురువారం హైకోర్టు తిరస్కరించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ పై ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టుకెక్కింది. 'ఆంధ్రాపోరి' సినిమా పేరు తమ ప్రాంతం వారి మనోభావాలను కించపరిచేలా ఉందని పిటిషన్ లో పేర్కొంది. మహిళలను అభ్యంతకరంగా చూపించే విధంగా సినిమా టైటిల్ ఉందని తెలిపింది. తెలంగాణ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ సినిమా టైటిల్ మార్చాలని కోరిన విషయం తెలిసిందే. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న 'ఆంధ్రాపోరి'లో ఆకాశ్ పూరి సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల సంగీతం అందించారు.