breaking news
thupran town
-
మైక్రో ఫైనాన్స్ వేదింపులకు మహిళ బలి
సాక్షి, మెదక్: మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు మరో మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. తన ఇంటి నిర్మాణం కోసం పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.సమాచార ప్రకారం.. వరలక్ష్మి అనే యువతి మేడ్చల్‌లోని ఫైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్ నుండి 4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వడ్డీతో సహా 8 లక్షలకు పైగా చెల్లించినప్పటికీ ఇంకా తమకు బకాయి కట్టాల్సి ఉందని ఏజెంట్లు రోజూ ఇంటికి వచ్చి బాధితురాలిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అదేవిధంగా తూప్రాన్‌లోని క్రిష్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ నుండి తీసుకున్న 70 వేల రుణంలో ఇంకా 20 వేల రూపాయలు బకాయి ఉన్నాయని దీనికిగాను ఏజెంట్లు తరచూ రావడం వల్ల కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురైందని సమాచారం.ఇక ఈ నేపద్యంలో ఈరోజు ఉదయం కూడా లోన్ రికవరీ ఏజెంట్లు వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో దురుసుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన వరలక్ష్మి కొద్ది సేపటికే సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న తూప్రాన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరలక్ష్మిని వేధించిన రికవరీ ఏజెంట్లపై కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్
విస్తరించనున్న వ్యాపారం, వాణిజ్యం నగర శోభను సంతరించుకోనున్న పట్టణం తూప్రాన్: మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఏదురుచూస్తున్న కల ఎట్టకేలకు సకారమైంది. దీంతో మండలంలో ఆనందం సంతరించుకుంది. రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర సంతోషం నెలకొంది. తూప్రాన్ మండలం.. హైదరాబాద్ నగరానికి 40 కీలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇప్పడికే అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. 44వ జాతీయ రహదారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వరకు రైలు మార్గం ఉండడం మండలానికి ఓ ప్రత్యేక గుర్తింపు అని చెప్పవచ్చు. అంతే కాకుండా మండలంలో రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్, అభ్యాస, ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులోను రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సరిహద్దు మండలం కావడంతో ఉక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. దీంతో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటుకు వ్యాపారవేత్తలు మక్కువ చూపుతున్నారు. కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో టీఎస్ఐఐసీని సుమారు 11 వందల ఎకరాల్లో ఏర్పాటు చేయడంతో ఇప్పటికే సుమారు 40 పరిశ్రమలు నిర్మాణం జరుగగా వీటిలో 25 పారిశ్రమల వరకు ఉత్పత్తి ప్రారంభించాయి. మండలంలో మొత్తం 100కు పైగా పరిశ్రమలున్నాయి. పంచయతీలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటి వరకు సిద్దిపేట ఆర్డీఓ పరిధిలో కొనసాగిన తూప్రాన్ మండల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలు పడ్డారు. భూముల విషయంలో ఏదైన సమస్య తెలెత్తితే 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు వెళ్లడానికి రోజంతా సరిపోయేది. పోయిన పని అయితే సరి.. లేదంటే తిరిగి మరుసటి రోజు వేళ్లాల్సి వస్తే.. వారి బాధలు వర్ణాణాతీతం. కాని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తూప్రాన్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో... తూప్రాన్ మండలం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో దినదిన అభివృద్ధి చెందుతూ వస్తోంది. విద్యాపరంగా వివిధ రకాల 21 కళాశాలలు, వ్యాపార, వాణిజ్యం, 44వ జాతీయ రహదారి, దక్షిణ మధ్య రైల్వే మార్గంతో పాటు రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండలంలో పోలీస్ సబ్ డివిజన్, టీపీసీపీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిష్టర్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మండలం ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి సౌలభ్యం ఏర్పడనుంది.


