ప్రముఖ మలయాళ నటి కల్పన మృతి
హైదరాబాద్ : ప్రముఖ మలయాళ నటి కల్పన (50) కన్నుమూశారు. ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ఆమె తాను బస చేసిన హోటల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి .... హుటాహుటీన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కల్పన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై వెలుగుతున్న ఆమె సుమారు 300 చిత్రాల్లో నటించారు. మలయాళంతో పాటు తెలుగులో సతీ లీలావతి, బ్రహ్మచారి తదితర చిత్రాల్లో నటించిన కల్పన 'తనిచల్లా న్యాన్' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా పురస్కారాన్ని పొందారు . కాగా ప్రముఖ నటి ఊర్వశి ...కల్పనకు సోదరి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.