breaking news
Temperatures 40 degrees
-
భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ వచ్చీ రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల వేడి.. కరువు దాడి -
TS: మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెదపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
భానుడి పగ... భగ...
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎండల ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గడచిన వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, రోగులు ఎండలకు తాళలేక, ఉక్కబోతను తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కొందరైతే ప్రాణలను గుప్పెట్లో పెట్టుకొని, ఇల్లు కదలకుండా నీడపట్టునే ఉంటున్నారు. అయినా అజాగ్రత్తగా వీధుల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చినవారు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు తట్టుకోలేక 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెపుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని దినసరి కూలీలు, పొట్టపోషణకోసం తప్పని సరిపరిస్థితుల్లో ఎండలో పనులు చేసేందుకు సాహసించినవారు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలే కావడం గమనార్హం. ఉపాధి పనుల వేళలు మార్చాలని అధికారులు ఆదేశిస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అమలు కావడంలేదు. ఇక ఇతర నిర్మాణ పనులు, కూలీలకు ఎండ దెబ్బ తప్పడంలేదు, జిల్లాలో గడచిన వారంరోజుల్లో 20 మందికి పైగా మృతి చెందగా, కేవలం ఆరుగురే చనిపోయినట్టు ఆధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇవికాకుండా శుక్రవారం ఇచ్చాపురం, మందస, జి సిగడాం తదితర మండల్లాలోపది మంది మృతిచెందారు. వీరంతా కూలీలే. ఇప్పటి వరకు జి.సిగడాం మండలంలోని అప్పలస్వామి, శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు, సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎ.రామ్మూర్తి, వీరఘట్టం మండలంలోని బుడ్డీ, ఆమదావలసలో అమ్మన్నమ్మ, మెళియాపుట్టిలో ఎస్.సాయికిరణ్ వడగాడ్పులకు మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. మిగిలినవారిని వేర్వేరు కారణాలతో సాధారణ మరణాలుగానే అధికారులు గుర్తిస్తున్నారు. అయితే వడగాడ్పులకు మృతి చెందినవారి కుటుంబీకులకు సర్కారు ఏ విధంగా ఆదుకుంటుందన్నది తెలియరావడంలేదు. గత ఏడాది వడగాడ్పులకు మృతి చెందిన 23 మందికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది, ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.