breaking news
Telangana private medical colleges
-
21 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్ యూజీ– 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.స్టేట్ కౌన్సెలింగ్ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లురాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్) డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్‌లోని 100 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. -
బ్యాంకు గ్యారంటీకి పట్టు!
కోర్సు ఫీజుకు సర్కారే కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని ప్రైవేట్ వైద్య కళాశాలల డిమాండ్ విద్యార్థులకు నరకం చూపిస్తున్న కాలేజీలు హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు తమ తీరు మార్చుకోవడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలకు సాధ్యంకాని రీతిలో కోర్సు ఫీజు మొత్తానికి బ్యాంక్గ్యారంటీ కావాల్సిందేనని పట్టుపడుతున్నాయి. కోరుకున్న వారికి సీట్లు అమ్మేసుకొని ఇలా బ్యాంకు గ్యారంటీ పెట్టారనే ఆరోపణలున్నాయి. యాజమాన్యాల తీరుపై విద్యార్థులతోపాటు ప్రభుత్వం కూడా గుర్రుగా ఉంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీలోని 35 శాతం యాజమాన్య కోటాలో 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 డెంటల్ సీట్లున్నాయి. వాటికి తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించిన సంగతి తె లిసిందే. ఈ నెల 21, 22 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి సంబంధించి రూ. 9 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన నాలుగేళ్లకు సంబంధించి 36 లక్షల బ్యాంకు గ్యారంటీ చూపాలని స్పష్టం చేశారు. అలాగే నాలుగేళ్ల బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఫీజు చెల్లించడంతోపాటు... మిగిలిన మూడేళ్ల ఫీజు రూ. 12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరారు. దీన్ని పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎంసెట్ అడ్మిషన్ కమిటీ సోమవారం సమావేశమైంది. విద్యార్థులు చదువు మానేసి మధ్యలో వెళ్లిపోతే తమకు నష్టం వస్తుందని, అందుకే నాలుగేళ్ల కోర్సు ఫీజుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలు పట్టుబట్టాయి. సమావేశం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పాపిరెడ్డి ఒక లేఖలో వివరించారు. ప్రైవేటు యాజమాన్యాల ఒంటెత్తు పోకడతో విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంక్ గ్యారంటీ కోసం అధిక వ డ్డీలకు అప్పులు చేస్తున్నారు. కొందరైతే తమ పిల్లల పెళ్లిళ్లకు సంపాదించుకున్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెడుతున్నారు.