140 కేజీల గంజాయి పట్టివేత
మాడుగుల : మండలంలోని తాటిపర్తి పంచాయితీ గరికి బంద చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ పోలీసులు శనివారం 140 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం వివరాలివి. ముందస్తు సమాచారం మేరకు తాటిపర్తి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. అదే సమయంలో పాడేరు నుంచి బొలోరా వాహనంలో తలిస్తున్న గంజాయి పట్టుబడినట్టు చెప్పారు. ఏడు మూటల్లో ఉన్న ఈ గంజాయి 140 కేజీలుంటుందని, దీని విలువ సుమారు రూ. 10లక్షలుగా పేర్కొన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పాడేరుకు చెందిన పాంగి బుజ్జి, అదే మండలం ఇసుక గరువుకు చెందిన కొర్ర మహేష్‌లను అరెస్టు చేశామన్నారు.