breaking news
taser gun shot
-
ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు
ట్రాఫ్రిక్ నియమాలను ఉల్లంఘించి కొంతమంది పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్లపై హల్చల్ చేస్తుంటారు. పోలీసులు వారిని ఛేజింగ్ చేసి పట్టుకునేందుకు యత్నించినా కూడా దొరకకుండా వెళ్లిపోతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తప్పించుకునే క్రమంలో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...అమెరికాలో ఒక వాహనదారుడు నెంబర్‌ప్లేట్ లేకుండా రోడ్డుపై హల్చల్ చేయడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఐతే సదరు వాహనదారుడు పోలీసులకు దొరక్కుండా పారిపోయేందుకు యత్నించే క్రమంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో పోలీసులు అతన్ని నియంత్రించే క్రమంలో టేజర్ అనే ఎలక్ట్రిక్ గన్సాయంతో కాల్పులు జరిపారు. ఐతే ఆ వ్యక్తి ఆ సయంలో తన వీపుకి గ్యాసోలిన్ ప్యాక్‌ని తగిలించుకున్నాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ నుంచే దూకేశాడు. దీంతో పోలీసులు టేజర్‌తో నియంత్రించేందుకు యత్నించారు. అంతే ఒక్కసారిగా ఆ వాహనదారుడు చట్టు భగ్గుమని మంటలు వ్యాపించాయి. ఆ వాహనదారుడు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక యంత్రంతో ఆ మంటలను ఆర్పి తక్షణమే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులో సదరు వాహనదారుడిని 38 ఏళ్ల క్రిస్టోఫర్ గేలర్గా గుర్తించారు. అతను ఇన్సూరెన్స్ చేయని బైక్‌పై డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నిర్లక్షపూరితంగా డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. అతను బ్యాక్‌ప్యాక్‌లో ఒక గ్యాలన్ గ్యాసోలిన్‌ని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. మరికొద్దిరోజుల్లో సదరు వాహనదారుడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. (చదవండి: డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు) -
గన్ పరీక్ష కోసం.. డీజీపీ సాహసం!!
-
గన్ పరీక్ష కోసం.. డీజీపీ సాహసం!!
ఆయన సాక్షాత్తు డీజీపీ. రాష్ట్రంలోని పోలీసులందరికీ అత్యున్నత అధికారి. అలాంటి వ్యక్తి.. ఓ తుపాకిని పరీక్షించడానికి తానే టార్గెట్‌గా మారారు! స్వయంగా ముందుకొచ్చి, ఆ తుపాకిని తన మీద ప్రయోగించమని చెప్పారు. ఉగ్రవాదులను హతమార్చకుండా అరెస్టు చేయాలనుకున్నప్పుడు.. వాళ్లను నిరోధించడానికి ఉపయోగపడే 'టేజర్' గన్లను సరఫరా చేసే అమెరికా కంపెనీకి చెందిన భారతీయ యూనిట్ దాన్ని ప్రదర్శించి చూపించాలనుకుంది. అందుకోసం పోలీసుల వద్దకు ఆ గన్ తీసుకొచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు కూడా తనలాంటి మనుషులే కాబట్టి దాని షాట్ తగిలితే ఏమవుతుందోనన్న భయం ఉంటుందని భావించిన డీజీపీ జావేద్ అహ్మద్.. తానే స్వయంగా ముందుకొచ్చారు. ఆ గన్‌తో తనను కాల్చమని చెప్పారు. సాధారణంగా టేజర్ గన్ షాట్ తగిలితే దిమ్మతిరిగి.. వెంటనే కింద పడిపోతారు. అయితే డీజీపీ అలా పడిపోకుండా చూసేందుకు ఆయన పక్కన ఇద్దరు పోలీసులు నిల్చున్నారు. షాట్ తగలగానే ఆయన పడిపోతుంటే పట్టుకుని జాగ్రత్తగా పడుకోబెట్టారు. లేచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట.. ''చుక్కలు కనిపించాయి''. అలా అంటూనే ఆయన నవ్వేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిస్తేనే ఇలాంటి ఆయుధాలను కొనుగోలు చేయడానికి వీలుంటుందని, అలా ఒకవేళ కొనుగోలు చేయనిస్తే.. తాము యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు వాటిని అందిస్తామని అహ్మద్ చెప్పారు. డీజీపీ ఇలా టేజర్ షాట్ తీసుకుంటున్న వీడియో, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా వ్యాపించాయి. ఐపీఎస్ అధికారుల సంఘం డీజీపీని ఆకాశానికి ఎత్తేసింది. టీజర్లు రెండు ఎలక్ట్రోడ్లను అవతలి వాళ్ల శరీరంలోకి ఫైర్ చేస్తాయి. దాంతో ఆ వ్యక్తికి విద్యుత్ షాక్ తగులుతుంది. కొద్ది సెకండ్లపాటు అచేతనంగా మిగిలిపోతారు. దాంతో వాళ్లను అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఉగ్రవాదులు ఎక్కడైనా గదుల్లో దాక్కుని ఉన్నప్పుడు, లేదా ఎవరినైనా బందీలుగా తీసుకెళ్లినప్పుడు ఉపయోగించేందుకు తమకు ఇలాంటి ఆయుధాలు బాగా ఉపయోగపడతాయని యూపీ ఏటీఎస్ ఐజీ అసీమ్ అరుణ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత అప్పుడు వాటి కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.