breaking news
Tapori
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఆధారమైన టపోరి సత్య మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. సత్య తల్లి మాట్లాడుతూ..' సత్య ఆసుపత్రిలో వారం రోజులు ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సినిమాలకే అంకితమయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.' అని కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత చిత్రంలో టపోరి సత్య విలన్‌గా నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ బుల్లితెర నటుడు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాలకృష్ణకు పూరి జగన్నాథ్ ‘టపోరి’!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన చిత్రాలకు వెరైటీ టైటిల్స్ పెట్టడంలో ముందంజలో ఉంటాడు. ఇప్పటికే ‘రోగ్’ టైటిల్‌తో సంచలనం రేపిన పూరి... తాజాగా హీరో బాలకృష్ణతో చేస్తున్న చిత్రానికి ‘టపోరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్ ఎంటర్టైనర్గా ఉంటాయి. అంతేకాకుండా బాలయ్య సినిమా టైటిల్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో టపోరరి టైటిల్ క్యాచీగా ఉండడంతో పూరీ ఆ టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నాడట. ‘టపోరి’ హిందీ పదం కాగా తెలుగులో రౌడీ అని అర్థం. కాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ తన 101వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ గత చిత్రాలకు ఈ సినిమా భిన్నంగా ఉండనుందట. అందుకే బాలయ్య క్యారెక్టర్‌కు సరిపోయేలా ఈ సినిమాకు టపోరి పేరు సరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అధికారికంగా మాత్రం ‘టపోరి’ టైటిల్ ఇంకా కన్ఫామ్ కాలేదు