breaking news
tamilian
-
తమిళియన్ హెయిర్ స్టైలో ఇషా స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
ప్రధాని పీఠం ఈసారి తమిళులదే: జయ
సాక్షి, చెన్నై: ప్రధాని పీఠాన్ని ఇప్పటి వరకూ ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు చేపట్టారని.. ఈసారి ఆ అవకాశం తమిళులకు వస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. భారతదేశ భవిష్యత్తు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తల చేతుల్లో ఉందన్నారు. జయలలిత అధ్యక్షతన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయూలని ఈ సమావేశంలో తీర్మానించారు. అయితే, ఏ పార్టీవారైనా తమతో కలిసి రావాలనుకుంటే నిర్ణయం తీసుకునే అధికారాన్ని అమ్మ(జయలలిత)కే అప్పగిస్తున్నట్లు మరో తీర్మానం కూడా చేశారు. ఇలా మొత్తం 16 తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.. పొత్తులు లేకుండానే త మిళనాడు, పుదుచ్చేరిలోని 40 ఎంపీ సీట్లు గెలిచే సత్తా అన్నాడీఎంకేకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రాన్ని శాసించే స్థాయిలో రికార్డు గెలుపునకు కంకణబద్ధులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు అన్నాడీఎంకేపై నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని వమ్ము చేయకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు. దక్షిణాదిన ప్రధాని పీఠం చేపట్టడానికి జయలలితకు తగిన అర్హత ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ దిశగానే జయలలిత కూడా పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వడం విశేషం. జయలలితకు అన్ని అర్హతలు: జయలలిత పాలనాదక్షత, బహుముఖ నైపుణ్యాలను ప్రస్తుతిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. జయలలిత అసాధారణ దేశభక్తురాలని, నేతగా అన్ని భాషలు, మతాలను సమానంగా గౌరవించారని తెలిపింది. దేశాన్ని సూపర్‌పవర్‌గా మార్చేందుకు ఆమె తగిన వారని పేర్కొంది. ఆ దిశగా(ప్రధానిగా) జయలలితకు సానుకూల పరిస్థితి కల్పించేందుకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానాన్నీ కైవసం చేసుకునేందుకు కృషి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని పదవికి జయలలిత పేరు వినిపిస్తున్న తరుణంలో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నాడీఎంకే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. -
ఫేస్బుక్ కలిపింది ఇద్దరినీ!!
మెదడులో ట్యూమర్ వచ్చి, దాని కారణంగా మతిమరుపుతో బాధపడుతున్న ఓ భారతీయుడిని ఫేస్బుక్ కారణంగా గుర్తుపట్టగలిగారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో గల భారతీయ రాయబార కార్యాలయం వద్ద అతడు స్పృహకోల్పోయి పడి ఉన్నాడు. తమిళనాడులోని విల్లిపురానికి చెందిన దనిగైవేల్ గుణశేఖరన్ అనే ఈ వ్యక్తి ఫొటోను కొన్ని తమిళ సంస్థలు ఫేస్బుక్లో పోస్ట్ చేశాయి. దాదాపు 8వేల మంది అతడి ఫొటోను షేర్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఒకరు అతడిని గుర్తుపట్టారు. అక్టోబర్ నెలలో గుణశేఖరన్‌ను గమనించిన రాయబార కార్యాలయం అధికారులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే అతడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మతిమరుపుతో కూడా బాధపడుతున్నాడని గుర్తించారు. అతడికి తన పేరేంటో, సొంత ఊరేంటో, ఉద్యోగం ఎవరిచ్చారో, తన పాస్‌పోర్టు వివరాలేంటో.. ఏవీ గుర్తులేవు. దీంతో రాయబార కార్యాలయ అధికారులకు అతడో పెద్ద పజిల్‌గా మారాడు. సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష పథకం అమల్లో ఉన్నా, గుణశేఖరన్ గురించి ఏమీ తెలియకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో భారత రాయబార కార్యాలయ వర్గాలు తమిళ సంఘాలను సంప్రదించగా, ఓ సంస్థ ఫేస్బుక్ ద్వారా అతడి వివరాలు తెలుసుకుంది. అతడి పాస్‌పోర్ట్, వీసా కాపీలు అతడి భార్య వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా భారత అధికారులను సంప్రదించారు. ఇప్పుడు భారత రాయబార కార్యాలయం వాళ్లే అతడి చికిత్స ఖర్చులు చెల్లించారు. గుణశేఖరన్‌ను చెన్నై పంపేందుకు ఏర్పాట్లు చేశారు.