breaking news
T- JAC
-
‘చలో హైకోర్టును విజయవంతం చేయండి’
టీజేఏసీ ఆధ్వర్యంలో జూన్ 13న నిర్వహించ తలపెట్టిన చలో హైకోర్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ న్యాయవ్యాదుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొండల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధించి రెండేళ్లు అయిన నేటికి హైకోర్టును విభజించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ కార్యలయాలన్ని ఏపీకి తరలిస్తు హైకోర్టు విభజనపై మాత్రం మీనామేశాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు విభజనపై ఏపీ న్యాయవాదులకు ఆప్షన్లు ఇవ్వడంతో తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరగుతోందని, ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ న్యాయవాదులకు జడ్జీలయ్యే అవకాశం కోల్పోతారన్నారు. -
మరో పుస్తకం రాస్తా..
తెలంగాణలో 1998 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పుస్తకం రాసినట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండ రామ్ తెలిపారు. ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను వివరించానన్నారు. ప్రత్యేక రాష్ట్రం లభించినా.. సామాజిక మార్పు ఇంకా జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ, సామాజిక మార్పు వచ్చే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరిన్ని విషయాలతో మరో పుస్తకం రాయనున్నట్లు వివరించారు.