breaking news
t -20 match
-
టీ 20 మ్యాచ్ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
-
మ్యాచ్ సిడ్నీలో.. బెట్టింగ్ సిటీలో
సాక్షి, హైదరాబాద్: గోవాను అడ్డాగా చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృత పంథాలో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గురువారం ఏక కాలంలో మూడు చోట్ల దాడులు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 11 మంది సబ్– బుకీలు, ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.44.3 లక్షల నగదు, హాట్‌లైన్ బాక్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ముఠానే నగరంలో 70 శాతం బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ట్లు గుర్తించామన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావుతో కలసి వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో భాగంగా... దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకుంటున్న బెట్టింగ్ గ్యాంగ్స్ ఎక్కడికక్కడ బడా బుకీల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఇలాంటి ప్రధాన బుకీల్లో బేగం బజార్‌కు చెందిన విశాల్ లోథియా ఒకరు. ఇతడు గోవాను అడ్డాగా చేసుకుని బెట్టింగ్ దందా నడిపిస్తున్నాడు. అబిడ్స్ ప్రాంతంలో మనోజ్‌కుమార్ అగర్వాల్, బంజారాహిల్స్‌లో చిన్ని రాజేందర్, నారాయణగూడలో ముఖేశ్ కుమార్... ఇతడికి సబ్–బుకీలుగా వ్యవహరి స్తున్నారు. ప్రతి సబ్–బుకీ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. పంటర్ల వాయిస్ రికార్డులు సైతం... బెట్టింగ్ కాసే వ్యక్తి (పంటర్) నుంచి ఫోన్‌ను సబ్–బుకీ హాట్‌లైన్ బాక్సుకు మళ్లిస్తాడు. ఈ ఫోన్‌కాల్ అక్కడ రికార్డు అవుతుంది. పందెం ఓడిపోయిన తర్వాత తాను అలా బెట్టింగ్ కాయలేదని చెప్పకుండా ఇలా చేస్తుంటారు. మరోపక్క ప్రత్యేక పుస్తకాలు ఏర్పాటు చేసే సబ్–బుకీలు ప్రతి పంటర్‌కు ఓ పేజీ కేటాయిస్తూ డబ్బు చెల్లించాలా? వసూలు చేయాలా? అనేది అక్కడ నమోదు చేస్తుం టారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రధాన బుకీకి చేరవేస్తూ ఉంటారు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో సబ్–బుకీ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పందాలు అంగీకరిస్తుంటాడు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ–20 మ్యాచ్ నేపథ్యంలో విశాల్.. సబ్–బుకీలైన మనోజ్, రాజేందర్, ముఖేశ్‌లతో బెట్టింగ్స్ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో అబిడ్స్, బంజారాహిల్స్, నారాయణగూడల్లోని స్థావరాలపై గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. ముగ్గురు సబ్–బుకీలు, ఎనిమిది మంది ఏజెంట్లను పట్టుకున్నారు. ప్రధాన బుకీ విశాల్ కోసం గాలిస్తున్నామని, అతడిని విచారిస్తే భారీ నెట్వర్క్ గుట్టురట్టవుతుందని వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతా హాట్‌లైన్ ద్వారానే... బెట్టింగ్‌ల కోసం విశాల్ హాట్‌లైన్ బాక్సులు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో బాక్సుకు 36 ఫోన్లను కనెక్ట్ చేసే అవకాశ ముంటుంది. సబ్–బుకీ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను తొలుత హోల్డ్‌లో పెడతాడు. ఇదే బాక్సుకి అనుసంధానించి ఓ బ్రాడ్ కాస్టింగ్ ఫోన్ కూడా ఉంటుంది. మ్యాచ్ కు, టీవీలైవ్కు మధ్య కొంత సమయ ముంటుంది. దీన్ని ఆసరాగా చేసుకో వడా నికి ఓ ముఠా సభ్యుడు గ్రౌండ్‌లోనే ఉం టాడు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టిన ప్పుడు, వికెట్ పడినప్పుడు వెంటనే బ్రాడ్‌కాస్టింగ్ ఫోన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధానబుకీలకు ఏకకాలంలో సమాచారం ఇస్తాడు. అతడు దీని ఆధారంగా హోల్డ్‌లో ఉన్న కాల్స్ నుంచి అనువైనవి ఎంపిక చేసుకుని లాభాలు పొందుతాడు. క్రెడిట్ దాటితే బ్లాక్‌లిస్ట్... ఈ వ్యవహారంలో నేరుగా డబ్బు తీసుకువచ్చి పందాలు కాయరు. ప్రతి పంటర్‌కు కొంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది. అది దాటితే మాత్రం ఏజెంట్లను పంటర్ల వద్దకు పంపి నగదు వసూలు చేయిస్తుంటారు. ఎవరైనా పంటర్ పందెం కాసిన సొమ్ము చెల్లించకపోతే అతడిని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. సాధారణంగా పంటర్లు కొన్ని వెబ్సైట్లలో వచ్చే విశ్లేషణల ఆధారంగా పందాలు కాస్తుంటారు. దీంతో ప్రధాన బుకీలు వెబ్‌సైట్లతోనూ మిలాఖత్ అయి తమకు అనుకూలంగా విశ్లేషణలు చేయిస్తున్నారు. -
రోహిత్ నమ్మకం వమ్ము కాలేదు..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో జరిగిన టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కదం తొక్కాడు. తన అద్భుతమైన ఆటతో టి20లో వేగవంతమైన సెంచరీ(35బంతుల్లో) రికార్డును సమం చేశాడు. భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్‌కు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎలా వచ్చిన బంతిని అలా బాదేశాను. యువ ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. యువ బౌలర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శంచారు. వారిద్దరూ కలిసి ఆటను మార్చేశారు. వారిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఒత్తిడిని జయించి కూడా బౌలింగ్ చేయగలరు’ అని రోహిత్ ప్రశంసించారు. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, ఉనాద్కత్‌లకు తలో వికెట్ తీశారు. డబుల్ సెంచరీ గురించి ఆలోచించడం అత్యాశేనేమో. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటింగ్‌ను కొనసాగించడంలో నాకంటూ ఒక పద్ధతి ఉంది. దానినే ఇక్కడ చూపించాను’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఇండియా- శ్రీలంక మధ్య మూడో టి20 ఆదివారం ముంబైలో జరగనుంది. -
పాక్‌దే టి20 సిరీస్
హరారే: జింబాబ్వేతో జరిగిన రెండు టి20ల మ్యాచ్ సిరీస్నుపాకిస్థాన్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన రెండో టి20లో పాక్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో పాక్ రికార్డు స్థాయిలో 13 సార్లు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను గెలుచుకున్నట్టయింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు (12) ఉంది. అహ్మద్ షెహజాద్ (64 బంతుల్లో 98 నాటౌట్; 6 ఫోర్లు; 6 సిక్స్‌లు) దుమ్ము రేపగా మహ్మద్ హఫీజ్ (40 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 2 సిక్స్‌లు) నిలకడగా రాణించాడు. వీరిద్దరి జోరుతో పాక్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగుల స్కోరు సాధించింది. 36 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా ఆ తర్వాత ఈ జోడి పూర్తి ఆధిక్యం చూపుతూ రెండో వికెట్‌కు 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని ఏర్పరిచింది. పాక్ తరఫున టి20ల్లో షెహజాద్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మసకద్జాకు వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేయగలిగింది. మసకద్జా (32 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) టాపర్‌గా నిలిచాడు. తొలి వికెట్‌కు 50 పరుగులు చేకూరినా స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. చివర్లో చిగుంబురా (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్) చెలరేగి జట్టు విజయం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. హఫీజ్‌కు మూడు, బాబర్‌కు రెండు వికెట్లు దక్కాయి.