breaking news
swing bowling
-
అలాంటి పిచ్‌లపై గెలవడం గొప్పేమీ కాదు..
లండన్: ఇంగ్లీష్ జట్టుపై 3-1 తేడాతో గెలుపొందిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మాత్రం టీమిండియాపై తన అక్కసును వెల్లగక్కుతున్నాడు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత దేశపు పిచ్‌లపై టీమిండియా విజయాలు సాధించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదని పేర్కొన్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ గడ్డపై గెలిచినప్పుడే టీమిండియా అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని వెల్లడించాడు. టీమిండియా విజయవరంపర ఇంగ్లండ్‌లోనూ కొనసాగితే.. ఈ శకంలోనే అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందన్నాడు. స్వింగ్ బంతుల్ని ఎదుర్కొనేందుకు భారత ఆటగాళ్లు కష్టపడతారు కాబట్టే తాను ఈరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నానన్నాడు. టెస్టుల్లో టీమిండియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ జట్టుకు అధిక శాతం విజయాలు ఉప ఖండపు పిచ్‌లపైనే దక్కడం తన అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయన్నాడు. టెస్టు మ్యాచ్‌లు రెండు, మూడు రోజుల్లో పూర్తి కావడం సంప్రదాయ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాపడ్డాడు. మొటేరా వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో కోహ్లీసేన ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించి, న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. -
ఏదో ఒకటి వాడనివ్వొచ్చుగా!
న్యూఢిల్లీ: స్వింగ్‌ను రాబట్టేందుకు బంతి మెరుపు పెంచే ప్రయత్నంలో బౌలర్లకు సరైన ప్రత్యామ్నాయం చూపించాలని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయ పడ్డారు. షైనింగ్ కోసం ఉమ్ముకు బదులు మరేదైనా పదార్థాన్ని సూచించాలని ఆయన కోరారు. అన్ని జట్లు దాన్నే అనుసరించినపుడు ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవన్నారు. క్రికెట్లో సాధారణంగా బౌలర్లు ఉమ్ముతోనే బంతిని షైనింగ్ చేస్తారు. కరోనా మహమ్మారి వల్ల దీనిని ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో బయటి పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని పలువురు బౌలర్లు, కోచ్‌లు సూచిస్తున్నారు. దీనిపై భరత్ అరుణ్ మాట్లాడుతూ ‘మైనం లేదా వ్యాజిలీన్ లేదా మరేదైనా గానీ... ఏదో ఒకటి వాడే వెసులుబాటు ఇస్తే, అన్ని జట్ల బౌలర్లు దాన్నే వాడతారు. అటువంటి పదార్థాన్ని ప్రయత్నిస్తే తప్పేంటి’ అని అన్నారు. ఉమ్మును వాడే పద్ధతి నుంచి అంత తేలిగ్గా బయటపడమని, శిక్షణ శిబిరాల్లో తరచూ దానిపై అవగాహన కల్పిస్తే ఆ అలవాటు తగ్గుతుందని అరుణ్ చెప్పారు. -
'అందుకే బుమ్రాను తక్కువ అంచనా వేయద్దు'
హమిల్టన్ : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ తీయలేదు. తన కెరీర్లో ఇదే అత్యంత చెత్త రికార్డుగా భావించొచ్చు. ' గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మునుపటంతా పదును లేదని, అందుకే తరచూ విఫలమవుతున్నాడు. తన బౌలింగ్‌ను మార్చుకోవాలి.. అటాకింగ్ పెంచాలి. బుమ్రా వైఫల్యం వల్లనే భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది' అంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సైతం బుమ్రాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు.అయితే న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూసి ఈ మాట అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే : కివీస్ కెప్టెన్) న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 30వ ఓవర్ బుమ్రా బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే 82 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఫిన్ అలెన్, హెన్రీకూపర్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బుమ్రా చక్కటి బంతితో ఫిన్ అలెన్(20)ను పెవిలియన్ చేర్చాడు. బంతి ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా వెళ్తుందని భావించిన అలెన్ బ్యాట్ పైకి ఎత్తి బంతిని వదిలేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా బాల్ స్వింగ్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్‌కు గురైన అలెన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'వారెవ్వా! బుమ్రా.. నువ్వు నిజంగా తోపు బౌలర్‌వి. అందుకే అంటారు బుమ్రాను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దని' అంటూ కామెంట్లు పెడుతున్నారు.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా) Jasprit Bumrah looking in his element.. absolute ripper to dismiss Allen. #NZX1vIND pic.twitter.com/mcrLF56qUI — Subhayan Chakraborty (@CricSubhayan) February 15, 2020 -
అలా అయితే బాల్ స్వింగ్ అవుతుందా..?
యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ వేసవిలో ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులే స్థానిక జట్టుకు కలిసి వచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆకాశం మేఘావృతమై, ఆర్థ్రత తో కూడిన వాతావరణం ఇంగ్లండ్ పేసర్లకు అనుకూలించిందని.. టీవీ వ్యాఖ్యాతల నుంచి క్రికెట్ పండితుల వరకూ అంతా చెప్పుకున్నారు. అయితే... ఇంగ్లండ్ కు వాతావరణం ఎంతవరకూ కలిసి వచ్చింది? క్రికెట్ బంతి స్వింగ్ అయ్యేందుకు ఓవర్ కాస్ట్ కండిషన్స్ సాయాం చేస్తాయా? దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? ఆధారాల విషయాన్ని చర్చించే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ టాస్ గెలిచాడు. ఓవల్ సంప్రదాయానికి విరుద్దంగా.. అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 500పైగా రన్స్ చేసింది. ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఓవల్ టెస్ట్ కు ముందు స్థానికుల నుంచి టీవీ వ్యాఖ్యాతల వరకూ అందరూ వాతావరణం గురించే మాట్లాడారు. మేఘావృతమైన ఆకాశం, అధిక హుమిడిటీ.. వీటిపై ఎక్కడ లేని చర్చా జరిగింది. టాస్ గెలిచిన.. అలెస్టర్ కుక్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వాతావరణం స్వింగ్ కు అనుకూలిస్తుంది.. దీన్ని వినియోగించుకోవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. మరి టెస్ట్ ఇంగ్లండ్ ఎందుకు ఓడినట్లు... ఇక విషయంలోకి వస్తే.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ గురించి క్రికెట్ పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలుసు.. మరి ఓవల్ టెస్ట్ లో ఇంగ్లండ్ పేసర్లకు వాతావరణం ఎందుకు సాయం చేయ్యలేదు. అసలు వాతావరణం.. స్వింగ్ బౌలింగ్ కి లింక్ ఉందని మొదట చెప్పిందెవరూ..? 1972లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బాబ్ తొలి సారి ఈ విషయాన్ని కనుగొన్నాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. చారిత్రాత్మ లార్ట్ టెస్ట్ లో 16 వికెట్లు కూల్చిన బాబ్ అనంతరం రేడియో ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పాడు. మేఘావృతమైన పరిస్థితులు, గాలిలో తేమ శాతాన్ని ఉపయోగించుకుని తాను ఇన్ని వికెట్లు కూల్చానని చెప్పాడు. మరి సైంటిస్ట్ లు దీని గురించి ఏమని చెబుతున్నారు.. క్రీడల మీద ప్రయోగం చేసిన కొందరు శాస్త్ర వేత్తలు ఎరో డైనమిక్స్ ప్రయోగాలు జరిపారు.. విండ్ టన్నెల్ ద్వారా కృత్రిమ వాతావరణ పరిస్ధితులు ఏర్పాటు చేసి.. బంతి స్వింగ్ వ్యత్యాసాన్ని గమనించారు.. ఫలితాలు చాలా ఆశ్యర్యాన్ని కలిగించాయి. వాతావరణం బంతి స్వింగ్ లో తేడాలపై ఎలాంటి ప్రభావం వేయదని తేలింది. మరి ఇన్నేళ్లుగా క్రికెటర్లు... క్రీడా నిపుణుల అభిప్రాయం సరైంది కాదా.. ఉట్టి మూడ నమ్మకమేనా.. ? దీని గురించి నిపుణులు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. వాతావరణానికి.. బంతికి మధ్య సంబంధం.. ప్రేరణా జ్ఞానం (ప్రీ మోటివేటెడ్ కాగ్నిషన్) అని వివరించారు. అంటే మనకు తెలియ కుండానే.. మన గోల్స్... ప్రాధాన్యతలకు అనుకూల మైన విషయాలను నమ్మడం అని. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు కూడా జరిగాయి. వేరు వేరు సంస్కృతులు, నమ్మకాలు, రాజకీయ విశ్వాసాలు ఉన్న వారికి గ్లోబల్ వార్మింగ్, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై ప్రశ్నించగా.. భిన్నంగా స్పందించారు. దీనికి ప్రీ మోటివేటెడ్ కాగ్నిషన్ కారణమని నిపుణులు నిర్ణయానికి వచ్చారు. అలాగే.. క్రికెట్ బంతి స్వింగ్ పై వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉందని నమ్మడం కూడా ఇలంటి మానసిక స్థితే.. మేఘావృతమైన రోజు బంతి ఎక్కువ స్వింగ్ అవుతుందని క్రికెట్ నిపుణులు నమ్మారు.. ఎవరైనా దీనిపై శాస్త్రీ యపరిశోధనల గురించి ప్రశ్నిస్తే.. వారి క్రెడిబిలిటీ పోతుదని ప్రశ్నించడం మానేశారు. కొన్నేళ్లకు ఈ నమ్మకం బలపడింది. కొన్న సందర్భాల్లో నమ్మకానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా.. వాటికి మన మెదడు వేరే సమాధానాలు వెతుకు తుంది. ఉదాహరణకు మనం ముందు చెప్పిన ఓవల్ టెస్ట్ మ్యాచ్ విషయంలోనే.. ఇంగ్లండ్ బౌలర్లకు వాతావరణం ఎందుకు సహకరించలేదు...? అనేప్రశ్న ఉత్పన్నం అయితే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్వింగ్ బౌలింగ్ ను అత్యద్భుతంగా ఎదుర్కొన్నారు అనే సమాధానం లభిస్తుంది. అంతే కానీ.. స్వింగ్ కు వాతావరణం అనుకూలించలేదు అనే సమాధానం ఎవ్వరూ నమ్మరు. అంతే కాదు.. అందరూ నమ్మే విషయాన్ని విస్మరించి.. అలెస్టర్ కుక్ బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే.. అతని నిర్ణయాన్ని తప్పు పట్టే వారే. ఇక మన నిత్య జీవితంలో ఇలాంటి అనేక విషయాలను మనం నమ్ముతామని నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ వివరించాడు. ప్రజల్లో మూఢనమ్మకాలకు కూడా ఇదే కారణమని వివరించాడు. దీన్ని సరిదిద్దడం అంత సులువు కాదని అన్నాడు. మళ్లీ క్రికెట్ దగ్గరకు వస్తే.. ఆరోజు బాబ్ లోకల్ రేడియో ఇంటర్వ్యూలో ఏమన్నాడో చూస్తే..'ఉదయం లేవగానే నేను కిటీకీ బయటకి చూశాను. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఇలాంటి రోజు సరిగా బౌలింగ్ చేస్తే.. అత్యుత్తమ ఫలితాలు వస్తాయని అనిపించింది. సరిగ్గా నా బౌలింగ్ కు సరిపడే వాతావరణంలో బౌలింగ్ చేశా.. నాకు వికెట్లు దక్కాయి' అని అన్నాడు. దీంతో మనం ఓవర్ కాస్ట్ డే స్వింగ్ కు అనుకూలిస్తుందనే కంక్లూజన్ కు వచ్చాం. మరి ఇప్పుడేం చేయాలి.. క్రికెట్ పరిజ్ఞానం పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. అంతు లేని డేటా అందుబాటులో ఉంది.. ఒక్కసారి.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్న రోజు.. బంతి ఎంత స్వింగ్ అయ్యింది. మామూలు రోజు ఎంత స్వింగ్ అయ్యింది.. సరిచూసు కుంటే సరి.. కానీ.. క్రికెట్ లాంటి క్రీడలు చాలా నమ్మకాలపై ఆధారపడి కొనసాగుతుంటాయి.. వీటిని అధిగమించడం అంతసులువేం కాదు.