'అందుకే బుమ్రాను తక్కువ అంచనా వేయద్దు'

Jasprit Bumrah Bowls Absolute Ripper To Dismiss New Zeland Batsman - Sakshi

హమిల్టన్ : టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ తీయలేదు. తన కెరీర్‌లో ఇదే అత్యంత చెత్త రికార్డుగా భావించొచ్చు. ' గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మునుపటంతా పదును లేదని, అందుకే తరచూ విఫలమవుతున్నాడు. తన బౌలింగ్‌ను మార్చుకోవాలి.. అటాకింగ్ పెంచాలి. బుమ్రా వైఫల్యం వల్లనే భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది' అంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు సైతం బుమ్రాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు.అయితే న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూసి ఈ మాట అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసిన తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే : కివీస్‌ కెప్టెన్‌)

న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 30వ ఓవర్‌ బుమ్రా బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే 82 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఫిన్ అలెన్, హెన్రీకూపర్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బుమ్రా చక్కటి బంతితో ఫిన్ అలెన్(20)ను పెవిలియన్ చేర్చాడు. బంతి ఔట్‌సైడ్‌ ఆఫ్ స్టంప్‌గా వెళ్తుందని భావించిన అలెన్ బ్యాట్ పైకి ఎత్తి బంతిని వదిలేయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా బాల్‌ స్వింగ్‌ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్‌కు గురైన అలెన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'వారెవ్వా! బుమ్రా.. నువ్వు నిజంగా తోపు బౌలర్‌వి. అందుకే అంటారు బుమ్రాను ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దని' అంటూ కామెంట్లు పెడుతున్నారు.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top