breaking news
Svamitva Scheme
-
చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి
న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్‌లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్‌గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. మృత మూలధనం కాదు ‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం. స్వామిత్ర (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం. -
కేంద్రం తెచ్చిన స్వమిత్వ పథకం ఏంటి? ఉపయోగాలేంటి?
సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్‌గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు. పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు స్వమిత్వ పథకం అంటే... సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఉపయోగం ఏంటీ.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..