breaking news
sub register
-
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకట నారాయణ సస్పెన్షన్
-
సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్
-
మానవత్వం చాటుకున్న సబ్ రిజిస్ట్రార్
సాక్షి, వెంకటాపురం(వరంగల్): నిరుపేద కుటుంబానికి చెందిన ముస్లిం యువతి వివాహానికి ములుగు సబ్‌రిజిస్ట్రార్ సాయం అందించి ఉదారత చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన గౌసియ అనే యువతి వివాహానికి సర్వర్ చారిటబుల్ ట్రస్టు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీరువా అందించారు. గ్రామానికి చెందిన మహ్మద్ షాబీర్– తహెర దంపతులకు 5 మంది ఆడపిల్లలు ఉండగా గత 12 సంవత్సరాల క్రితం షాబీర్ మృతిచెందారు. దీంతో తల్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి ముగ్గురు కూతుర్ల వివాహం చేయగా నాలుగో సంతానమైన గౌసియ వివాహం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. నిరపేద యువతి వివాహానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు చేయగా స్పందించిన సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ తనవంతుగా బీరువా అందించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు మామిడిపెల్లి రమేష్, చంటి సామ్యూల్, చంటి అనిల్, మహ్మద్ జహీర్, అంకూస్, జాకీర్, అఖిల్, తిరుపతి, జాన్, అశోక్, బన్ని, ప్రవీణ్, వివేక్, అనిల్ పాల్గొన్నారు. చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక -
ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అక్రమాలపై తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్ లో ఈ తరహా అక్రమాలకి చోటు లేకుండా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. మరోవైపు నకిలీ చలానాల కుంభకోణంపై రెండు రోజులలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సమారు రూ.3 కోట్ల వరకు స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఆ తర్వాత కడప జిల్లాలో కోటి రూపాయిలకి పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలతో పాటు రికవరీపై దృష్టి సారించి ఇప్పటి వరకు 50 శాతం వసూలు చేశామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ ఎంవి శేషగిరిబాబు తెలిపారు. రాష్డ్ర వ్యాప్తంగా మొత్తం 17 రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ అక్రమాలు బయటపడ్డాయి...ఈ నేపధ్యంలో గత నాలుగు రోజులగా అధికారులు ఆయా కార్యాలయాలలో 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లని తనిఖీ చేయగా 30 వేల డాక్యుమెంట్లలో నకిలీలని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు అక్రమార్కులపై చర్యలకి ఉపక్రమించారు. ఈ అక్రమాలపై పూర్తిస్ధాయిలో దర్యాప్తుకి కమీషనర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ అదనపు ఐజి ఆద్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసారు. చదవండి:రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, మక్తల్(మహబూబ్‌నగర్): లంచం తీసుకుంటూ మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ హబీబొద్దిన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు తాను కొనుగోలు చేసిన భూమిని తమ పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరగా.. రూ.75వేలు డిమాండ్ చేశాడు. ఈమేరకు సదరు రైతు ఏసీబీ అధికారులకు విషయం చెప్పాడు. చివరికి ఓ మధ్యవర్తి ద్వారా లంచం డబ్బులను తీసుకోగా.. సదరు సబ్‌రిజిస్ట్రార్‌ను, మధ్యవర్తిని గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న విషయం తెలియడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. 18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయమై.. హైద్రాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి మక్తల్ మండలం సంగంబండకి చెం దిన రైతుల దగ్గర సర్వే నంబర్ 200లో 18 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ భూమిని తాను, తన సోదరుడి పేర్లపై రిజిస్ట్రేష న్ చేసుకునేందుకు రెండు సార్లు కార్యాలయాని కి వెళ్లి విన్నవించాడు. ఎంతకూ సదరు సబ్రి జిస్ట్రార్ హబీబొద్దీన్ లెక్కచేయలేదు. అసలు వి షయం కనుక్కునేందుకు కొందరిని సంప్రదిం చాడు. దీంతో ఓ మధ్యవర్తి లంచం డిమాండ్ చేశాడు. ఎన్నో భేరసారాల తర్వాత చివరికి రూ.75వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నాడని తెలిపారు. దీంతో చేసేది లేక మొదట పని పూర్తి చేయాలని, తర్వాత డబ్బు ఇస్తానని రైతు పేర్కొన్నాడు. గతంలో ఇద్దరు అధికారులు గత 15ఏళ్ల క్రితం మక్తల్‌కు చెందిన రైతు భూమి రిజిస్టేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఇదే కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులకు పట్టించారు. అలాగే, మూడేళ్ల క్రితం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓను ఏసీబీ చేతికి పట్టించారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దీన్ను పట్టుకోవడంతో ఏసీబీ దాడులు నిర్వహించడం పట్టణంలో మూడోసారి అవుతుంది. వల పన్ని పట్టుకున్నారిలా.. ఈమేరకు 18ఎకరాల భూమిని రైతు వెంకట్‌రెడ్డి, అతని సోదరుడి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారి హబీబోద్దీన్తో ఈ నెల 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఈ నెల 14వ తేదీన భూమి రిజిస్ట్రేషన్ చేయించారు. పని పూర్తయ్యిందని, ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇవ్వాల్సిందిగా రైతును కోరారు. వెంటనే రైతు జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులకు 1064 నంబర్‌కు ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన వారిని ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. గురువారం మక్తల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తమ భూమికి సంబందించిన పత్రాలను తీసుకునేందుకు రైతు వచ్చాడు. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్ హబీబొద్దిన్ దగ్గర ఉండే మక్తల్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి అరీస్కు రైతు వెంకట్‌రెడ్డి రూ.75వేలు అందజేశాడు. అనంతరం డబ్బులను అరిస్ సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారమే రైతు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు ప్రవీణ్‌కుమార్, లింగంస్వామి సబ్‌రిజిస్ట్రార్‌ను తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి చేతులు కడిగించి ఎరుపు రంగు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ హబీబోద్దిన్, అతనికి సహకరించిన అరిస్.. ఇద్దరిని పట్టుకున్నారు. సాయంత్రం 6.30 వరకు కార్యాలయంలోనే విచారణ జరిపి అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రతాప్ విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు సంప్రదించాలని ఆయన సూచించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొ దర్యాప్తు జరుపుతామని తెలిపారు. కార్యాలయంలో.. అంతా ఇష్టారాజ్యం మక్తల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అసలు సమయ పాలనే లేదు. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు వస్తే అప్పుడే రిజిస్టేషన్ చేయాలి. చాలామటుకు లావాదేవీలన్నీ ఫోన్లు, మరికొందరు దళారులు, కార్యాలయం వద్ద ఉన్న కొందరు డాక్యుమెంట్ షాపులకు చెందిన వారి ద్వారానే జరిగేవని పేర్కొంటున్నారు. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా డబ్బులు ఇస్తేనే పనులు చేయండని.. గతంలో అధికారులు ఇలాగే ఉండేవారని, మీరు కూడా అదే బాటలో నడవాలని కొందరు దళారులు మాయమాటలు చెప్పి నడిపించేవారని కింది స్థాయి అధికారులు కొందరు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తేనే పని అవుతుందని, చేయి తడపకపోతే వారికి కంప్యూటర్ పని చేయడంలేదు, సర్వర్ పనిచేయడంలేదంటూ ముప్పతిప్పలు పెట్టేవారని ప్రజలు వివరిస్తున్నారు. -
అసలెవరు.. నకిలీలెవరు ?
న్యూశాయంపేటకు చెందిన ఓ వ్యక్తి తన 400 గజాల భూమిని అవసరాల నిమిత్తం విక్రయించేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదర్చుకుని బయానా తీసుకున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం తన కుటుంబసభ్యులు, కొనుగోలుకు అంగీకరించిన వ్యక్తితో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే ప్రతీరోజు నంబర్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నందున రేపు రావాలని ఉద్యోగులు సూచించారు. మరలా హైదరాబాద్ నుంచి కుటుంబం, కొనుగోలు చేసిన వ్యక్తితో కలిసి రాలేనని చెప్పినా అంగీకరించలేదు. ఇదంతా చూస్తున్న ఓ డాక్యుమెంట్ రైటర్ తన కార్యాలయంలోకి తీసుకెళ్లి ‘నేను ఈ రోజే మీ రిజిస్ట్రేషన్ చేయిస్తాను, నాకు రూ.10వేలు ఇవ్వండి’ అని చెప్పాడు. దీంతో ఆ డబ్బు ఇవ్వగా సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాడు. హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి పలివేల్పులలోని 300 గజాల భూమిని కొనుగోలు చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు యజమానికి బయానా ఇచ్చేందుకు సిద్ధమైన ఆయన.. భూమి ఎవరికైనా ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ అయిందా, లేక భూయజమాని పేరిటే ఉందా అనే సందేహంతో ఈసీ(ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికెట్) కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. దీనికి ‘మీ సెల్ఫోన్లో టీఎస్ ఫోలియో యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి.. లేదంటే బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్లను కలవండి’ అనే సలహా కార్యాలయ సిబ్బంది నుంచి వచ్చింది. దీంతో బయట డాక్యుమెంట్ రైటర్‌ను కలవగా కార్యాలయానికి చెల్లించాల్సిన డబ్బుతో పాటు అదనంగా రూ.500 తీసుకుని క్షణాల్లో ఈసీ అందజేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని ఎక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూసినా బినామీలు, దళారుల హవానే కనిపిస్తోంది. అధికారులకు ఇదంతా తెలిసినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడం క్రయ, విక్రయదారులకు శాపంగా మారింది. సాక్షి, వరంగల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడుగుపెడితే.. అక్కడ ప్రైవేట్ వ్యక్తులెవరో, శాఖ ఉద్యోగులెవరో ఎంతటి ఘనులైనా కనుక్కోలేరు! కార్యాలయాల్లో హడావుడిగా తిరుగుతూ చకచకా పనులు చేస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలపై సబ్‌రిజిష్ట్రాలతో సంతకాలు పెట్టిస్తూ... ‘ఆజ్ నై.. కల్ ఆవో’ అంటూ ప్రజలపై పెత్తనం చేస్తూ.. పని కాగానే ‘పద్ధతి’ని పాటించాలంటూ బహిరంగంగానే అమ్యామ్యాలు డిమాండ్ చేసే వారిని చూడొచ్చు. ఇలాంటి వారిని మనం ప్రైవేట్ వ్యక్తులని ఎవరూ భావించం. విలువైన రికార్డుల గదుల్లోనూ అంతా తామై పనులు చక్కపెట్టే వీరి వ్యవహార తీరు అచ్చం శాఖ ఉద్యోగులను తలపిస్తుంది. అధికారులతో వీరు వ్యవహరించే పద్ధతిని పరిశీలిస్తే కూడా ఇదే అనిపిస్తుంది. కానీ ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులే ఇందులో ఉంటారు. అధికారుల అండదండలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులు ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని విభాగాల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతుండటంతో ‘మూడు డాక్యుమెంట్లు... ఆరు రిజిస్ట్రేషన్లు’ అన్న చందంగా అక్రమాలు సాగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులు అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఎవరైనా అంటే... అమ్మేవారు, కొనేవారు ముందకొచ్చి, తమకు, శాఖకు లాభం ఉంటే చాలు చార్మినార్‌నైనా రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుంటారు. అసలే మాయాజాలంతో సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురు.. ఉద్యోగుల వైఖరిని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన రిజిస్ట్రేషన్ పత్రం నకిలీదా, సరైనదా అనే విషయం పరిశీలించకుండా, తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించకుండానే కొందరు ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పొలం, స్థలం, భవనం ఇలా దేనినైనా రిజిస్ట్రేషన్ చేసే ముందు కొనే వ్యక్తి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ స్థలం అవతలి వ్యక్తిదేనా అన్నది విచారించాలి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆలా జరగడం లేదు. ఒక్కో పొలం, స్థలం, భవనం నాలుగైదు సార్లు హక్కుదారులకు తెలియకుండానే చేతులు మారుతున్నా సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో రూ.లక్షలు చేతులు మారుతున్నాయని సమాచారం. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో 2002లో అప్పటి వరకు ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్లను లైసెన్సు రెన్యూవల్‌ను నిలిపివేసింది. అయినా ఉమ్మడి జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూరా యథేచ్ఛగా డాక్యుమెంట్ రైటర్ల అడ్డాలు ఉండడం.. వీరు చెప్పినట్లే అంతా నడుస్తుండడం గమనార్హం. డాక్యుమెంట్ రైటర్లుగా రిటైర్డ్ సబ్రిజిస్ట్రార్లు పారదర్శకంగా రిజిస్ట్రేషన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది పబ్లిక్ డేటా ఎంట్రీని అమల్లోకి తీసుకొచ్చింది. శాశ్వతమైన దస్తావేజులను స్వయంగా తయారు చేసుకునే వెసలుబాటు లభించింది. ఈ విధానంలో స్వయంగా ఇంట్లోనే దస్తావేజు తయారు చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు హాజరైతే సరిపోతుంది. కానీ దస్తావేజుదారులు తమ పని పోగొట్టుకోలేక సబ్ రిజిస్ట్రార్లతో ములాఖత్ అయి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వారిని తమ వద్దకు పంపించేలా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో పబ్లిక్ డేటా ఎంట్రీ పక్కదారి పట్టి భూక్రయ విక్రయదారులు తిరిగి డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వరంగల్ ఆర్వో కేంద్రంగా కార్యాలయ ఎదుట, చుట్టుపక్కల 40 నుండి 60వరకు డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే, రిటైర్డ్ అయిన సబ్ రిజిస్ట్రార్లు పలువురు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తారంటే ఇందులో ‘లాభం’ ఎంత ఉందో ఇట్టే అవగతమవుతుంది. -
సబ్‌రిజిస్ట్రార్‌పై టీఅర్ఎస్ నేత వీరంగం
-
ఏసీబీకే కళ్లు తిరిగేలా..
► గాజువాక సబ్ రిజిస్టార్ అక్రమాస్తుల చిట్టా సాక్షి, విశాఖపట్నం/గాజువాక/కూర్మన్నపాలెం/అక్కిరెడ్డిపాలెం: గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్యనాయుడు అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులకే కళ్లు బైర్లుకమ్మాయి. నాలుగేళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా ఉన్నా.. అక్రమార్జనలో ఏమాత్రం వెనుకబడని అతని సంపాదన కోట్లకు పడగలెత్తింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో 12 మంది అధికారులు ఏక కాలంలో 10 చోట్ల జరిపిన సోదాల్లో బయటపడ్డ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం రూ.6 కోట్లు. మార్కెట్ రేటు రూ.25 కోట్లకుపైనే ఉంటుంది. విశాఖతో పాటు చిత్తూరు జిల్లాల్లో వెంకయ్యనాయుడు నివాసంతో పాటు అతని బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ ఈ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్ల డించారు. ఆది నుంచి అక్రమాల దారి 1995 జూన్ 9న గ్రూప్–2 ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెంకయ్యనాయుడు అడుగుపెట్టా డు. సబ్ రిజిస్ట్రార్‌గా నెల్లిమర్ల, నర్సీపట్నంలో రెండేళ్లు, గాజువాకలో ఆరేళ్లు, లంకెలపాలెంలో మూడేళ్లు, ద్వారకానగర్‌లో మూడేళ్లు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఏడాదిన్నర, మధురవాడలో మూడు నెలలు పని చేశాడు. ఏడాదిన్నరగా గాజువాక సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధురవాడలో ఉన్న మూడు నెలల్లో కూడా అవినీతిలో మునిగితేలిన వెంకయ్యనాయుడు 2011 జనవరి 25న ఏసీబీ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని వద్ద అన్ అకౌంట్ మనీ రూ.85,810 ను కనుగొన్న అధికారులు కేసు నమోదు చేయడంతో నాలుగేళ్లు సస్పెండ్ అయ్యాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. శ్రీకాకుళంలో పనిచేసిన ఏడాదిన్నరలోనే ఐదుగురితో కలిసి పార్వతీపురంలో 83 ఎకరాల్లో ప్లాట్లు వేసి విక్రయించాడు. అక్రమాస్తుల చిట్టా ఇదీ.. : వెంకయ్యనాయుడు తన ఆస్తుల్లో కొంత భాగం తన భార్య, మామ, బావమరిది, సోదరులు, బంధువులు, బినామీల పేరుమీద పెట్టాడు. వారి ఇళ్లలో కూడా సోమవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ► నగరంలోని మహారాణిపేట ప్రాంతంలో వెంకయ్యనాయుడు నివాసం గోవిందం అపార్ట్‌మెంట్స్‌లో భారీగా డాక్యుమెంట్లు, నగలను అధికారులు గుర్తించారు. ►గాజువాకలో ఒక వ్యక్తి నుంచి రూ.1.80 కోట్ల విలుౖ వెన భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ► నరవలో భారీ సంఖ్యలో ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లను కనుగొన్నారు. ► షీలానగర్‌లో నివాసముంటున్న సబ్ రిజిస్ట్రార్ రెండో భార్య సోదరుడు అశోక్, తిరుమలనగర్‌లోని వి.రమణ, గాజువాక అఫీషియల్ కాలనీలో ఉంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మల్లేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వెంకయ్యనాయుడు బావమరిది అశోక్ స్థానిక గంగవరం పోర్టులో పనిచేస్తున్నట్లు సమాచారం. ► అఫీషియల్ కాలనీలో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివిధ రసీదులు, షీలానగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదాలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ► దువ్వాడ స్టేషన్ రోడ్డు అప్పికొండ కాలనీలో నివాసం ఉంటున్న ఉక్కు ఉద్యోగి విందుల రమణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అతను వెంకయ్యనాయుడుకు తమ్ముడి కుమారుడు. ► వెంకయ్యనాయుడు భార్య కొమ్మినేని రూప, విందుల రమణల భాగస్వామ్యంతో పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో మూడు లే –అవుట్లను వేసి విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. రూ.1.26 కోట్ల విలువైన మూడు డాక్యుమెంట్లు, మూడు అగ్రిమెంట్లు లభ్యమయ్యాయి. ► నిజానికి భార్య రూపతో 2004లోనే విడాకులు తీసుకున్నప్పటికీ ఆమెతో వెంకయ్య సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమె తండ్రి గురవయ్యనాయుడు పేరుమీద తిరుపతిలో కొమ్మినేని రెసిడెన్సీ కొనడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయిస్తున్నాడు. -
‘రిజిస్ట్రేషన్’కు కార్పొరేట్ కళ
వినియోగదారులకు మెరుగైన వసతుల కల్పనకు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ అతి త్వరలోనే కార్పొరేట్ కళను సంతరించుకోబోతున్నాయి. ఇప్పటివరకు అరకొర వసతులతో అధ్వాన స్థితిలో కనిపించే ఆయా కార్యాలయాల్లో.. ఇకపై వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పించాలని రిజిష్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఏడాదికి సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని అందించే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి వసతుల కల్పనకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వినియోగదారులకు పరిశుభ్రమైన మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం, కూర్చునేందుకు మంచి ఫర్నిచర్, డాక్యుమెంట్లను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన స్టేపుల్స్, పిన్నులు, ఫొటోలను అతికించేందుకు గమ్ స్టిక్స్, కార్యాలయానికి సమర్పించాల్సిన జిరాక్స్ ప్రతులను తీసుకునేందుకు ఫొటోస్టాట్ మెషీన్.. తదితర వసతులను సమకూర్చాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం అయ్యే ఖర్చును వినియోగదారులు చెల్లిస్తున్న యూజర్ చార్జీల నుంచే భరించాలని సర్కారుకు విన్నవించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీలతో పాటు ప్రతియేటా యూజర్ చార్జీల కింద వినియోగదారులు రూ.18 కోట్లను చెల్లిస్తున్నారు. అయితే, ఆ సొమ్మంతా రిజిస్ట్రేషన్ల శాఖకు రాకుండా ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమవుతుండటంతో వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతోంది. యూజర్ చార్జీలు వినియోగదారుల కోసమే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వేగవంతమైన నెట్వర్క్ ఏర్పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరుగుతోన్న జాప్యానికి చెక్ చెప్పేందుకు వేగవంతమైన నెట్వర్క్ సదుపాయాన్ని కల్పించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మల్టీ ప్రొటోకాల్ కేబుల్ స్విచ్ నెట్‌వర్క్‌కు మారాలని నిర్ణయించారు. కొత్త నెట్‌వర్క్‌ను తీసుకుంటే ఏడాదికి రూ. 1.20 కోట్ల వ్యయం కానుందని, ప్రభుత్వం నుంచి అనుమతి కోసం లేఖ రాసినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల వివరాలు
- సబ్‌రిజిస్ట్రార్ నుంచి నేరుగా భూముల క్రయ, విక్రయాల సమాచారం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో భూమి హక్కులను బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నారు. ఇకపై రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగినా... ఆ డాక్యుమెంట్ కాపీలతో సహా సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయానికి చేరేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో రికార్డుల్లో పేర్లు మార్చే మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయముంది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకు పంపుతున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుండగా... రిజిస్ట్రేషన్ అధికారులిచ్చిన సమాచారం (అమ్మినవ్యక్తి పేరు, విస్తీర్ణం, భూమిస్థితి తదితర వివరాలు) రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమాచారంతో సరిపోలకపోవడం వల్లనే మ్యుటేషన్లు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయినా మ్యుటేషన్లు జరగక సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. అసలు మ్యుటేషన్ల విషయంగా రెవెన్యూ యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్‌పీటర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్ కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సీసీఎల్ఏ దృష్టికి వచ్చింది. ఆయన చొరవ ఫలితంగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య మూడు నెలల్లోనే 40 వేలకు తగ్గినట్లు తెలిసింది. జూన్ 2 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా.. మ్యుటేషన్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడంతో పాటు దరఖాస్తు చేసుకోని రిజిస్ట్రేషన్లపై కూడా సీసీఎల్ఏ దృష్టి సారించారు. తెలంగాణ ఏర్పడిన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను డాక్యుమెంట్లతో సహా తహసీల్దార్లకు అందజేయాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను సీసీఎల్ఏ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ వద్ద వెబ్‌ల్యాండ్‌లో స్పష్టమైన సమాచారం ఉన్నందున, సదరు సమాచారాన్ని తనిఖీ చేశాకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని... వెబ్‌ల్యాండ్‌లో లేని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలని సూచించారు. సరైన సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారి వివరాలను వెబ్‌ల్యాండ్‌లోకి అప్లోడ్ చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో అప్డేట్ అయిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెనుక ముద్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీని ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వీలవుతుందని ఇరు శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. నెలాఖరులోగా 22ఏ నోటిఫికేషన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా 22ఏ (నిషేధిత భూముల) నోటిఫికేషన్ జారీ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. సెక్షన్ 22ఏ లో రెవెన్యూ శాఖ పొందుపరిచిన వివిధ ప్రభుత్వ శాఖల భూములను ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకుండా నియంత్రించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సెక్షన్ 22ఏలో చేర్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను అందజేయాలని దేవాదాయశాఖ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్‌బోర్డ్ సీఈవోలకు సీసీఎల్ఏ లేఖలు రాశారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుగానీ వీలులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, సెక్షన్-43 కింద రిజిస్టరైన దేవాదాయశాఖ భూములు, సెక్షన్-37 ప్రకారం రిజిస్టరైన వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలు సెక్షన్ 22ఏలో ఉంటాయి. -
విశాఖలో సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
విశాఖలో సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖపట్టణం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ మధురపూడి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచాలు తీసుకోవటంతోపాటు టీడీపీ నేతలు, రౌడీ షీటర్లతో దగ్గరి సంబంధాలు నెరపుతున్నట్లు ఆనంద్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి. దీంతో లాసన్స్బేలో ఉన్న ఆయన ఇంటికి సోమవారం ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా అంతకుమునుపే సమాచారం అందుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌కుమార్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మూడు రోజులపాటు వేచి చూసిన అధికారులు గురువారం ఇంటి తాళం పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో హైదరాబాద్‌తోపాటు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లోని 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. ఆయన కుటుంబసభ్యుల, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించి ఇప్పటికే రూ.1.60 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ఈ సోదాల్లో సుమారు 10 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు సమాచారం. కాగా, డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది. -
అవినీతికి అంతేలేదు..
ఉదయగిరి: జిల్లాలో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లలో అంతే లేదు. తీవ్ర ఆరోపణలు, కచ్చితమైన సమాచారమిస్తే తప్ప వారంతట వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మండలాలపై ఈ శాఖ దృష్టిసారించకపోవడంతో అక్కడ అవినీతి అధికారులతో కార్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణణాతీతం. అవినీతి శాఖ అధికారులు అడపాదడపా దాడులు చేసి కిందిస్థాయి సిబ్బందిని పట్టుకుంటున్నప్పటికీ, పైస్థాయి అధికారులపై దృష్టిపెట్టడం లేదు. ఉదయగిరి చరిత్రలో లేనివిధంగా బుధవారం రాత్రి ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ శ్రీరామమూర్తిని దారికాచి ఏసీబీ అధికారులు దుత్తలూరు వద్ద పట్టుకొని పెద్ద మొత్తంలో సొమ్ము స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈప్రాంతంలో కొందరు అవినీ తి అధికారులు జనాలను పీల్చి పిప్పిచేస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు ఆవైపు కన్నెత్తిచూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ విషయంలో కూడా ఓ భూమి లావాదేవీలకు సంబంధించి గుంటూరుకు చెందిన ఓ పోలీసు అధికారి ఉండటంతో ఆయన ఒత్తిడి మేరకు ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న అవినీతి జిల్లాలో వివిధ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. 2012లో 127 అవినీతి కేసులు నమోదుకాగా, 2013లో 8 కేసులు, 2014లో 11 కేసులు మాత్రమే నమోదుకావడం చూస్తే ఈ శాఖ పనితీరు స్పష్టంగా అర్ధమవుతోంది. అంటే అవినీతి జరగక కేసులు నమోదుకావడం లేదా, లేక అవినీతిపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఏసీబీ డీఎస్పీగా జె.భాస్కరరావు ఉన్న సమయంలో జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఆయన పలు సంచలనాత్మక కేసులను నమోదుచేశారు. ఆయన బదిలీతో ఆశాఖ ఈ పరిస్థితి నత్తను తలపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో డీఎస్పీ పోస్టు ఖాళీగావుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్సీ డివిఎన్ మూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు సీఐ లు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, పదిమంది కానిస్టేబుళ్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతం లో వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పెద్ద చేపలను పట్టిన ఏసీబీ ఇప్పుడు నిద్రావస్థలో ఉండటానికి కారణమేమిటో అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలేనా? ప్రస్తుతం జిల్లాలో అన్ని శాఖల్లో అవినీతి విలయతాండవం చేస్తోంది. చిన్న పనికి కూ డా పెద్ద మొత్తంలో అప్పజెప్పందే పని కావ డం లేదు. దీంతో లంచం ఇచ్చుకోలేని అనేకమంది పేదవారు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి మిన్నకుండిపోతున్నారు. మరి కొంతమంది జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖల్లో చేయి తడపందే పనికావడం లేదని విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున లంచాలు గుంజుతున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దుత్తలూరు, కొండాపురం, కలిగిరి, జలదంకి రెవెన్యూకార్యాలయాల్లో కూడా చేయి తడపందే పనులు కావడం లేదని ప్రజలు బోరుమంటున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం నుంచి అడంగళ్‌లో పేరు నమోదు వరకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆత్మకూరు, గూడూరు, కావలి మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడ్డ ఉదయగిరి ఉదయగిరి సబ్‌రిజిస్ట్రారు బుధవారం రాత్రి ఏసీబీకి పట్టుబడడంతో ఈ ప్రాంతంలో అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గురువా రం నియోజకవర్గంలోని పలు కార్యాలయా ల్లో ఈ విషయం కలకలం సృష్టించింది. అనేకమంది అధికారులు, సిబ్బంది ముడుపుల విషయంలో జాగ్రత్తపడ్డారు.


