ఆమె  ఇక్కడ... ఆయనక్కడ !
                  
	 పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్‌సైనీ,  సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి  భార్యాభర్తలు. ఐఏఎస్‌ల పంపిణీలో వీరిలో ఒకరిని తెలంగాణాకు , మరొకరిని ఆంధ్రాకు కేటాయించారు.   బుధవారం  ప్రధాన మంత్రి ఇరు రాష్ట్రాల  ఐఏఎస్‌ల పంపిణీ ఫైల్‌పై సంతకం చేశారు.  ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీని తెలంగాణాకు కేటాయించగా, ఆయన భార్య  శ్వేతామహంతి ఏపీ జాబితాలో ఉన్నారు.  కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారల మంత్రిత్యశాఖ( డీఓపీటీ ) ఆమోదం తరువాత  స్పౌజ్ కోటాలో ఇద్దర్నీ ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో వేచి చూడాలి.  అయితే ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్‌సైనీ మాత్రం ఆదినుంచి తెలంగాణా వైపే మొగ్గుచూపుతున్నారు.