breaking news
statue set up
-
ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఏర్పాటుకు కృషి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ లేదా కూడలిలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గీత కార్మిక వృత్తి నిరాధరణకు గురైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు. గీత కార్మికుల పన్నుల రద్దు, హైదరాబాద్‌లో మూసివేసిన కల్లు కాంపౌండ్లను తిరిగి ప్రారంభించడం, రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కృషి చేశామని వివరించారు. టీఆర్ఎస్ వస్తే పాపన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం, గీత కార్మికుల డిమాండ్ల పరి ష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. -
విగ్రహం ఏర్పాటుకు లక్షసంతకాల సేకరణ
విశాఖపట్నం: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో స్థాపించాలని కోరుతూ 'స్వామి వివేకానంద' అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలకు ఒకేసారి అనుమతులు వచ్చినా కేవలం ఎన్టీఆర్ విగ్రహమే స్థాపించి అల్లూరి విగ్రహ స్థాపన విషయాన్ని మరిచిపోవడం శోచనీయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని స్థాపించాలని కోరారు. శుక్రవారం విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో వారు మీడియాతో మాట్లాడారు.