బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ లోగో ఆవిష్కరణ
బంజారాహిల్స్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ క్రికెట్ లోగోను శనివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ హీరో శ్రీకాంత్, సీనియర్ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు ఆవిష్కరించారు.
స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈవెంట్లో రాయల్ రూలర్స్, ఖాకీ బుల్లెట్స్, మీడియా మిసైల్స్, హైదరాబాద్ తల్వార్స్ జట్లు పాల్గొంటాయి. హైదరాబాద్ తల్వార్స్ జట్టుకు హీరో శ్రీకాంత్, రాయల్ రూలర్స్ జట్టుకు మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తారన్నారు. ఈ నాలుగు టీమ్‌లు 3 మ్యాచ్‌లు ఆడుతాయి. ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందించనున్నారు. ఈ అవార్డు నగదును పేదపిల్లల సహాయార్ధం కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ మిరాకిల్ మీడియా సీఈవో రాజేష్ పొన్నాల, అభినవ్సర్దార్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.