breaking news
Spectacular stunts
-
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం
అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A large green meteor was spotted blazing through the sky in Turkey moments ago. Wow. pic.twitter.com/eQEYLG2ihB — Nahel Belgherze (@WxNB_) September 2, 2023 టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. Green meteor lights up the sky over Turkey on Saturday.pic.twitter.com/Y89ORYz6CP — Science girl (@gunsnrosesgirl3) September 3, 2023 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. Malatya, Erzurum, Elazığ, Gaziantep, Diyarbakır ve çevre illerden görülen büyük ve çok parlak bir göktaşı düşüşü gözlemlendi. İşte o anlar... ☄️👀 #göktaşı #meteor #malatya #erzincan #elazığ #gaziantep #malatya #erzurum pic.twitter.com/lDWTYGzAZM — Hava Forum (@HavaForum) September 2, 2023 ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం! -
‘విశ్వ’రూప విశాఖ
కడలితీరం కదనరంగంగా మారింది.. దాన్ని అనుకొని ఉన్న బీచ్‌రోడ్డు అంతర్జాతీయ దళాల కదన కుతూహలాన్ని చాటే కవాతుకు వేదికగా.. కళాక్షేత్రంగా భాసిల్లింది. సుమారు రెండు గంటలపాటు సుమారు 2 లక్షల మందిని ప్రత్యక్షంగా.. మరికొన్ని వేలమందిని పరోక్షంగా తమ అద్భుత విన్యాసాలు, ప్రదర్శనలతో నావికాదళం కట్టిపడేసింది. సరిగ్గా సాయంత్రం 4.35 గంటలు.. అలల హోరు.. సందర్శకుల కేరింతలతో సందడిగా ఉండే సాగర తీరంలో ఒక్కసారిగా అలజడి.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు.. వాటిలోంచి సర్రున నీటిపై వాలిన పారాట్రూపర్లు.. కమెండోలు.. అంతలోనే తుపాకుల మోతలు.. బాంబుల వర్షం.. మరోపక్క ఆయిల్ రిగ్ పేల్చివేత.. ఇలా వరుస విన్యాసాలతో యుద్ధంలో కనిపించే దృశ్యాలను కళ్లుదుట ఆవిష్కరిస్తూ.. లక్షలాది ప్రజలను గగుర్పాటుకు గురి చేశారు. ఇక చీకట్లు ముసురుకుంటున్న వేళ.. సుమారు 24 దేశాల నావికాదళాల కవాతు కనువిందు చేసింది. ఒక్కో దేశానికి చెందిన దళం ముఖ్యఅతిథి ప్రధానమంత్రి సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతుంటే.. ఆ దేశానికే చెందిన కళాకారులు తమ సంప్రదాయ వేషధారణతో అనుసరించారు. వాటితోపాటు పలు ప్రభుత్వ శాఖల శకటాలుతో కూడిన కార్నివాల్ వేడుకను శోభాయమానం చేసింది. అంతకుముందు ప్రధాన వేదిక వద్ద భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయం నృత్యప్రదర్శన అదరహో అనిపించింది. తీరంలో కొలువుదీరిన యుద్ధనౌకల నుంచి ఆకాశంలోకి సంధించిన బాణసంచా వెలుగులు.. వాటికి పోటీగా లేజర్ కిరణాల జిలుగులు కార్యక్రమానికి అద్భుతమైన ముగింపునిచ్చాయి. మొత్తంగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో కీలకమైన సిటీ పరేడ్, విన్యాసాల ఘట్టం.. ‘విశ్వ’రూపం సంతరించుకొంది.. విశాఖ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. -విశాఖ సిటీడెస్క్