breaking news
special incentives
-
‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. ఎన్నికల డేటాలో కనిపించిన ఒక ఆశ్చర్యకర అంశం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘సర్’ తొలి నివేదికల్లో 2,208 పోలింగ్ బూత్‌లలో మరణాలు, తప్పిపోయిన, పునరావాసం పొందిన లేదా నకిలీ ఓటర్లు లేరని తేలింది. ఆయా బూత్‌లలోని ఓటర్ల జాబితా గత రెండు దశాబ్దాలుగా ‘పరిశుభ్రంగా’ ఉందని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ)లు నివేదించడం అందరినీ కంగుతినేలా చేస్తోంది. అయితే ఈ డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లాల నుండి వివరణాత్మక నివేదికలు కోరింది. ఆ విచారణ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఈ 'క్లీన్ బూత్‌ల' సంఖ్య 2,208 నుంచి కేవలం 480కి భారీగా తగ్గింది.ఈ డేటా మార్పుపై తలెత్తిన ప్రశ్నలు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. కేవలం ఒకే రోజులో 1,728 బూత్‌ల డేటాలో మార్పు రావడాన్ని బీజేపీ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. ‘2,200కు పైగా బూత్‌లలో ఎవరూ చనిపోలేదని చెప్పడం మాయాజాలమా? ఈసీ నివేదిక కోరగానే అకస్మాత్తుగా 480 బూత్‌లకు తగ్గించడం బెంగాల్లో మాత్రమే జరుగుతుంది’ అంటూ ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా వర్గాలు నిరంతర డేటా నవీకరణల వల్లే ఈ తేడా వచ్చిందని చెబుతున్నా, ఈ అసాధారణ తగ్గింపు వెనుక వాస్తవ కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త జాబితాలో అత్యధిక సంఖ్యలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రేదిఘి (66), కుల్పి (58), మాగ్రహత్ (15), పథర్ప్రతిమ (20) బూత్‌లు ఉన్నట్టు ఈసీవర్గాలు తెలిపాయి.మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ తరహా ధృవీకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రత్యేక జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో పెండింగ్‌లో ఉన్న అత్యధిక కేసులు ‘సంతాన మ్యాపింగ్’కు సంబంధించినవి. అంటే తల్లిదండ్రులు లేదా తాతామామల ద్వారా ఓటరు ధృవీకరణ జరగాల్సి ఉంది. ప్రత్యేకించి 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని ఓటర్లు తిరిగి ధృవీకరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఓటర్ల జాబితాలో తప్పులను తగ్గించడానికి కమిషన్ తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగమని తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి, మొత్తం 46.20 లక్షల గణన ఫారమ్‌లు దాఖలయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే, 22.28 లక్షల మంది మరణించిన ఓటర్లు కాగా, 6.41 లక్షల మంది తప్పిపోయిన ఓటర్లు, 16.22 లక్షల మందిని తరలించడం జరిగింది. 1.05 లక్షల డబుల్ ఎంట్రీలు గుర్తించారు. జిల్లాల వారీగా మరణించిన ఓటర్ల శాతంపై నివేదిక కూడా ఆసక్తికరంగా ఉంది: కోల్‌కతా నార్త్ 6.91%తో అత్యధికంగా ఉండగా, తూర్పు మెదినీపూర్ 1.4%తో అత్యల్పంగా ఉంది. ఈ లెక్కలు ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు పేరుకుపోయాయని సూచిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
అంచనాలు మించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రూ. 4,845 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 4,019 కోట్లతో పోలిస్తే ఇది 20.5 శాతం అధికం. లాభం సుమారు రూ. 4,534 కోట్ల స్థాయిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ ఆదాయం రూ. 22,629 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ. 24,570 కోట్లకు పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను కూడా ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 2–3 శాతం మేర వృద్ధి ఉంటుందని సవరించింది. గతంలో ఇది 2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకమే ఊ తంగా 2021 ఆర్థిక సంవత్సరం ఆదాయ, మార్జిన్ల అంచనాలను సవరించాము‘ అని కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. డిజిటల్, క్లౌడ్ విభాగాల తోడ్పాటుతో మార్కెట్లో మెరుగైన పనితీరు కనపర్చగలుగుతున్నామని, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దీన్ని ప్రతిబింబించేవిగా ఉన్నాయని ఆయన పేర్కొ న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నిధు ల నిల్వలు గణనీయంగా పెరిగాయని ఇన్ఫీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర డివిడెండ్‌ను షేరుకు 50% పెంచి రూ. 12 చెల్లించనున్నట్లు వివరించారు. ఈ క్వార్టర్లో ఐటీ దిగ్గజాలకు సంబంధించి ఇప్పటికే టీసీఎస్, విప్రో ఫలితాలు వెలువడ్డాయి. ఇక హెచ్‌సీఎల్ అక్టోబర్ 16న ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. జనవరి 1 నుంచి జీతాల పెంపు.. అన్ని స్థాయిల సిబ్బందికి జనవరి 1 నుంచి జీతాలను పెంచనున్నట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు. అలాగే, రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు 100 శాతం వేరియబుల్ పే ఇస్తున్నట్లు వివరించారు. ‘క్లిష్ట పరిస్థితుల్లోనూ మా ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో 100% వేరియబుల్ పే చెల్లిస్తున్నాం. అలాగే క్యూ3లో మా జూనియర్ ఉద్యోగులకు వన్ టైమ్ ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాం‘ అని సలీల్ పరేఖ్ చెప్పారు. జీతాల పెంపు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. జూనియర్ స్థాయిల్లో గత త్రైమాసికం నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇకపై మిగతా అన్ని స్థాయిలకు దీన్ని విస్తరించనున్నామని పరేఖ్ చెప్పారు. కరోనా సంక్షోభంతో వ్యాపారంపై ప్రతికూలత కారణంగా ప్రమోషన్లు, జీతాల పెంపులను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫీ గతంలో ప్రకటించింది. తాజాగా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వాటిని మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. జీతాల పెంపు పరిమాణం గతంలోలాగానే ఉంటుందని సీవోవో ప్రవీణ్‌రావు తెలిపారు. దేశీయంగా ఉద్యోగులకు గతేడాది సగటున వేతనాల పెంపు సుమారు 6%గా ఉండగా, విదేశాల్లో ఉన్న సిబ్బందికి 1–1.5 శాతం స్థాయిలో నమోదైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెల్లడయ్యాయి. ఇన్ఫీ షేరు 2% క్షీణించి రూ. 1,136 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో డిజిటల్ విభాగ ఆదాయాలు 1,568 మిలియన్ డాలర్లుగా (మొత్తం ఆదాయంలో 47.3 శాతం వాటా) నమోదయ్యాయి. ► క్యూ2లో ఇన్ఫోసిస్ 3.15 బిలియన్ డాలర్ల భారీ డీల్స్ కుదుర్చుకుంది. ► ఆదాయాల్లో ఉత్తర అమెరికా వాటా 60% కాగా, యూరప్(24.3%), భారత్(3%), ఇతర దేశాలు(12%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► వ్యయ నియంత్రణ, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో నిర్వహణ మార్జిన్ సీక్వెన్షియల్‌గా 270 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో ఇన్ఫీ నికరంగా 975 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఉద్యోగుల సంఖ్య 2,40,208కి చేరింది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) వార్షిక ప్రాతిపదికన 18.3 శాతం నుంచి 7.8 శాతానికి దిగి వచ్చింది. -
డొక్కు కారు ఇవ్వండి.. డబ్బు తీసుకెళ్లండి
వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. బాగా పాతబడిన వాహనాలను తీసుకొచ్చి సరెండర్ చేస్తే డబ్బులు ఇస్తామని ప్రకటించింది. పదేళ్లకు పైబడ్డ భారీ వాహనాలను తీసుకొస్తే.. 1.5 లక్షల రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. అలాగే కార్ల లాంటి చిన్న వాహనాలను సరెండర్ చేస్తే 30 వేల రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో పాత వాహనాలను ఇక తొలగించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ సరికొత్త ఆలోచన చేస్తోంది.


