breaking news
South Telangana electricity distribution
-
దక్షిణ డిస్కంలో బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. సబ్ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్ విభాగంలో జేఏఓల కేడర్ వరకు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల ఉద్యోగుల బదిలీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 30 నాటికి మూడేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఒకేచోట పనిచేసే వారిని బదిలీ చేయనున్నారు. సీని యారిటీ ప్రాతిపదికగా మొత్తం ఉద్యోగుల్లో 40% మందికి మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్లు పేర్కొంది. బదిలీకానున్న వారి జాబితాను ఈనెల 13న డివిజనల్/సర్కిల్ కార్యాలయాలకు అందజేయనున్నారు. జాబితాపై 17 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, విజ్ఞప్తులుంటే 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 28లోగా బదిలీలపై ఉత్తర్వులు జారీ కానుండగా.. బదిలీ అయిన ఉద్యోగులు 30న రిలీవ్ కావాలని సంస్థ ఆదేశించింది. -
మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు
ఏప్రిల్‌లో ప్రస్తుత చార్జీలే అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్లోప్రస్తుత చార్జీలే వసూలు చేస్తారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీతో అమలు చేయడం ఆనవాయితీ. అయితే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2016-17 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి గత నవంబర్‌కు బదులు మార్చి 8న సమర్పించాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, వాటిపై డిస్కంల వివరణ, అనంతరం బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఖరారు చేసేందుకు సమయం లేకపోవడంతో చార్జీల పెంపు అమలును మేకు వాయిదా వేసినట్టు ఈఆర్సీ వర్గాలు తెలిపాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ తేదీలను ఈఆర్సీ ఖరారు చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న కరీంనగర్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటిదాకా విచారణ జరుగుతుంది. పెంపుపై చర్చించేందుకు ఈ నెల 17న ఈఆర్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర సలహా కమిటీ సమావేశం జరుగుతుంది.