breaking news
Sircilla Assembly Constituency
-
Sircilla: కేటీఆర్‌ను ఢీ కొట్టుడు కష్టమే!
సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రధానముగా పద్మశాలి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్థులు ఎక్కువ. మిగతా బీసీ కులాలు కూడా నియోజకవర్గములో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ (17శాతం) వారు కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. పార్టీల వారిగా పోటీ చేసే అభ్యర్థులు! బీఆర్ఎస్ కేటీఆర్ బీజెపి కటకం మృత్యుంజయం లగిశెట్టి శ్రీనివాస్ ఆవునూరి రమాకాంత్ రావు రెడ్డెబోయిన. గోపి మోర. శ్రీనివాస్ కాంగ్రెస్: కేకే మహేందర్ రెడ్డి చీటి ఉమేష్ రావు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్. కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు జరిగిన అభివృద్ధి పనులు సిరిసిల్ల చేనేత కార్మికుల కొరకు బతుకమ్మ చీరలు ఆర్ వి ఎం క్లాత్ సిరిసిల్లలోనే ఉత్పత్తి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, ఐటిఐ కాలేజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆపరాల్ పార్కు నిర్మాణం జరుగుతుంది వర్కర్ టు ఓనర్ స్కీం షేడ్స్ నిర్మాణంలో ఉన్నవి అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ కలెక్టర్ చౌరస్తా నుండి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల ఫోర్ లైన్ బైపాస్ డబుల్ రోడ్డు ప్రారంభం సిద్ధంగా ఉంది. సివిల్ హాస్పిటల్ లో డయాలసిస్‌సెంటర్ మరియు సిటీ స్కాన్ ఆక్సిజన్ ప్లాంట్, అదనంగా మరో వంద పడకల ఆసుపత్రి గంభరావుపేట మండలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రారంభం రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్ల నేత కార్మికుల కొరకు ఉచిత ప్రమాద బీమా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో ప్రీమియం అధునాతన వ్యవసాయ మార్కెట్‌తో పాటు డిపిఓ భవనం నిర్మాణం పూర్తి. మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఉంది. ఇక్కడ ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన సంస్థ నిర్మాణంలో ఉంది.మధ్యమానేరు బ్యాక్ వాటర్ . తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ.... సిరిసిల్ల నియోజకవర్గ సమస్యలు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి యారన్ డిపో లేకపోవడం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి వస్త్రాన్ని ఎగుమతి చేసేందుకు సరైన మార్కెట్ వసతి లేకపోవడం. చిన్న కుటీర మరమగ్గాల పరిశ్రమకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఉచిత విధ్యుత్ సరఫరా లేదు. బతుకమ్మ చీరల వలన సంవత్సరములో కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే పని, మిగతా నెలలు సరైన పనిలేకపోవడం. నియోజక వర్గములో 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగడం. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఉన్నత చదువుల కోసం డిగ్ర కళాశాలలు లేకపోవడం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో 30 పడకల ఆసుపత్రి లేకపోవడం వలన ఇబ్బందులు. బీడీ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నిర్మిస్తామన్న ఆసుపత్రి ఇప్పటివరకు లేకపోవడం. -
సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం ఎవరిది?
సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రిగా ఉన్న కెటిఆర్ నాలుగోసారి ఘన విజయం సాదించారు. ఆయన భారీగా తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కెటిఆర్ ఎన్నికల తర్వాత మంత్రి పదవిని పొందలేదు. అయితే టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడుగా నియమితులవడం విశేషం. ఆ తర్వాత కొద్దికాలానికి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. తండ్రి కెసిఆర్ ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించగా, కెటిఆర్ నాలుగుసార్లు ఇంతవరకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ కలిసి పన్నెండుసార్లు గెలిచారన్నమాట. కెటిఆర్‌కు 125213 ఓట్లు పొందగా, మహేందర్ రెడ్డికి కేవలం 36204 ఓట్లు మాత్రమే పొందారు. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర్సాగౌడ్‌కు కేవలం మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. కెటిఆర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యదిక సార్లు ఇదే సామాజికవర్గం నేతలు గెలుపొందారు. ఏపీ, తెలంగాణలలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు అదే క్యాబినెట్లో ఉండడం కెటిఆర్‌తోనే ఆరంభం అయిందని చెప్పాలి. తారక రామారావు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తండ్రి తెలంగాణ ఉద్యమం ఆరంభించాక, కొద్ది సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని క్రియాశీల రాజకీయాలోకి వచ్చారు. 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధి మహేంద్రరెడ్డితో పోటీని ఎదుర్కొని స్వల్ప ఆధిక్యతతో గెలిచిన కెటిఆర్ ఆ తర్వాత తెలంగాణ సాధనలో భాగంగా పదవికి రాజీనామా చేసి బారీ ఆధిక్యతతో గెలుపొందారు. తిరిగి 2014 సాధారణ ఎన్నికలలో 53004 ఓట్ల మెజార్టీతో విజయ డంఖా మోగించారు. 2018లో ఈ మెజార్టీ ఇంకా పెరిగింది. కెటిఆర్‌తో పాటు ఆయన తండ్రి కెసిఆర్ 2014లో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందగా, కెటిఆర్ సోదరి కవిత నిజామాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించడం విశేషం. కాని ఒకప్పుడు హైదరాబాద్‌కు చెందిన సలావుద్దీన్ ఒవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. సలావుద్దీన్ 1999లో లోక్‌సభకు ఎన్నిక కాగా, ఆయన పెద్ద కుమారుడు అసద్, మరో కుమారుడు అక్బర్లు ఇద్దరూ శాసనసభకు ఎన్నియ్యారు, పలు విధాలుగా కెసిఆర్ రికార్డులు సృష్టించిన కెసిఆర్ ఈ రకంగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. 2018లో మాత్రం కవిత ఓటమి చెందారు. సీనియర్ నేత, ఏబై ఏళ్ళకాలంలో ఆరుసార్లు గెలుపొంది, 1957లోను, అలాగే 2007లోను అంటే ఏభై ఏళ్ళ తరువాత రాష్ట్ర శాసనసభలో ఉన్న ఏకైక నేతగా గుర్తింపు పొందిన చెన్నమనేని రాజేశ్వరరావు సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన గెలిచారు. ఈయన చొప్పదండిలో ఒకసారి పిడిఎఫ్ పక్షాన గెలిచారు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ వేములవాడలో పోటీచేసి నాలుగో సారి గెలుపొందారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యా సాగరరావు మెట్పల్లి నుంచి మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు కరీంనగర్‌నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. 1952లో ఇక్కడ గెలిచిన జోగినపల్లి ఆనందరావు 1957లో మెట్పల్లిలో గెలిచారు. 1989లోజనశక్తి నక్సల్గ్రూపు తరుఫున ఎస్.వి.కృష్ణయ్య గెలిచారు.సిరిసిల్ల 1952,57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్. ఎస్.టి.ఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి మూడుసార్లు, కమ్యూనిస్టు పార్టీ నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ నాలుగుసార్లు, మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. సిరిసిల్ల నుంచి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందగా, ఒకసారి రెడ్డి,రెండుసార్లు ఎస్.సి, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..