breaking news
Sheela Foam
-
షీలా ఫోమ్ చేతికి కర్లాన్
న్యూఢిల్లీ: స్లీప్‌వెల్ పేరిట మ్యాట్రెస్‌లను తయారు చేసే షీలా ఫోమ్ తాజాగా కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66% వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,035 కోట్లు వెచి్చంచనుంది. అలాగే, ఆన్లైన్ ఫరి్నచర్ బ్రాండ్ ఫర్లెంకో మాతృ సంస్థ హౌస్ ఆఫ్ కిరాయా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 300 కోట్లతో 35% వాటాలు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన రెండు ప్రతిపాదనలకు జూలై 17న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు షీలా ఫోమ్ తెలిపింది. ‘రూ. 2,150 కోట్ల ఈక్విటీ వేల్యుయేషన్‌తో కేఈఎల్ (కర్లాన్ ఎంటర్ప్రైజెస్)లో 94.66% వాటాను కొనుగోలు చేయబోతున్నాం‘ అని వెల్లడించింది. మ్యాట్రెస్లు, ఫోమ్ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని షీలా ఫోమ్ తెలిపింది. కేఈఎల్లో 94.66% వాటా కొనుగోలు వ్యయం రూ.2,035 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. దేశీయంగా ఆధునిక మ్యాట్రెస్‌ల విభాగంలో రెండింటి సంయుక్త మార్కెట్ వాటా దాదాపు 21 శాతంగా ఉంటుందని వివరించింది. దక్షిణాదికి చెందిన బిజినెస్ గ్రూప్ పాయ్ కుటుంబం 1962లో కర్ణాటక కాయిర్ ప్రోడక్ట్స్ (ప్రస్తుతం కేఈఎల్)ను ఏర్పాటు చేసింది. 1995లో దాని పేరు కర్లాన్ అని మారగా 2011లో కేఈఎల్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటైంది. అటు పైన 2014లో వ్యాపారం కేఈఎల్కు బదిలీ అయింది. కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా కర్లాన్ బ్రాండ్ కింద ఫోమ్, కాయిర్ ఆధారిత మ్యాట్రెస్లు మొదలైనవి తయారు చేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.809 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ఫరి్నచర్ రెంటల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఫర్లెంకోలో పెట్టుబడులు ఉపయోగపడగలవని షీలా ఫోమ్ వివరించింది. -
ఐపీవోకు వస్తున్న షీలా ఫోమ్
స్లీప్‌వెల్ బ్రాండుతో పరుపులను(మ్యాట్రెస్) అమ్ముతున్న షీలా ఫోమ్ ప్రెవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ కి రానుంది. దీనికి సంబందించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 510 కోట్ల సమీకరించాలని యోచిస్తోంది. 15 శాతం వాటాను విక్రయించాలని కంపెనీ భావిస్తున్న కంపెనీ దీనికి అనుమతించమనికోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. దీంతో కంపెనీ విలువ 40-50 కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా . రూ. 5 ముఖవిలువగల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తదుపరి దశలో ఆఫర్ చేయనున్న షేర్ల సంఖ్యను వెల్లడించనుంది. ఎదెల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ నిర్వహిణలో ఐపీవోకు రానుంది. రాహుల్ గౌతమ్ నేతృత్వంలోని షీలా ఫోమ్ పాలీరెథాన్ ఫోమ్ ఆధారిత పరుపులను విక్రయిస్తుంది. స్లీప్ వెల్ ప్రధాన బ్రాండ్ కాగా పారిశ్రామిక కంపెనీలకు కూడా ఫోమ్ ను కూడా విక్రయిస్తుంది. కాగా 2015 ఆర్థికసంవత్సం పోలిస్తే 2016లో ఇప్పటివరకూ 10 సంస్థలు ఐపీవోకి వచ్చాయి. దీని ద్వారా 6, 743కోట్లమేరకు ఆర్జించాయి. ప్రేమ్ డేటా బేస్ ప్రకారం 2015లో 21 కంపెనీలు 13,600 కోట్లను ఆర్జించాయి.