breaking news
september 16th
-
కురుమ గర్జన విజయవంతం చేయాలి
తొగుట: ఈ నెల 16న మిరుదొడ్డిలో నిర్వహించే దుబ్బాక నియోజకవర్గస్థాయి కురుమ గర్జనను విజయవంతం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు దేవునూరి పోశయ్య కోరారు. మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండల అధ్యక్షుడు గుంటి యాదగిరి, ఘణపురం సర్పంచ్ అక్కం స్వామిలతో కలిసి కురుమ గర్జన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 559, 1016ల ప్రకారం ప్రతి గ్రామానికి గొర్లు, మేకల మేత కోసం 15 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి కురుమ వృద్ధుడికి పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి జిల్లాలో కురుమ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 16న మిరుదొడ్డిలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి కురుమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు యాదగిరి, అశోక్, మల్లేశం, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.సాయిసుబ్బారావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, సంబంధిత విద్యాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చన్నారు. నవోదయ విద్యాలయ వెబ్సైట్ www.navodayahyd.org.in, www.navshq.org, www.jnvmbnr.org ద్వారా దరఖాస్తులు పొంది పూర్తిచేసి సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 16వరకు అందించాలని తెలిపారు.