breaking news
Sensex Rises
-
టెలికం షేర్ల జోరు
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తక్కువకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన వచ్చే క్యాబినెట్ సమావేశంలోనే చర్చకు రానున్నదన్న వార్తల కారణంగా మంగళవారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో స్టాక్ మార్కెట్ లాభపడింది. అమెరికా–చైనాల మధ్య కనీసం మినీ ఒప్పందమైనా కుదిరే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసి వచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు లాభపడటం, ముడి చమురు ధరలు 0.8 శాతం తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 186 పాయింట్లు పెరిగి 40,470 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 11,940 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇన్ఫ్రా, ఇంధన, టెలికం షేర్లు లాభపడ్డాయి. వాహన, లోహ, కన్సూమర్ షేర్ల పతనంతో లాభాలు పరిమితమయ్యాయి. కొనసాగిన టెలికం పరుగు.. టెలికం షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. వచ్చే నెల నుంచి డేటా, వాయిస్ టారిఫ్‌లను పెంచనున్నామని ప్రకటించడంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల లాభాలు కొనసాగాయి. ఇంట్రాడే లో ఏడాది గరిష్ట స్థాయి, రూ.445కి ఎగసిన ఎయిర్టెల్ చివరకు 7.3% లాభంతో రూ.439 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 35 శాతం లాభంతో రూ.6 వద్దకు చేరింది. టారిఫ్‌లు పెరిగితే టెలికం కంపెనీలు భారీగా ఉన్న తమ రుణాలను తీర్చివేసే అవకాశం ఉంటుందని, ఫలితంగా బ్యాంక్ బకాయిలు తగ్గుతాయనే అంచనాలతో బ్యాంక్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి కాగా, ప్రమోటర్లు తమ వాటా షేర్లను పూర్తిగా అమ్మేయడంతో యెస్ బ్యాంక్ షేర్ 2.6% నష్టంతో రూ.64 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. రిలయన్స్ రికార్డ్... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,515ను తాకింది. చివరకు 3.5% లాభం తో రూ.1,510 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసేనాటికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,57,086 కోట్లకు పెరిగింది. మార్కెట్ క్యాప్ విషయంలోనూ ఈ కంపెనీ కొత్త రికార్డ్ సృష్టించింది. రూ.9.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ సాధంచిన తొలి భారత కంపెనీ ఇదే. మరోవైపు అత్యధిక మార్కెట్క్యాప్ ఉన్న భారత కంపెనీ కూడా ఇదే. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 34 శాతం ఎగసింది -
ఆటో, ఎనర్జీ స్టాక్స్‌తో పుంజుకున్నాయ్!
ఆటో, ఎనర్జీ స్టాక్స్ మద్దతుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం మంచి లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 90.09 పాయింట్ల లాభంలో 26,816 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 30.95 పాయింట్ల లాభంలో 8,267గా నమోదవుతోంది. నేటి మార్కెట్లో ఆటో, ఎనర్జీ స్టాక్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ సబ్-ఇండెక్స్‌లు 0.74 శాతం, 0.80శాతం పెరిగాయి. అన్నీ నిఫ్టీ స్టాక్స్‌లో బీపీసీఎల్ టాప్ గెయినర్‌గా లాభాలు పండిస్తోంది. ఈ స్టాక్స్ 2.44 శాతం పెరిగాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ డీవీఆర్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 1-2 శాతం మధ్యలో పెరిగాయి. ఐటీ స్టాక్స్‌లో నెలకొన్న ఒత్తిడితో పాటు డిసెంబర్ నెల క్వార్టర్ ఫలితాల నేపథ్యంతో సోమవారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో నిన్న మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఎనర్జీ స్టాక్స్ మద్దతు వల్ల నేడు మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలంగానే ప్రారంభమైంది. 68.08గా ఎంట్రీ ఇచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 176 రూపాయల లాభంతో 28,063గా నమోదవుతోంది.