breaking news
seller fees
-
వారికి అమెజాన్ పండుగ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ‘అమెజాన్ ఇండియా’ ముఖ్యమైన పండుగల ముందు విక్రేతలకు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు నిర్వహించినందుకు చెల్లించాల్సిన ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. కొత్త వెండర్లకు ఇది వర్తించనుంది. అమెజాన్ ప్లాట్ఫామ్లో విక్రయించే ప్రతీ ఉత్పత్తి విలువలో (కొనుగోలు దారు చెల్లించే) నిర్ణీత శాతం మేర ఫీజుగా వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొత్త అమ్మకందారులు ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ ప్రయాణాన్ని వెంటనే ఆరంభించేందుకు వీలుగా.. అమెజాన్.ఇన్‌పై ఆగస్ట్ 28 నుంచి అక్టోబర్ 26 మధ్య నమోదు చేసుకుని.. తదుపరి 90 రోజుల్లోపు అమ్మకాలు మొదలు పెట్టడం ద్వారా అమ్మకం ఫీజులో 50 శాతం రాయితీ పొందొచ్చు’’అని అమెజాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్తకులు ప్రస్తుత పండుగల డిమాండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘భారత్ వ్యాప్తంగా మాకు మిలియన్ విక్రేతలు ఉన్నారు. పండుగల సీజన్లో వారంతా తమ ఉత్పత్తులను వినియోగదారుల ముందు ప్రదర్శించే అవకాశం మా వేదిక ద్వారా ఉంటుంది’’అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ వివేక్ సోమారెడ్డి వెల్లడించారు. అమెజాన్‌కు దేశవ్యాప్తంగా 60 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 1850 వరకు స్టేషన్లు (సొంతంగా, భాగస్వాముల ద్వారా) ఉన్నాయి. -
కమిషన్ పెంచేసిన ఫ్లిప్ కార్ట్
బెంగళూరు : వర్తకులకు వసూళ్ల కమిషన్ పెంచడంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బాటలోనే దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నడుస్తోంది. అమెజాన్ తన వ్యాపారులకు వసూళ్ల కమిషన్ పెంచిన అనంతరం, బెంగళూరుకు చెందిన ఫ్లిప్ కార్ట్ సైతం తన అమ్మకందారులకు కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. మొబైల్ వంటి వివిధ కేటగిరీల్లో అమ్మకందారులకు కమిషన్ ను 5 నుంచి 6శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ఈ కొత్త గైడ్ లైన్లు జూన్ 20 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూలను పెంచుకోవడానికి, నష్టాలను తగ్గించడానికి ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వెబ్ సైట్ లో ఎక్కువ అమ్ముడు పోయే ఉత్పత్తులను, కస్టమర్లకు నచ్చకపోతే వెనక్కిపంపే రోజులను కూడా ఫ్లిప్ కార్ట్ తగ్గించింది. 30 రోజులుగా ఉన్న ఈ రోజులను 10 రోజులకు కుదించింది. దీంతో కస్టమర్లు వస్తువులు నచ్చకపోతే 10రోజుల్లో వెనక్కి పంపించాల్సి ఉంటుంది. తన ప్లాట్ ఫామ్ లో వ్యాపారుల కోసం మరో రెండు కొత్త ఫీజు విధానాలను ఫ్లిప్ కార్ట్ ఆవిష్కరించనుంది. ఒకటి ఫిక్స్ డ్ కాంపోనెంట్ విధానం, మరొకటి ఉత్పత్తి అమ్మినందుకు 2.5శాతం పేమెంట్ కలెక్షన్ ఫీజును అమ్మకందారులకు ఫ్లిప్ కార్ట్ చార్జ్ చేయనుంది. అదనపు కమిషన్ కాకుండా, ఒకవేళ ఉత్పత్తులను వెనక్కి పంపితే సరుకు రవాణా ఫీజు కూడా అమ్మకందారులే భరించాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు. గత నెల ముందు అమెజాన్ 9శాతం కమిషన్లను పెంచగా... స్నాప్ డీల్ మాత్రం పడిపోతున్న అమ్మకాలను పెంచడానికి అమ్మకందారులకు కమిషన్ లో కోత విధించింది. అయితే ముందు నుంచి ఫ్లిప్ కార్ట్ అమ్మకందారులపై ఎలాంటి పేమెంట్ కలెక్షన్ ఫీజును చార్జ్ చేయలేదు. ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చెల్లింపుల రుసుము(పేమెంట్ కలెక్షన్ ఫీజు), పోటీసంస్థలు అమెజాన్, స్నాప్ డీల్ లు వసూలు చేస్తున్న దానికంటే కొంతమేర అధికంగా ఉన్నాయి. అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు పేమెంట్ కలెక్షన్ ఫీజు కింద అమ్మకందారుల నుంచి 2 నుంచి 2.3శాతం వసూలు చేస్తున్నాయి. 90 వేల అమ్మకందారులు, 750లక్షల రిజిస్ట్రర్ యూజర్లను ఫ్లిప్ కార్ట్ కలిగిఉంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానాలను అమ్మకందారులు ముందే ఊహించినవని, ఆన్ లైన్ బిజినెస్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడం కోసం వీటిని తీసుకొస్తున్నామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.