breaking news
Secretariat Seemandhra employees forum
-
ఆప్షన్లు వద్దని ఒకరు... ముద్దని మరొకరు
-
ఆప్షన్ల విధానం ఉండాలి... వద్దు
హైదరాబాద్: విభజనలో ఉద్యోగులకు ఆప్షన్ల విధానం ఉండాలని కమల్నాథన్ కమిటీని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కోరింది. రాజకీయ ప్రమేయం, ఒత్తిళ్లు ఉండకూడదన్నారు. స్థానికతతో సంబంధంలేకుండా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. విభజన తేదీకి ముందే పీఆర్సీని ప్రకటించాలన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలను కేంద్రమే కాపాడాలన్నారు. ఉద్యోగుల విభజనకు ఆప్షన్ల విధానం వద్దని కమల్నాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలంగాణ వాళ్లు, సీమాంధ్రలో సీమాంధ్ర ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని అన్నారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలన్నారు. స్థానికతక ప్రాతిపదిక ఏంటనేది కమలనాథన్ కమిటీ తేల్చాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారి సంగతి తేల్చాలన్నారు. -
అన్ని పార్టీల నేతలు సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలి
రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు ఒకే మాట మీద నిలబడితే సమైక్యాంధ్ర సాధ్యమని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగస్థుల ఫోరం అధ్యక్షడు మురళీకృష్ణ వెల్లడించారు. ఆదివారం ఆయన ప్రకాశంజిల్లా ముఖ్య కేంద్రం ఒంగోలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల నేతలు జెండాలను పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఎజెండాగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరు కోట్ల సీమాంధ్ర తెలుగు ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహారించిందని మురళీకృష్ణ ఆక్షేపించారు.