breaking news
scorpion in flight
-
విమానంలో మహిళకు భయంకర అనుభవం!
అట్లాంటా: విమానంలో ప్రయాణించేటపుడు కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయంకర అనుభవం ఎదురు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. వివరాలు.. ఓ మహిళ గురువారం ఉదయం పూట శాన్ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా బయలు దేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తేలు ఆమె కాలిపై అదేపనిగా కాట్లు వేసింది. దీంతో మహిళకు నొప్పి భరించలేకుండా ఉండటంతో బాత్రూంలోకి వెళ్లింది. ఇంకా ఏదో కుడుతున్నట్టుగా అనిపించడంతో మహిళ ప్యాంటు చెక్ చేసుకోగా.. అందులో నుంచి ఓ తేలు బయటపడింది. అది కూడా సజీవంగా ఉండటంతో ఆమె భయభ్రాంతులకు లోనైంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. విమానం ల్యాండ్ అయ్యాక సదరు మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితురాలికి విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించామని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. -
అమెరికా విమానంలో అనుకోని అతిథి!
అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి ఈక్వెడార్‌లోని క్విటో నగరానికి వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానంలోకి ఒక అనుకోని అతిథి దూరడమే అందుకు కారణమని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. విషయం ఏమిటంటే.. విమానంలో కూర్చున్న ఒక ప్రయాణికుడి దుస్తుల మీదుగా ఓ తేలు పాక్కుంటూ వెళ్లింది. విమానంలో తేలు కనిపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. అదృష్టవశాత్తు అది విమానంలో ఉన్న ఎవరినీ కుట్టలేదు కాబట్టి సరిపోయింది. ఆ తేలు ఎక్కడుందో గుర్తించి, దాన్ని విమానం నుంచి కిందకు దించి మళ్లీ బయల్దేరడానికి మాత్రం మూడు గంటల సమయం పట్టింది. నిజానికి ఈ ఘటన జరిగే సమయానికి విమానం గేటు నుంచి కొద్ది దూరం వెళ్లింది. కానీ, తేలు విషయం తెలియగానే మళ్లీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులందరినీ కిందకు దించేసి వాళ్లను వేరే విమానంలోకి ఎక్కించారు. ఇటీవలి కాలంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరచు వార్తల్లో నిలుస్తోంది. తమ కుందేలు చనిపోవడానికి ఈ సంస్థే కారణమంటూ దాని యజమానులు కేసు పెడతామని కూడా ఇటీవల హెచ్చరించారు. అంతకుముందు ఓ ప్రయాణికుడిని విమానంలోంచి లాక్కుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 14న అయితే ఇదే విమానయాన సంస్థకు చెందిన ఓ విమానంలో హ్యూస్టన్లోనే ఓ ప్రయాణికుడిని తేలు కుట్టింది.