Savills
-
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
దేశీ రియల్టీ రంగంలో డీలా పడ్డ పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ క్యాలండర్ ఏడాది(2022) తొలి త్రైమాసికంలో డీలా పడ్డాయి. ఈ క్యూ1(జనవరి–మార్చి)లో 47 శాతం క్షీణించి 100 కోట్ల(బిలియన్) డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021) ఇదే కాలంలో 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. అయితే గతేడాది క్యూ4(అక్టోబర్–డిసెంబర్)లో 21.8 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. వీటితో(త్రైమాసికవారీగా) పోలిస్తే పీఈ పెట్టుబడులు తాజా క్వార్టర్లో 4.5 రెట్లు జంప్చేసినట్లని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సావిల్స్ ఇండియా పేర్కొంది. ఈ క్యూ1లో వాణిజ్య కార్యాలయాల ఆస్తులు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేసింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 70 శాతాన్ని ఆక్రమించడం గమనార్హం! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి లభించిన అత్యధిక శాతం త్రైమాసిక పెట్టుబడుల్లో బెంగళూరులోని కీలక ఆఫీసు ఆస్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సావిల్స్ ఇండియా వెల్లడించింది. కాగా.. ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ రియల్టీ రంగ పీఈ పెట్టుబడులు 32 శాతం వెనకడుగు వేసినట్లు గత వారం అనరాక్ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. 2020–21లో తరలివచ్చిన 6.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 4.3 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్లు తెలియజేసింది. చదవండి: షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..? -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా?
ముంబై: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ సవిల్స్ నిర్వహించిన సర్వేలో లండన్ తరువాతి స్థానాల్లో న్యూయార్క్, హాంకాంగ్ నగరాలు నిలిచాయి. ఈ టాప్ ట్వంటీ ఖరీదైన నగరాల జాబితాలో భారత్ నుంచి ఏకైక నగరం ముంబై 17వ స్థానంలో నిలిచింది. ముంబై తరువాతి స్థానాల్లో బెర్లిన్, జొహనెస్బర్గ్, రియోడీజెనీరో నగరాలు ఉన్నాయి. ఈ సర్వేలో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని కార్యాలయాలు, నివాసస్థలాలకు గల అద్దె ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు. లండన్లో అత్యధికంగా ఒక వ్యక్తికి సంవత్సరానికి సుమారు 76 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో లండన్లో ఈ ఖర్చులు 18 శాతం పెరిగినట్లు సవిల్స్ వరల్డ్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేకు నేతృత్వం వహించిన బార్నెస్ తెలిపారు. ప్రపంచ నగరాలు సాధిస్తున్న ఆర్థక ప్రగతే.. అక్కడ పెరిగిపోతున్న అద్దెలకు ప్రధాన కారణమౌతోందని, అలాంటి చోట్ల సామాన్య ప్రజానికానికి ఇంటి అద్దెలను భరించటం సమస్యగా మారిందని ఆమె వెల్లడించారు. ఒక నగరానికి సంబంధించిన ఉత్పాదకత, ప్రపంచ వాణిజ్యంపై నేరుగా ప్రభావం చూపించేలా ఉంటే అక్కడ అద్దె ఖర్చులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. -
కుబేరుల ‘రియల్’ సంపద..!
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల సంపదలో ఐదో వంతు రియల్ ఎస్టేట్దే. అలాగే ఆసియా కుబేరుల మొత్తం సంపదలో సింహభాగం రియల్టీదేనని అం తర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ, సావిల్స్ తాజా నివేదిక పేర్కొంది. వెల్త్-ఎక్స్ సంస్థతో కలిసి రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు..., ప్రపంచంలో 2 లక్షల మంది అపర కుబేరులు (ఆల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్) తమ సం పదలో ఐదో వంతు రియల్టీలో ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచంలో అపర కుబేరుల మొత్తం సంపద 27,77,000 కోట్ల డాలర్లు. దీంట్లో రియల్టీ ఆస్తులు వాటా 19%(5,32,800 కోట్ల డాలర్లు). యూరోపియన్ కుబేరులకు అత్యధిక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. వారి మొత్తం ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ వాటా 31%. ఆ తర్వాతి స్థానంలో 27% వాటాతో ఆసియా కుబేరులు, 26% వాటాతో మధ్య ఆసియా కుబేరులున్నారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 180 లక్షల కోట్ల డాలర్లు. దీంట్లో 72%యజమానులే నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్రొపర్టీయే. ప్రపంచ జనాభాలో అపర కుబేరుల సంఖ్య 0.003 శాతమే. అయితే ప్రపంచవ్యాప్త రియల్టీలో వీరి వాటా 3%. ఒక్కొక్కరి సగటు రియల్టీ సం పద 2.65 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.159 కోట్లు) 2018 నాటికి అపర కుబేరుల సంఖ్య 22% పెరుగుతుంది. ప్రస్తుతం 27.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వీరి సంపద 2018 నాటికి 36 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.