breaking news
Sangam Lal Pandey
-
నేడు పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంలో వాదనలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. పాత రూ. 500, 1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో నాలుగు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిలో రెండింటిని ఢిల్లీకి చెందిన అడ్వొకేట్లు వివేక్ నారాయణ్ శర్మ, సంగంలాల్ పాండేలు దాఖలు చేయగా మిగిలిన రెండు వ్యాజ్యాలను ఎస్.ముత్తుకుమార్, ఆదిల్ ఆల్వే వేశారు. -
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితరా హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం జారీచేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని, రాజ్యాంగ సమన్యాయ విధానాన్ని ఆచరించడంలో విఫలమైందని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్ ఈ వారంలోనే విచారణకొస్తుంది. ఇదే అంశంపై ఉత్తరప్రదేశ్ కు చెందిన న్యాయవాది సంగంలాల్ పాండే కూడా పిటిషన్ వేశారు. -
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్