breaking news
Saline water
-
‘గ్లూకోజ్ వాటర్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది’
న్యూఢిల్లీ: జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసిన ఓ ట్యూటర్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బీఏ రెండో సంవత్సరం చదువుతోన్న సందీప్ పాకెట్ మనీ కోసం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సందీప్ తన దగ్గర జ్ఞాపకశక్తి పెరిగే ఇంజక్షన్ ఉందని.. అది తీసుకుంటే.. విద్యార్థుల మెమరీ పవర్ చాలా బాగా వృద్ధి చెందుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థులు ఆ ఇంజక్షన్‌ను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తల్లిదండ్రులకు దీని గురించి తెలిసింది. అసలు జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ ఏంటి అంటూ వారు సందీప్‌ని ఆరా తీశారు. అతడు సెలైన్ వాటర్‌ని విద్యార్థులకు ఇస్తే.. అది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని తాను యూట్యూబ్‌లో చూశానని.. అందుకే విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచడానికి తాను సెలైన్‌ని ఇచ్చానని వెల్లడించాడు. దీని గురించి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా.. -
సెలైన్ వల్లే వారి కంటి చూపు పోయింది
సాక్షి, హైదరాబాద్: సెలైన్ వాటర్‌లో స్వచ్ఛత లేకపోవడం వల్లే సరోజినీ కంటి ఆసుపత్రిలో ఏడుగురు కంటి చూపు కోల్పోయారని కల్చర్ రిపోర్టు తెలిపింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సుదీర్ఘంగా కల్చర్ (స్టెరిలిటీ) పరీక్షలు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ రిపోర్టును తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. మొత్తం మూడు బ్యా చ్‌లకు చెందిన సెలైన్ వాటర్ బాటిళ్ల నమూనాలను పరీక్షించగా... వాటిలో ఒక బ్యాచ్ బాటిళ్ల నమూనాలో స్వచ్ఛత లేదని రిపోర్డు తెలిపింది. స్వచ్ఛమైన సెలైన్ వాటర్ కాదని నిర్ధారించిన డీసీఏ... అందులో ఏముందో స్పష్టత ఇవ్వలేదని అధికారులు తెలిపారు. బ్యాక్టీరియా ఉండవచ్చని అంచనా వేస్తున్నా రు. సెలైన్ వాటర్‌లో ఉండే ఏదో ఒక లవణంలో కానీ... రసాయనంలో కానీ లోపం ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని సరఫరా చేసిన కంపెనీపై చట్టపరంగా కేసు పెట్టి తగు చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. 1,200 బాటిళ్ల సరఫరా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలు అన్నింటినీ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. ఆ ప్రకారం గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా బాధ్యతను నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1200 సెలైన్ బాటిళ్లు సరోజినీ ఆసుపత్రికి అందజేశారు. వాటిలో 16,385 బ్యాచ్‌కు చెందిన 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్‌కు చెందిన 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆ ఆసుపత్రికి అందాయి. వాటిలో 624 బాటిళ్లు ఉపయోగించారు. అందులోని కొన్నింటి కారణంగా ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. వాటి నమూనాలనే డీసీఏ పరీక్షించి తాజా నివేదిక సమర్పించింది.