breaking news
Sakunthala
-
శాకుంతలం: మళ్లీ వాయిదా
‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌లో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ముందు గత ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే 3డీ విజువల్ ఎక్స్పీరియన్స్, వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) పనులు పూర్తి కాని కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. కానీ 17న కూడా ‘శాకుంతలం’ థియేటర్స్‌కి కావడం లేదు. విడుదల వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
కూతురితో లెక్క తప్పింది
‘హ్యూమన్ కంప్యూటర్’ శకుంతలాదేవి ఒకకాలంలో దేశంలో బాలికలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చదువుకోవాలనుకున్న చాలామంది ఆడపిల్లలు శకుంతలాదేవిలా లెక్కల్లో టాప్‌గా నిలవాలనుకున్నారు. నిలిచారు కూడా. గణితం మగవారి సబ్జెక్ట్ అని, స్త్రీలు తెలుగో ఇంగ్లిషో బోధించుకోవాలని చాలా ఏళ్లుగా అనుకునేవారు. కాని శకుంతలాదేవి గణిత మేధ ఆ ఆలోచనను మార్చింది. ఆమె ఎవరికీ సాధ్యం కాని లెక్కలను సెకన్లలో తేల్చి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి భారత ప్రతిష్టను పెంచింది. 1929లో బెంగళూరులో జన్మించిన శకుంతలా దేవి తన 83వ ఏట 2013లో మరణించింది ఆమె కథ ఇప్పుడు ‘శకుంతలాదేవి’ పేరుతో నిర్మితమయ్యి అమేజాన్ ప్రైమ్‌లో జూలై 31న విడుదల కానుంది. శకుంతలా దేవిగా విద్యాబాలన్ నటించింది. తాజాగా వెలువడ్డ ట్రయిలర్‌ను బట్టి ఈ సినిమాలో శకుంతలా దేవి ఆమెకు కుమార్తెతో ఉండే ఘర్షణ ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. నిజజీవితంలో శకుంతలాదేవి పరితోష్ బెనర్జీ అనే ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. వారికి అనుపమ బెనర్జీ అనే కుమార్తె ఉంది. విడాకుల తర్వాత తండ్రిని కలవనివ్వకుండా పెంచిందనే కూతురి అసంతృప్తి ఈ సినిమాలో కథాంశం గా ఉంది. లెక్కల రంధిలో పడి తనను సరిగా పెంచకపోవడం గురించి కూడా కుమార్తె ఫిర్యాదు చేయడం సినిమాలో కనిపిస్తుంది. ‘నువ్వు ఆర్డినరీ అమ్మలా ఎందుకు ఉండవు?’ అని కూతురు ప్రశ్నిస్తే ‘నేను అమేజింగ్‌గా ఉన్నప్పుడు ఆర్డినరీగా ఎందుకు ఉండమంటావు’ అని శకుంతలాదేవి పాత్ర పోషించిన విద్యాబాలన్ అనడం కనిపిస్తుంది అనుపమ బెనర్జీ ఈ సినిమా ప్రారంభానికి క్లాప్ కొట్టడాన్ని బట్టి ఆమె దృష్టిలోని శకుంతలా దేవిని ఈ సినిమాలో చూడనున్నామని తెలుస్తోంది. సినిమాలో కూతురి పాత్రను ‘దంగల్’ అమ్మాయి సాన్యా మల్హోత్రా పోషించింది. అను మీనన్ ఈ సినిమా దర్శకురాలు.ఏమైనా ఈ సినిమా మరోసారి శకుంతలా దేవి స్ఫూర్తిని ప్రపంచానికి ఇవ్వనుంది. ‘గణితం నా బెస్ట్ ఫ్రెండ్’ అని ఈ సినిమాలో ఆమె చెబుతుంది. అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఒక స్త్రీ మేధను కాకుండా ఆమె గుండెల్లో దాగిన మనోభావాలు ఈ సినిమాలో చూడటానికి దొరుకుతాయని భావించవచ్చు. -
పద్యానవనం: నిజం నశించిన విధం
ఆడిన మాటను తప్పిన గాడిదకొడుకా యటన్న, గాడిద యదివి న్వీడా నాకొక కొడుకని గాడిదయే యేడ్చెనటర ఘన సంపన్నా! ఇదొక చాటుపద్యం. ఎంతో కాలంగా ప్రజాసమూహాల్లో ప్రచారంలో ఉంది. ఎవరు రాశారో తెలియదు. మాట తప్పడం ఎంత అవమానకరమో సాపేక్షంగా చెప్పాడు. అల్ప పదాలతోనూ ఆ చెప్పడం అద్భుతంగా ఉన్నందుకేమో పదికాలాలు పదిలంగా ఉండిపోయిందీ పద్యం. నిజమే, మాట మరచినపుడు ఎన్ని అనర్థాలు జరిగాయి! కాలమే మౌన సాక్షి. మాట నిలబెట్టుకోవడానికి ఎందరెందరో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.... అందుకు చరిత్ర సజీవ సాక్ష్యంగా ఉంది. సత్యహరిశ్చంద్రుడి కథ అంతగా ప్రభావితం చేసింది కనుకే మన జాతిపిత మహాత్ముడు సత్య పరిశోధనకు తన జీవితాన్నే ప్రయోగశాల చేసి విజేత అయ్యారు. తానిచ్చిన మాట కూడా కాదు, పితృవాక్యపరిపాలన కోసం శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి అష్టకష్టాలనుభవించడమే కదా రామాయణం! కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్య అలవోకగా అబద్ధాలాడేస్తున్నారు జనాలు. ఇక కొందరు రాజకీయనాయకులైతే... చెప్పనవసరం లేదు. అబద్ధాలాడి కూడా రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారంటే, శీఘ్ర గతిన మరచిపోయే ప్రజల తత్వం మాటున వారు హాయిగా బతికిపోతున్నారు. మన స్వాతంత్య్రపు తొలినాళ్లలో... అబద్ధమాడటం కాదు, చట్టసభల్లో అబద్ధమన్న పదాన్ని ఉచ్ఛరించడమే పెద్ద తప్పిదంగా భావించేవారు. అందుకే, ఇప్పుడు మన శాసనసభలో కూడా ఎదుటివాళ్లను విమర్శించేప్పుడు అవసరమైతే ‘సత్య దూరమైన మాట’ అనొచ్చంటారు తప్ప ‘అబద్ధం‘ అన్న మాట రికార్డుల్లోకి వెళ్లకుండా చూస్తుంటారు. ఆచరణలో మాత్రం... అధికారంలో ఉంటే ఒక మాట, విపక్షంలో ఉంటే ఇంకోమాట. నిన్నటి మాట మీద ఈ రోజు నిలబడని నేతలెందరో! అవసరమైతే మరో అబద్ధాన్ని జోడించి ‘మీడియా వక్రీకరించింది’ అని తప్పుకోజూస్తారు. పాత రోజులు కాదు కదా, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతి తర్వాత...‘ఇదుగో నిన్న ఇలా అన్నారు, ఈ రోజిలా... ’అని రెండు దృశ్యాలు పక్కపక్కన చూపిస్తూ ఎండగట్టినా దబాయింపే తప్ప తప్పు ఒప్పుకునే సంస్కారం తక్కువ మందిలో ఉంటుంది. ఇచ్చిన మాటకోసం ఎన్ని అవాంతరాలెదురయినా మొక్కవోని దీక్షతో ముందుకు కదలిన పాలకులు లేరని కాదు, కానీ చాలా అరుదు. మాట తప్పకుండా సత్యం పక్షాన నిలిచిన వారు కాలాలకతీతంగా చరిత్రలో నిలిచారు. మాట తప్పిన వాళ్లు అనామకంగా కాలగర్భంలో కలిసిపోయారు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్న దుష్యంతుని మాటలకు చిగురుటాకులా అల్లాడిపోయింది శకుంతల. ఎవరి వల్ల తనకు పుత్రోదయం కలిగిందో ఆయనే ఆ మాటలంటే తనకేది తెరగు? అని చింతిస్తూ ఆమె ఒక మాట చెప్పింది. ‘‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కన్న సూనృతవ్రత....’’ అంటూ నన్నయ ఒక గొప్ప పద్యం రాశారు. సత్యవాక్కు గొప్పదనం వివరిస్తేనన్నా వింటాడేమోనని.... ‘నూరు చేదుడు బావుల కన్నా ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు బావులు తవ్వించడం కన్నా ఒక యజ్ఙం మేలు, నూరు యజ్ఙాలకన్నా ఒక కుమారుణ్ని కలిగి ఉండటం గొప్ప, అటువంటి నూర్గురు కుమారుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పద’ని శకుంతల వివరిస్తుంది. అదే నిజమని అశరీరవాణి పేర్కొన్న మీదట దుష్యంతుడు గతం గుర్తుకు తెచ్చుకొని శకుంతలనూ, తనయుడు భరతుణ్నీ చేరదీస్తాడు. వ్యాసభారతంలో ‘‘అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్, అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవాతిరిచ్చతే’’ అనే గొప్ప మాటుంది. అంటే, వెయ్యి అశ్వమేధయాగా(ఫలా)లూ, సత్యమూ-వీటిని తక్కెడలో పెట్టి తూచగా సత్యమే బరువుగా తూగిందని అర్థం. ‘సత్యమేవ జయతే’. - దిలీప్‌రెడ్డి