breaking news
saidharam Tez
-
దేశానికి మనమేమిచ్చాం!
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. దేశానికి మనమేమిచ్చాం అన్నది ముఖ్యం. అయినా మనలోని దేశభక్తి ఒకడు చెప్తే గుర్తుకు రాకూడదు. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత. ఇలా ఆలోచించే ఓ కుర్రాడు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు జవాన్లా మారి శత్రువులపై యుద్ధం చేస్తాడు. జవాన్ దేశభక్తి, దేశం కోసం అతనేం చేశాడు? అనేది సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’ని చూస్తే తెలుస్తుంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన చిత్రం ‘జవాన్’. ‘‘ప్రతి ఇంటికీ మా హీరోలా ఒకరు ఉండాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్‌తో కూడిన చిత్రం. తేజ్ యాక్టింగ్ సూపర్బ్. తమన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు రవి. -
ఆ సీన్స్ చేయడం కష్టమైంది!
‘‘ఈ చిత్రంలో హీరోకి పరిచయమయ్యే పాత్రలన్నీ తిక్క తిక్కగా ప్రవరిస్తాయి. అందుకే, ఆ టైటిల్ పెట్టాం. అంతేకానీ, మా మావయ్య పవన్ కల్యాణ్ ప్రస్తావన సినిమాలో ఉండదు. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్, సినిమాలకు డిఫరెంట్‌గా చేశా. చరణ్, బన్నీలు ‘తిక్క హీరో’ అని ఆటపట్టిస్తున్నారు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా సి.రోహిణ్‌రెడ్డి నిర్మించిన ‘తిక్క’ రేపు విడుదల కానుంది. తేజ్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే యువకుడిగా కనిపిస్తా. లవ్‌లో ఫెయిలైన తర్వాత ఫ్రెండ్స్‌కి ఇచ్చిన బ్రేకప్ పార్టీలో మందు తాగడం వల్ల పరిస్థితులన్నీ మారతాయి. అప్పట్నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర య్యాయి? పార్టీలో పరిచయమైన స్నేహితులతో ఏం చేశాడు? అనేది సినిమా. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘హ్యాంగోవర్’కీ, దీనికీ సంబంధం లేదు. మందు తాగిన సీన్స్ చేయడం కష్టమైంది. అప్పుడు నటుడు ‘తాగుబోతు’ రమేశ్ కొన్ని సలహాలిచ్చాడు. చిరంజీవి, కల్యాణ్ మావయ్యల ఫిల్మ్స్ చూసినా, వాళ్లలా కాక నేను కొత్తగా ఏం చేయగలనని సవాలుగా తీసుకుని ఈ సీన్స్ చేశా. ధనుష్, శింబులతో పాడించాలనే ఐడియా తమన్‌దే. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు సునీల్‌రెడ్డికి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది. కొత్త నిర్మాత రోహిణ్‌రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్లోనే మంచి క్వాలిటీ సినిమా నిర్మించారు. ఇతర హీరోలతో పాటు మా ఫ్యామిలీ హీరోలు చరణ్, అర్జున్, వరుణ్, శిరీష్... వీలైతే చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో కలసి నటించాలనుంది. కల్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ సినిమా డిస్కషన్స్‌లో ఉంది. కథ రెడీ అయ్యాక నిర్ణయం తీసుకుంటాను. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్’ మధు నిర్మించే సినిమా ఈ నెలాఖరున మొదలవుతుంది. కృష్ణవంశీగారితో ఎప్పట్నుంచో పరిచయముంది. ఆయన అడిగిన వెంటనే ‘నక్షత్రం’లో పోలీసాఫీసర్‌గా చేయడానికి అంగీకరించా. ఇరవై నిమిషాల పాటు తెరపై కనిపిస్తా.