breaking news
safety check
-
'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి!
రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే న్యూ భారత్ ఎన్సీఏపీ (Bharat NCAP) నిబంధనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నియమాలు 2023 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అనేది దాదాపు గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని వ్యత్యాసాలను గమనించవచ్చు. గ్లోబల్ ఎన్సీఏపీ కింద, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో వాహనం గరిష్టంగా 34 పాయింట్లు స్కోర్ చేయగలదు. కానీ భారత్ ఎన్సీఏపీ కింద 32 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రెండు టెస్టింగ్ ప్రోటోకాల్‌లు ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఒక్కొక్కటి 16 పాయింట్లను అందిస్తాయి. భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే 1 స్టార్ రేటింగ్ లభిస్తుందనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు! ఒక కారు భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకోవాలంటే.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 22 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 35 పాయింట్లు స్కోర్ చేస్తే 4 స్టార్ రేటింగ్ లభిస్తుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 16 పాయింట్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 10, 4 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 18, 9 పాయింట్లు స్కోర్ చేస్తే 2 స్టార్ రేటింగ్ & 1 స్టార్ రేటింగ్ లభిస్తుంది. -
చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట
-
చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట
అండగా సోషల్ మీడియా... సంతోషాలను పంచుకోవడానికే కాదు కష్టాలను పంచుకోవడానికి, వీలైతే సాయం చేయడానికి కూడా చాలమంది సోషల్ మీడియాను ఓ వేదికగా చేసుకుంటున్నారు. వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై వాసుల కోసం నెటిజన్లేకాదు.. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్, జిప్పర్ వంటి సంస్థలు కూడా తమదైన శైలిలో సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఫేస్బుక్ సేఫ్టీచెక్.. వరదల్లో చిక్కుకున్న తమవారి పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన పడుతున్నవారికి ఊరట కల్పించేందుకు ఫేస్బుక్ సంస్థ ‘సేఫ్టీ చెక్’ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ వినియోగదారులు ఈ ‘సేఫ్టీచెక్’ టూల్‌ని క్లిక్ చేస్తేచాలు... స్నేహితులకు, బంధువులకు, వారి ఖాతాలో ఉన్నవారందరికీ క్షేమంగా ఉన్నారనే సమాచారం వెళ్లిపోతుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించనున్న గూగుల్ నగరంలో ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? వదర నీరు ఎక్కడ తగ్గుముఖం పట్టింది? ఎక్కడ వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది? ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలేవీ? ఏ ప్రాంతంలో ఉండడం క్షేమకరం? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ సంస్థ ‘రిసోర్స్ ఫర్ చెన్నై ఫ్లడ్స్’ అంటూ ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు, సాయం చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి చెబుతుంది. ఫేస్బుక్లో కొందరి ఆవేదనలు, అభ్యర్థనలివి... ‘సైదాపేట్‌లోని వేలంకణి స్కూల్ దగ్గర ఓ గర్భిణి చాలసేపటి నుంచి నిలబడే ఉంది. నన్ను క్షమించండి.. ఆమెకు ఎటువంటి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మీలో ఎవరికైనా దగ్గర్లో డాక్టర్ అందుబాటులో ఉంటే దయచేసి ఆమెకు సాయం చేయండి. ఆమెకు సాయం చేయడం కోసం---- నంబర్‌కు కాల్ చేయండి’ -అపర్ణా జ్యోతి ‘నా స్నేహితురాలు మంగళం మురుగన్ కుటుంబం కె.కె. నగర్‌లోని తమ ఇంట్లో చిక్కుకుంది. రెండంతస్తుల ఆ ఇంట్లోని మొదటి అంతస్తును వరద, డ్రైనేజీ నీరు ముంచేసింది. ఆ ఇంట్లో ఇప్పుడు మూడు నెలల పసిపాప ఉంది. కరెంటు లేదు.. ఉన్న జనరేటర్ నీటిలో మునిగిపోయింది. వాళ్లు కనీసం కాంటాక్ట్‌లో కూడా లేరు. నేను వారికి సాయం చేయలేని స్థితిలో ఉన్నా. దయచేసి.. మీలో ఎవరైనా అక్కడికి దగ్గరగా ఉంటే వారికి సాయం చేయండి’ -సాయికృష్ణ