breaking news
sadavarti Land
-
రూ.5 కోట్లు ఇస్తామన్నా స్పందన ఏదీ? : పీసీసీ
సాక్షి, అమరావతి: సదావర్తి భూములకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ప్రశ్నించారు. గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ ఎకరం రూ. 6 కోట్లు ఉన్న సదావర్తి భూములను చౌకగా ఎకరం రూ. 27 లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టారన్నారు. విమర్శలు రావడంతో ఎవరైనా రూ. 5 కోట్లు అదనంగా చెల్లిస్తామని ముందుకొస్తే వేలంపాట రద్దుచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసిందని ఆరోపించారు. -
సదావర్తి భూములు మళ్లీ వేలం
-
సదావర్తి భూములపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి సత్రం భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రపు ధరకే విక్రయించిన వ్యవహారంపై జుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇప్పటికే జరిగిన సదావర్తి సత్రం భూముల అమ్మకాలను రద్దు చేసి, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సదావర్తి సత్రం ఈవో, ఆదాయపు పన్నుశాఖ చీఫ్ కమిషనర్, పెద్దకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, కుమారుడు నిరంజన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.