breaking news
Rupee Coin
-
రూ.1 తయారీకి.. రూ.1.11 వ్యయం
ఒక రూపాయి బిళ్ల తయారవడానికి ఒక రూపాయి 11 పైసలు కావాలి. అదే 10 రూపాయల బిళ్లకైతే రూ.5.54. రూ.10 నోటు మన చేతిలోకి రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతోంది. కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే. ఈ ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది. 2024–25లో కరెన్సీ ముద్రణకు ఏకంగా రూ.6,373 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. నాలుగేళ్లలో ఖర్చు 58.8 శాతం పెరిగిపోయింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కరెన్సీ నోట్లను కొంత మంది పర్సులోనో, జేబులోనో కుక్కిపెడతారు. పాడవుతాయన్న పట్టింపు ఉండదు. చినిగిపోయినా ఏముందిలే ఏ షాపులోనైనా తీసుకుంటారు అన్న ధీమా. లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చని తేలిగ్గా తీసుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం అని కొట్టిపారేయకండి. కరెన్సీ నోటు కూడా ఖర్చు పెట్టి తయారుచేయాల్సిందే. ఎందుకంటే తయారీ, పంపిణీ వ్యయాన్ని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మీకు కనిపించే అంకెను మించి ఉంటుంది.కరెన్సీ తయారీలో వాడే సిరా, కాగితం వంటి ముడి సరుకు వ్యయాలకుతోడు సిబ్బంది వేతనాలూ పెరిగాయి. దీని ఫలితంగా ముద్రణ ఖర్చు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్లను జోడించడం కూడా ఖర్చును పెంచిందని ఆర్బీఐ చెబుతోంది. పెరిగిన నోట్ల సరఫరాఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020–21లో నోట్ల ముద్రణకు రూ.4,012 కోట్ల ఖర్చు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం కాస్తా రూ.6,373 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 58.8 శాతం ఎగసిందన్నమాట. 2023–24లో కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.5,101 కోట్లు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నాలుగేళ్లలో దేశంలో నోట్ల సరఫరా దాదాపు 2,233 కోట్ల నుంచి 35.7 శాతం పెరిగి 3,030 కోట్లకు చేరింది. ఆర్బీఐకి కరెన్సీ నోట్లు నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి వస్తాయి. ఇందులో నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్) ప్రెస్‌లు భారత ప్రభుత్వానికి చెందినవి. మైసూర్ (కర్ణాటక), సల్బోని (పశ్చిమ బెంగాల్) ప్రెస్‌లు రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయి. మూడు రకాల కరెన్సీచెలామణిలో ఉన్న కరెన్సీలో భారత్‌లో ప్రస్తుతం బ్యాంకు నోట్లతోపాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), నాణేలు ఉన్నాయి. 2024–25లో దేశంలో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ 6 శాతం, పరిమాణం (నోట్ల సంఖ్య) 5.6 శాతం పెరిగింది. 2023 మేలో రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రూ.3.56 లక్షల కోట్లలో 98.2% విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. రూ.500 నోట్ల హవాగత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా రూ.500 నోట్ల వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గింది. పరిమాణం పరంగా రూ.500 నోట్ల వాటా 40.9 శాతం ఉంది. చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.500 నోట్ల వాటాయే అత్యధికం. పరిమాణం పరంగా తరువాతి స్థానాన్ని రూ.10 నోట్లు కైవసం చేసుకున్నాయి. వీటి వాటా మొత్తం పరిమాణంలో 16.4 శాతం. చెలామణిలో ఉన్న నోట్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల మొత్తం వాటా 31.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం చెలామణిలో ఉన్న నాణేల విలువ 9.6 శాతం, సంఖ్య 3.6 శాతం దూసుకెళ్లింది. 2025 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నాణేల పరిమాణంలో రూ.1, రూ.2, రూ.5 నాణేల వాటా 81.6 శాతం. విలువ పరంగా ఈ నాణేల వాటా 64.2 శాతానికి చేరింది. ఈ–రుపీ కొత్త రికార్డు2024–25లో చెలామణిలో ఉన్న ఈ–రుపీ విలువ 334 శాతం పెరిగింది. 2025 మార్చి 31 నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విలువ రిటైల్ రూపంలో (చెలామణిలో) నాలుగు రెట్లు పెరిగి రూ.1,016.46 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.234 కోట్లు. ఈ–రుపీ డిజిటల్ రూపంలో పనిచేసే నగదు. వినియోగదారులు దీన్ని నిల్వ చేయడంతోపాటు బదిలీ కూడా చేయొచ్చు. 2025 మార్చి నాటికి 17 బ్యాంకులు డిజిటల్ వాలెట్స్ ద్వారా ఈ–రుపీని అందిస్తున్నాయి. దీన్ని 60 లక్షల మంది వినియోగిస్తున్నారు. పెరిగిన నకిలీ రూ.500 నోట్లు 2024–25లో బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 37.3 శాతం పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. రూ.5.88 కోట్ల విలువైన 1.18 లక్షల నకిలీ రూ.500 నోట్లు (కొత్త డిజైన్) కనుక్కొన్నారు. 2023–24లో రూ.4.28 కోట్ల విలువైన 85,711 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ రూ.200 నోట్లు 13.9% పెరిగాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ. 2000 నోట్లలో నకిలీవి.. గతేడాదితో పోలిస్తే వరుసగా 32.3, 14, 21.8, 23 శాతం పెరిగాయి. నకిలీ రూ.2000 నోట్ల సంఖ్య ఏడాదిలో 26,035 నుంచి 3,508 నోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2.17 లక్షలు. అంత క్రితం ఏడాది ఈ సంఖ్య 2.22 లక్షల నోట్లు. -
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
నిత్యజీవితంలో మనం రోజూ 1, 2 , 5 రూపాయల నాణేలను చూస్తూనే ఉన్నాం, చలామణి చేస్తూనే ఉన్నాం. అయితే ఒక రూపాయి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఐదు రూపాయలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి ఒక రూపాయి నాణేన్ని తయారు చేయడానికి 111 పైసలు (రూ.1.11), రెండు రూపాయల నాణెం కోసం రూ.1.28, ఐదు రూపాయల నాణెం తయారీకి రూ.3.68 ఖర్చు అవుతుంది. ఇక 10 రూపాయల నాణెం కోసం రూ.5.54 ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఒక రూపాయి తయారీకి.. ఒక రూపాయి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం! నాణేలు ముంబై, అలీపూర్ (కోల్‌కతా), సైఫాబాద్ (హైదరాబాద్), చెర్లపల్లి (హైదరాబాద్), నోయిడా (యుపి) లోని నాలుగు భారత ప్రభుత్వ మింట్లలో ముద్రిస్తారు. నాణేలు ఆర్బీఐ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాత్రమే చలామణి కోసం జారీ చేస్తారు. -
రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా..
భూమి మీద దాదాపు అన్నింటికీ డబ్బు కావాల్సిందే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్. ఇది మనల్ని ఎంతలా మార్చేసిందంటే మృగాలను వేటాడి పొట్టనింపుకునే ఆదిమానవులుగా ఉండే మనుషులను రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. అంతేకాదు పగలు, రాత్రి డబ్బుకోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది. ఈ డబ్బుకు ఇంత పవర్ ఎలా వచ్చిందో తెలుసా. ఇప్పుడు మనం ప్రతివస్తువు కొనేందుకు వాడే రూపాయి ఎలా పుట్టిందనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా?.. డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో.. మన దేశంలో ఈ డబ్బు ఎలా చలామణైందో.. రాళ్ల నుంచి ‘ఈ-రుపీ’ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఈ కథనంలో తెలుసుకుందాం. డబ్బు అంటే తెలియని కాలమది. కొన్ని రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం దాదాపు 6000 ఏళ్ల కింద ఇరాక్‌లోని మెసపటోమియా ప్రాంతంలో చిన్న గుంపులుగా మనుషులు జీవించేవారు. వారికి తెలిసింది ఒక్కటే. వేటకు వెళ్లి పొట్ట నింపుకుని మళ్లీ పూటకోసం వేటకు వెళ్లడం. ఆ క్రమంలో కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. ఇంకొన్ని రోజులు ఆహారం దొరకదు. కానీ ప్రతిరోజూ ఆకలైతే వేస్తుంది కదా. ఇలా వేర్వేరు గుంపులుగా వేటకు వెళ్లే వారిలో కొన్ని గుంపులోని వారికి కొన్ని రోజులు, మరికొన్ని గుంపులకు ఇంకొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది. ఇలా అయితే కష్టం అని భావించి కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే ‘బార్టర్ సిస్టమ్’. బార్టర్ సిస్టమ్.. బార్టర్ సిస్టమ్‌లో భాగంగా ఆ గుంపుల్లోని వారివద్ద ఉన్న ఆయుధాలు ఇతర పరికరాలను వేరే గుంపులకు ఇచ్చి దానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవారు. ఇలా మొదలైన ఈ పద్ధతి చాలా ఏళ్లే కొనసాగింది. ఇలా జరుపుతున్న లావాదేవీలు ఏరోజుకు ఆరోజు సెటిల్ అయితే ఫర్వాలేదు. కానీ అలా సెటిల్కాకుండా తర్వాత రోజుల్లో సెటిల్ చేసుకోవాలనుకుంటే వాటిని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వివరాలను రాళ్లపై నోట్ చేసుకునేవారు. ఇలా అకౌంటింగ్ మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బార్టర్ సిస్ట్మ్తో కొత్త సమస్య వచ్చింది. ఇందులో ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ఇవ్వాల్సిందే కదా. అయితే బదులుగా ఇచ్చేవాటిలో కొన్ని ఎదుటివారికి అవసరం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చేది. దాంతో విలువైన వస్తువులు తీసుకుని జంక్ వస్తువులు ఇచ్చేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైనా వస్తువుకు బదులుగా ఒకే వస్తువును పరిగణించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు, విక్రయాలు జరిపినా ఆ వస్తువును మార్చుకుందామని భావించి కమొడిటీస్‌ను ఇచ్చిపుచ్చుకునేవారు. గవ్వలతో ట్రేడింగ్.. కమొడిటీస్ అంటే ఇప్పటిలాగా బంగారం, వెండీ కాదు. వీటికి బదులుగా ట్రేడ్ కోసం మొదటగా వాడిన వస్తువు గవ్వలు. అప్పట్లో హిందూమహాసముద్రంలో దిరికే అరుదైన ఈ గవ్వలను ట్రేడింగ్ కోసం వినియోగించేవారు. వాటిని విలువైన వస్తువులగా పరిగణించేవారు. అందుకే చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, సినిమాల్లో వారు ధరించే వస్తువులు, దుస్తులు గవ్వలతో తయారుచేసి ఉంటాయి. తర్వాత రోజుల్లో మిరియాలు, ఉప్పు, పూసలు, రంగురాళ్లు, కుండలు.. వంటి అరుదైన వాటిని మనీగా వినియోగించేవారు. ఈ పద్ధతి ఇంకొన్నేళ్లు సాగింది. తర్వాత లోహం ఆవిష్కరించారు. దాంతో మెటల్ నాణెన్ని తయారుచేశారు. నాణెం పుట్టుక.. భారత్‌లో ముందుగా నాణెం పుట్టింది ఆరో శతాబ్దంలో అని పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాలు అనే రాజులు ఈ కాయిన్లను ముద్రించారు. వాటికి పురాణా, కష్యపణాలు, పణాలు అని పిలిచేవారు. ఇలా ముద్రించిన వాటికి ఎలాంటి ఆకారం ఉండేదికాదు. తర్వాతకాలంలో మౌర్యులు గ్రీక్‌ను గమనించి ప్రత్యేక మార్కుతో వివిధ మెటల్స్‌తో నాణేలు ముద్రించారు. బంగారు నాణేలను సువర్ణరూప, రాగి నాణెలను తామరరూప, వెండి నాణెలను రూప్యరూప అని పిలిచేవారని చంద్రగుప్తుడికి మంత్రిగా ఉన్న చాణుక్యుడు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అయితే ఈ నాణెలు ఎవరు తయారుచేశారో వాటిపై ఉన్న గుర్తులనుబట్టి తెలుసుకునేవారు. నాణేలపై ఎలుగుబంటి ముంద్రించి ఉంటే చాణుక్యులదని, ఎద్దు ఉంటే పల్లవులదని, పులి ఉంటే చోళులదని.. తెలుసుకునేవారు. ఇదీ చదవండి: టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు? రుపీయే నుంచి రూపాయిగా.. దేశంలో మొఘలులు వచ్చాకే అప్పటివరకు వివిధ రూపాల్లో చలామణి అయిన నాణెలు రూపాయిగా మారింది. 1526 ఏడీలో మొఘల్ చక్రవర్తి షేర్షాసూరి 178 గ్రాముల సిల్వర్ కాయిన్‌ను రుపియేగా ప్రకటించారు. ఈ ఒక్క కాయిన్‌కు 48 కాపర్కాయిన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్కాయిన్లను దామ్‌గా పిలిచేవారు. 168 గ్రాములుగా ముద్రించే బంగారు కాయిన్లను మొహుర్గా పిలిచేవారు. ఇలా రూపాయి ఎన్నో రూపాలు మార్చుకుంది. కాలంగడుస్తున్న కొద్దీ ఈ రూపీయేలను స్టోర్ చేయాలంటే కష్టమయ్యేది. దాంతో చైనా పేపర్ మనీని ఆవిష్కరించి వాడుకలోకి తీసుకొచ్చింది. ఇలా రూపాలు మారుతూ చివరికి అవీ అంతరిస్తూ ‘ఈ-రుపీ’ వాడేరోజులు వచ్చాయి. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
వీడు మామూలోడు కాదు రూపాయి బిళ్లలతో బైక్.. చూస్తే షాక్
-
రూ. వెయ్యి కాయిన్ వచ్చిందోచ్..! 40 గ్రాముల వెండితో చేసి..
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): పట్టణానికి చెందిన రుద్రంగి గంగాధర్ అనే వ్యక్తి ఆర్బీఐ ద్వారా వెయ్యి రూపాయల కాయిన్ తెప్పించుకున్నాడు. పూరీజగన్నాథ రథయాత్రకు వెయ్యి ఏళ్ళు అయిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పూరీ జగన్నాథుని చిత్రంతో కాయిన్‌ను విడుదల చేసింది. వివిధ రకాల కాలాలకు సంబంధించిన కాయిన్లు, నోట్లు సేకరించే అలవాటు గంగాధర్‌కు ఎప్పటి నుంచో ఉంది. 300 ఏళ్ల నుంచి చలామణిలో ఉన్న కాయిన్లను ఆయన సేకరించారు. ఇందులో భాగంగానే రూ. 8 వేల విలువ చేసే డీడీని ఆర్బీఐ పేరిట చెల్లించి ఆన్లైన్లో వెయ్యి రూపాయల కాయిన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో 40 గ్రాముల వెండితో తయారు చేసిన కాయిన్ పంపారు. -
'చిల్లర' గల్లంతు!
రూపాయి రూపాయి నువ్వేంచేస్తావ్ అని అడిగితే.. హరిచంద్రుడి చేత అబద్దం ఆడిస్తా. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా. అన్న తమ్ముల మధ్య వైరం పెంచుతా అందట. నిజంగానే రూపాయి చిచ్చు రేపుతోంది. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రూపాయి కోసం గొడవలే. డబ్బుపై మోజుతో జనం కొట్టుకుంటున్నారని పొరబడకండి. చిల్లర పైసలు కరువు రావడంతో జనం వాటి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. చెలామణిలో ఉన్న నాణాలు ఏమైపోతున్నాయన్న అనుమానం కలుగుతోంది. నాణెల కొరతతో దేశంలో 'చిల్లర' గొడవలు ఎక్కువవుతున్నాయి. సామాన్యులను 'చిల్లర' సమస్య సతమతం చేస్తోంది. నాణెల కొరత నిత్యం గొడవలకు దారి తీస్తోంది. కొనుగోళ్లు-అమ్మకాలు, ప్రయాణాలు-వ్యవహారాల్లో చిల్లర సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వినియోగదారులు, వర్తకులు, సామాన్యులను చిల్లర కొరత కుదేలు చేస్తోంది. 50 పైసలు, రూపాయి, 2, 5 రూపాయిల నాణెలు తరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర సమస్యతో రోజువారీ జీవితంలో తలనొప్పులు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా వేధిస్తున్న చిల్లర మాంద్యం అన్ని వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. నాణెలు లభ్యత తగ్గిపోవడంతో రోజువారీ వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సన్నకారు వర్తకులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని చిల్లర సమస్య వెంటాడుతోంది. వందకు చిల్లర కావాలంటే 10 రూపాయిలు సమర్పించుకోవాల్సి వస్తోంది. నాణెల తయారీని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తగ్గించేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. చాలా మంది తమ దగ్గరే ఎక్కువ నాణెలు ఉంచుకోవడం కూడా చిల్లర లోటుకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాణెలు అరుదైన వస్తువుల జాబితాలో చేరడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నాణెల పంపిణీని రిజర్వు బ్యాంకు పక్కాగా అమలు చేస్తే చిల్లర సమస్య పరిష్కారమవుతుంది. చిల్లర గల్లంతు కాకుండా చర్యలు చేపట్టాలి. కాయిన్స్ ఏటీఎంలు పెట్టి చిల్లర లోటును భర్తీ చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా నాణెల తయారీ చేపడితే 'చిల్లర' గొడవలు సద్దుమణుగుతాయి. జనానికి తిప్పలు తప్పుతాయి.