వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల పండగ శోభాయమానంగా ప్రారంభమైంది. మొదటి రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆలయూలన్నీ మహిళలు, చిన్నారులతో కిటకిటలాడాయి. హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయిస్తంభాల దేవాలయం, వరంగల్లోని కాశీవిశ్వేశ్వర ఆలయూల్లో జరిగిన వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి.