breaking news
rs.60 lakhs
-
రూ.60 లక్షల ఆదాయం: అన్నీ సమస్యలే..
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలోని ప్రధాన నగరాల్లో.. నివాసం చాలా కష్టతరమని గతంలో కొంతమంది పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 60 లక్షల వార్షిక ఆదాయం వచ్చే కుటుంబానికి చెందిన బెంగళూరు వ్యక్తి దేశంలో నివసించడం చాలా ఖరీదైనదిగా అయిపోయిందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..నేను హోరేమావు (బెంగళూరు)లో నివసిస్తున్నాను. మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫీసుకు చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి.. ఈ ప్రయాణం నాకు సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఆఫీసుకు చేరుకునే సమయానికి నీరసించిపోతాను. ప్రతి రోడ్డులోనూ అడ్డంకులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో?, ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కానీ ఎప్పటికీ పూర్తి కావు. జవాబుదారీతనం ఎక్కడ ఉందని అన్నారు.బెంగళూరు రోడ్డు పన్ను దేశంలోనే అత్యధికంగా ఉంది. ఢిల్లీలో చెల్లించే దానికంటే నేను రూ. 2.25 లక్షలు ఎక్కువగా రోడ్డు పన్ను చెల్లించాను. దానికి ప్రతిఫలంగా నాకు ఏమి లభిస్తుంది? రోడ్లకు క్రేటర్లు, ట్రాఫిక్ కష్టాలు, నిరంతర నిర్మాణాలు. ఇది పూర్తిగా పగటిపూట జరుగుతున్న దోపిడీ. మనం భారీగా చెల్లిస్తున్నాము, దీని ప్రతిఫలం శూన్యం.కెనడా, జర్మనీ వంటి దేశాలలో..మన ఆదాయంలో 30-40% పన్నుల రూపంలోకి వెళుతుంది. ప్రతిదానిపై GST కూడా. ఇవన్నీ చెల్లించినా మనకు ఏమీ లభించదు. ఉచిత ఆరోగ్య సంరక్షణ లేదు, మంచి విద్య లేదు, మంచి నీరు కూడా లేదు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులకు మనం విడిగా చెల్లించాలి. నీటి ట్యాంకర్లకు అదనం. 30-40% పన్ను చెల్లిస్తూ.. ఇంకా నీరు కొనాల్సిన పరిస్థితి ఉంది. కెనడా లేదా జర్మనీ వంటి దేశాలలో, నేను ఇదే పన్ను చెల్లిస్తే.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, మంచి మౌలిక సదుపాయాలు లభిస్తాయి.జీవన నాణ్యత కూడా విచారకరంగా ఉంది. ప్రతిచోటా దుమ్ము, శబ్దం.. వీటివల్ల ఒత్తిడి, కోపం. ప్రశాంతంగా నడవలేము, స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేము. సాయంత్రం 7 గంటల తర్వాత నా భార్యను ఒంటరిగా బయటకు పంపడం సురక్షితం కాదు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖ అవినీతిమయమైంది. లంచం ఇవ్వకపోతే పని జరగదు.పరిస్థితులు మెరుగుపడతాయా..ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారుతోంది. ఈ సంవత్సరం అద్దె 10% పెరుగుతోంది. స్కూల్ ఫీజులు అంతకు మించే ఉన్నాయి. మా ఇంటి ఆదాయం కంటే ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నేను నిజంగా ఈ దేశానికి తోడ్పడాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఈ వ్యవస్థ ఏ మాత్రం బాగాలేదు. మనం పన్ను చెల్లించే ప్రతి రూపాయి రాజకీయ నాయకుల ఖజానా నింపడానికి వెళుతుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది.నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఇక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని కొంత ఆశ పెట్టుకోవచ్చా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.ఇదీ చదవండి: టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికిందిదీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీకు వేరే ఆప్షన్ ఉంటే.. వేరే దేశంలో సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎప్పటికీ మారవని ఒకరు అన్నారు. ఇవన్నీ మారవు.. మనం ఎప్పటికీ అంతం కాని లూప్లో జీవిస్తున్నామని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.60 లక్షలు టోకరా
చాగల్లు (తూర్పుగోదావరి): ఒక మహిళ చిట్టీల పేరుతో జనాన్ని నమ్మించి సుమారు రూ.60 లక్షలకు టోకరా వేసింది. ఈ సంఘటన పశ్చిమ గొదావరి జిల్లా చాగల్లులో సోమవారం వెలుగుచూసింది. దీంతో సోమ్ములు పోయిన బాదితులు ఆ మహిళ ఇంటి వద్దకు చేరి ఆందోళన చేశారు.ఈ ఘటనకు సంబంధించి బాదితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్లమూడి పార్వతి సుమారు 15 ఏళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. సుమారు 60 మందికి పైగా ఆమె వలలో మోసపోయిన బాధితులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్వతి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. పార్వతి కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు.