breaking news
root map
-
ప్రగతి నివేదన సభ రూట్ మ్యాప్
-
బండెనక బండి.. రావాలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల విజయ ప్రస్థానాలను పంచుకునేందుకు ఆదివారం కొంగర కలాన్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కాగా, సభలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం నుంచే పలు జిల్లాల నుంచి బండెనక.. బండి పెట్టి ట్రాక్టర్లు కదిలాయి. శనివారం ఉదయం నుంచే వాహనాలు సభాస్థలి పరిసరాలకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు జిల్లాల వారీగా వచ్చే వాహనాలు, పార్కింగ్, తిరిగి వెళ్లే రూట్లను నిర్ధారించి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ సహా జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారానే వస్తుండటంతో మొత్తం 14 మార్గాలను ఎంపిక చేశారు. ఔటర్ రింగు రోడ్డు ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, పార్కింగ్, తిరుగు ప్రయాణం తదితర వివరాలతో కూడిన రూట్‌మ్యాప్‌ను అన్ని జిల్లాలు, పార్టీ నాయకులకు పంపారు. జిల్లాలు, పార్కింగ్ నుంచి సుమారు 19 ప్రాంతాల నుంచి కళా ప్రదర్శనలు, అభివృద్ధి నమూనాలను చూపుతూ భారీ జులూస్‌లతో సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలకు తావులేకుండా లైన్‌ను పాటిస్తూ నిర్ణీత వేగంతో వాహనాలన్నీ ప్రయాణించేలా పోలీస్ యంత్రాంగం తగు ఇండికేషన్లతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఆదివారం ఔటర్‌పై ప్రయాణం వద్దు.. సెప్టెంబర్ 2న ఒక్కరోజు సాధారణ ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణాన్ని మానుకోవాలని లేదా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ప్రగతి నివేదన సభతో ఔటర్‌పై భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఔటర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సైతం ఇతర రూట్లను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రగతి నివేదన సభ కోసం ఆర్టీసీ తమ సర్వీసులను నడపాలని నిర్ణయించిన దరిమిలా.. ఆదివారం సిటీలో బస్సుల కొరత ఉంటుందని, ఆ ఒక్క రోజు ప్రయాణాలను మానుకోవాలని ఆర్టీసీ సైతం విజ్ఞప్తి చేసింది. -
ప్రయాణించే ‘ఇల్లు’
చాలా ప్రాంతాలు తిరగాలని ఉంటుంది. కాని ఇల్లు దాటాలంటే రూట్ మ్యాప్ నుంచి రూమ్‌లు తీసుకోవడం దాకా బోలెడన్ని సమస్యలు. అందుకే... ఒళ్లు నలగకుండా కళ్లు తిప్పుకోలేని అందమైన పర్యాటక ప్రాంతాలను చూసిరావాలనుకునే వారి కోసం ఓ ఇల్లు లాంటి వాహనం పరిచయమైంది. కారవాన్ టూరిజం పేరుతో రాష్ట్ర పర్యాటకశాఖ వినూత్నశైలిలో సమర్పిస్తున్న ఈ కదిలే ఇల్లు ఇటీవలే పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఏమిటీ స్పెషల్? ఈ విలాసవంతమైన వాహ నం ఒక పరిమిత కుటుంబం సంతృప్తిగా, సుఖంగా టూర్ ను పూర్తి చేసేందుకు రూపకల్పన చేయడం జరిగింది. అచ్చం ఇంట్లోనే ఉన్నంత హాయిగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి వచ్చేయడానికి ఇది ఉపకరిస్తుంది. పూర్తిగా ఎయిర్‌కండిషన్ చేసిన ఈ కారవాన్ 7 సీటర్ వాహనం. ఇందులో 2 సీట్లు సోఫా కమ్ బెడ్ సౌకర్యం ఉంది. ప్రయాణంలో విసుగు పుట్టకుండా నచ్చిన సినిమానో, మరొకటో చూసేందుకు వీలుగా రెండు ఎల్ఇడి స్క్రీన్లు కూడా అమర్చారు. దీనితో పాటే డివిడి ప్లేయర్ కూడా సిద్ధంగా ఉంచారు. దీనిలోనే రిఫ్రిజరేటర్, మైక్రోఓవెన్, అటాచ్డ్ టాయిలెట్, డ్రైవర్‌కు మనకు మధ్య పూర్తి పార్టిషన్, డ్రైవర్‌తో మాట్లాడేందుకు ఇంటర్‌కమ్... వంటివి కూడా ఉన్నాయి. మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి, ఎండ పడకుండా నీడలో సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారాలు తీసుకోవాలనుకుంటే వాహనంపై నుంచి ఎక్స్ట్రా రూఫ్ టాప్ కూడా మీ కోసం దిగొస్తుంది. డ్రైవర్‌తో సహా అందుబాటులోకి వచ్చే ఈ వాహనంలో బాగా దూర ప్రయాణానికైతే అదనపు డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా... ఈ వాహనాన్ని హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికి కావాల్సి వచ్చినా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. కనీసం 8 గంటల సమయం, 80 కి.మీ కోసం రూ.4 వేలు తీసుకుంటారు. అలాగే 12 గంటలు 200 కి.మీకైతే రూ. 6,000 వసూలు చేస్తారు. 24 గంటలు, 400 కి.మీ అయితే రూ.10వేలు చెల్లించాలి. ప్రతి అదనపు కిలో మీటరు దూరానికి రూ.25, అదనపు గంటకు రూ.300 చొప్పున చెల్లించాలి. (పన్నులు అదనం). మరిన్ని వివరాలకు... టోల్ఫ్రీనెం.180042545454 సంప్రదించవచ్చు. - ఎస్.సత్యబాబు ఈ తరహా విలాసవంతమైన వాహనాన్ని మధ్యప్రదేశ్‌లో తొలుత పరిచయం చేశారు. ఆ తర్వాత మేము అందుబాటులోకి తెచ్చాం. వ్యక్తిగత ప్రయాణాలకు రూముల అద్దెల వంటి ఖర్చులు లెక్కేసుకుంటే ఇది అందుబాటులో ఉన్నట్టే. పర్యాటకు లు హైదరాబాద్‌లోని పర్యాటకభవన్ నుంచి కానీ, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్‌లలో ఉన్న టూరిజం కార్యాలయాల్లో కానీ ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. - మధుసూదన్, పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్ )