breaking news
retired soldier
-
దేశరక్షకులకు ఏయూ బాసట
దేశరక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు.. ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ.. విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువచేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్య అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలందించేందుకు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా మార్చింది. -సాక్షి, విశాఖపట్నం దేశరక్షణ కోసం అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు అవసరమైన విద్యాసంబంధ కోర్సులను అందించాలని ఏయూ సంకల్పించింది. దీన్ని ఆచరణలో పెట్టే దిశగా 2017లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఇండియన్ నేవీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఏయూతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. ఇంటర్ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి డిప్లొమా కోర్సులను అందించడం ప్రారంభించారు. అలా ఒక డిప్లొమా కోర్సుతో మొదలుపెట్టిన ఏయూ అధికారులు ఇప్పుడు 26 డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నారు. కెమికల్, ఎలక్ట్రికల్, అకౌంటింగ్–మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజె¯న్స్ సర్విస్, టీచింగ్ అండ్ ఎడ్యుకేష¯న్ సర్వీసెస్, హౌస్‌కీపింగ్, మ్యూజిక్, ఎయిర్‌ఫీల్ట్ సేఫ్టీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ మేనేజ్మెంట్, ఎయిర్‌సేఫ్టీ, మెటరలాజికల్ అసిస్టెŒన్స్ తదితర కోర్సులు అందిస్తున్నారు. సైనికులకు విద్యనందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా ప్రత్యేక కేంద్రంగా మార్చి సేవలను విస్తరించారు. బీఎస్సీ డిగ్రీలు, పీహెచ్‌డీలు ఐఎన్ఎస్ విశ్వకర్మలో పనిచేస్తున్న సిబ్బందికి డిగ్రీలు అందించే దిశగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారికోసం ప్రత్యేకంగా నూతన ఉపాధి అవకాశాల కల్పన గురించి ఆలోచించిన ఏయూ.. పలు ప్రీ రిలీజ్ కోర్సులను ప్రారంభించింది. ఏడాదికి 15 బ్యాచ్‌ల వరకు ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 నుంచి 50 మంది వరకు సైనికోద్యోగులు పాల్గొంటున్నారు. వీటికి ప్రత్యేకమైన సిలబస్ రూపొందించి ఏయూ అకడమిక్ సెనేట్‌లో ఆమోదించారు. ఇప్పటివరకు 58 బ్యాచ్‌లను నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 2,900 మందికిపైగా సైనికోద్యోగులకు ధ్రువపత్రాల్ని అందించింది. ఎగ్జిక్యూటివ్ కేటరిగీలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 38 మంది అధికారులు పీహెచ్డీ చేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్తో జత హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్ కాలేజీతో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కోర్సుల్ని అందిస్తోంది. గ్రూప్ కెపె్టన్, వింగ్ కమాండర్ స్థాయి వారికి ఈ కోర్సును అందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని జూనియర్ ఆఫీసర్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి పీజీ డిప్లొమాని డిజైన్ చేసి అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ అధికారులకోసం బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది సైనికులు ఈ ఎంవోయూ ఫలితంగా బీఏ డిగ్రీలను పొంది బ్యాంకులు తదితర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. దేశరక్షణకు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న సైనికులకు ఏయూ వందనం చేస్తోంది. వారి సేవల్ని గుర్తించి.. సైనికుల జీవితాల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతవిద్య అందిస్తోంది. గత వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చొరవతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కోర్సుల్లో సైనికోద్యోగులకు, సైనిక వీరులకు ప్రవేశాలు కల్పిల్పిస్తున్నాం. నేవీ సిబ్బంది ఎంటెక్ చదివే అవకాశం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన సైనికోద్యోగులకు బీపీఈడీ కోర్సు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తోను ఎంవోయూ కుదుర్చుకున్నాం. – ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, ఏయూ రిజిస్ట్రార్ -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
-
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం ఆలస్యం కావడంపై తమ గోడును వెల్లబుచ్చుకోవడానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో భేటీ కావడం కుదరకపోవడంతో మనస్తాపం చెందిన సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మనోహర్ పారికర్‌ను కలిసేందుకు ఎలాంటి అభ్యర్థనను తాము రక్షకుడిని నుంచి స్వీకరించలేదని మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్మీ ఉద్యోగి వన్ ర్యాంకు వన్ పెన్షన్‌లో మార్పులు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి, ఆత్మహత్యకు గల కారణాలను తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ తెలిపారు. దేశం కోసం ఎంతో కష్టపడిన మాజీ సైనికోద్యోగులందరికీ తక్షణమే వన్ ర్యాంకు-వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని జంతర్ మంతర్ వద్ద వారు గతేడాది నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. 80 రోజుల మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం, ఆ పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తమ నాలుగు ప్రాథమిక పరిస్థితులను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంందని వారు ఆరోపిస్తున్నారు. -
మహిళ దూకుతుంటే.. చేతులు చాచాడు!
ఓ యువతి పదకొండు అంతస్తుల భవనంపై నుంచి దూకుతుండగా.. రిటైర్డ్ సైనికుడు ఆమెను కాపాడాలని ప్రయత్నించాడు. దూకుతున్న మహిళను పట్టుకోవడానికి రెండు చేతులు చాచాడు. ఆమె అంత ఎత్తు నుంచి దభేలున ఆయనపై పడింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసినవారిలో వణుకు పుట్టిస్తోంది. సెంట్రల్ చైనా హుబీ ఫ్రావిన్స్‌లోని ఎన్షి నగరంలో ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. నివాస ప్రాంతంలోని ఓ 11 అంతస్తుల భవనం నుంచి మహిళ దూకుతుండటంతో కొంతమంది అక్కడ మూగారు. ఇంతలో ఆమె దూకుతుండటం చూసిన విశ్రాంత సైనికుడైన ఫెంగ్ నింగ్ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. మహిళను కాపాడాలని రెండు చేతులు చాచి నిలబడ్డారు. దురదృష్టశాత్తు ఆమె అతనిపై పడటంతో ఇద్దరు పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా భవనంపై నుంచి దూకిన మహిళ ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. విశ్రాంత సైనికుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా సెంట్రల్ టెలివిజన్ న్యూస్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. Footage: Man catches woman who jumped off a building with his ... A retired soldier caught a woman jumping off a building with his bare hands in Enshi city, Hubei Province. The force with which the woman fell resulted in both of them collapsing to the ground. They were immediately rushed to a hospital, where the man underwent a surgery for a torn ligament. It is still unclear why the woman jumped off the building. Posted by CCTVNews on Sunday, December 27, 2015