breaking news
Registered cases
-
లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సాయంత్రం(గురువారం) నుంచి నేటి సాయంత్రం(శుక్రవారం) ఆరు గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 929 కేసులు నమోదు చేశామని తెలిపారు. 8 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 54 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ.3,34,355 అపరాధ రుసుం విధించామని పేర్కొన్నారు. కచ్చితంగా లాక్డౌన్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని.. ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. (రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న) -
కేసుల కొరడా!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసుల కొరడా ఝుళిపిస్తున్నారు. గత ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ 1897ను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసు పెడతామని హెచ్చరించింది. ప్రాణాలు తీసే మహమ్మారి పొంచి ఉందన్న ప్రచారాన్ని కొంతమంది పట్టించుకోవడం లేదు. నిత్యావసరాలు, అత్యవసరాల పేరిట అకారణంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో పోలీసులు కేసుల కొరడా బయటికి తీశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల సాయంతోనూ పలు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కేసుల వివరాలు ఇవీ.. సోమవారం నుంచి మంగళవారం వరకు తొమ్మిది రోజుల్లో అకారణంగా బయటికి వచ్చిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యాధి ఉన్న విషయాన్ని బయటికి వెల్లడించకుండా, విదేశాల నుంచి వచ్చి హోంక్వారంటైన్లో ఉండని వారు కూడా ఉన్నారు. ఇటీవల క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా పలు వేడుకలు, విందులకు హాజరై కొత్తగూడెంకు చెందిన పోలీసు ఉన్నతాధికారి, అతని కుమారుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కేసుల్లో ఎక్కువగా ఐపీసీ సెక్షన్ 188, 269, 270 లే ఉండటం గమనార్హం. అకారణంగా బయటికి వస్తూ..లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు వాహనాలను ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ ముందంజలో ఉంది. గత సోమవారం నుంచి ఈ వివరాలను పరిశీలించగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్ వేసే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభంలో రోజుకు ఆరువేల నుంచి మొదలు కాగా, 30వ తేదీ వరకు ప్రతీరోజు ఈ సంఖ్య 10 వేలను అధిగమించడం విశేషం. ఈ లెక్కన రాజధానిలోనే దాదాపు లక్ష వరకు చలానాలు వేయగా..మిగిలిన జిల్లాలు, కమిషనరేట్లలో ఈ సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కేసుల నమోదు ఇలా.. నమోదు చేసిన కేసులు: 3,359 పోలీసులు సీజ్ చేసిన వాహనాలు: 16,360 నమోదైన ఎఫ్.ఐ.ఆర్లు: 1,572 అరెస్టయినవారు: 1,790 విధించిన చలానాలు: రూ.75 లక్షలు అధికంగా హైదరాబాద్‌లోనే.. -
మహిళపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం
సంభాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నార్ ప్రాంతం పాతక్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ(30) తన కూతురితో కలిసి ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన ఆరామ్ సింగ్. మహావీర్, చరణ్ సింగ్, గుల్లూ, కుమార్‌పాల్ అనే వ్యక్తులు బలవంతంగా లోపలికి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు తెలిపింది. దీంతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ఈ అఘాయిత్యాన్ని వివరించింది. ఇంతలోనే తిరిగి వచ్చిన నిందితులు ఆమెను సమీపంలో ఉండే ఆలయ ప్రాంగణంలో యజ్ఞశాలగా భావిస్తున్న గుడిసెలోకి ఈడ్చుకెళ్లి నిప్పుపెట్టారు. మంటల్లో ఆమె మృతి చెందగా నిందితులు పరారయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులపై గ్యాంగ్‌రేప్, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి నేరాలకుగాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో అకీల్ అహ్మద్ తెలిపారు. మృతురాలి భర్త కూలి పనులు చేసుకుంటూ ఘజియాబాద్‌లో ఉంటుండగా కొంతకాలంగా నిందితులు మృతురాలిని వేధిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అయితే, ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం నివేదిక సరిపోదనీ, అందుకే అవసరమైన నమూనాలను మొరాదాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నామని సంభాల్ ఎస్పీ భరద్వాజ్ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
నెలకు రూ.కోటి
వాగుల్లో.. ⇒ ఇసుక దొంగలు ⇒అధికారమే పెట్టుబడిగా.. ⇒అధికారులే అండదండగా.. ⇒నేతలే మాఫియాగా.. ⇒వల్లభపూర్, చిక్లీ, గుంజిలిలో దందా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ నేతలకు ఇసుక దందా కాసులు కురిపిస్తోంది. ఓ వైపు పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట ‘ఇసుక మాఫియా’ మంజీరను తోడేస్తుంటే.. మరోవైపు అధికారుల అండదండలతో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్మూరు నియోజకవర్గం లో సర్కారుకు రూపాయి చెల్లించకుండా వాగులను కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వాగులను తోడేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని జనం మొత్తుకుంటున్నారు. అడపా దడపా కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ,పోలీసుశాఖల అధికారులు సిద్ధమైనా.. హైదరాబాద్ ఫోన్ల ద్వారా ఒత్తిడి చేస్తుండటంతో ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తుందని వారు అంటున్నారు. అయితే ఈ ఇసుక దందాకు పోలీసుశాఖకు చెందిన ఓ ‘నిలయం’ అధికారే కాపు కాస్తున్నట్లు జిల్లా కేంద్రం వరకు ఫిర్యాదులు వస్తుండటం చర్చనీయూంశమైంది. రోజుకు రూ.3.50 లక్షలు వాగులో ఇసుకే కదా అని వదిలేస్తే.. ఈ దందా ఏడాదిలో రూ.కోట్లకు చేరుతోంది. ఆర్మూరు నియోజకవర్గంలోని మాక్లూరు మండలానికి చెందిన మూడు వాగులు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ వాగుల్లో ఇసుక తోడేందుకు టెండర్లు లేవు. సర్కారుకు రాయల్టీ కట్టే ది లేదు. గుడులు, బడులకు చందాలు కూడా లేవు. కేవలం అధికారపార్టీ నేతలమన్న ఒకే ఒక కారణంతో కొందరు రెండు నెలలుగా వాగులను తోడేస్తున్నారు. రోజుకు మాక్లూరు మండలం నుంచి 50 నుంచి 75 వరకు టిప్పర్లలో ఇసుకను నందిపేట, నవీపేట, ఆర్మూరు, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ లోడు ఇసుకకు పరిస్థితులను బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతుండగా.. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రోజుకు ఇసుక వ్యాపారులు దండుకుంటున్నారు. నెలలో రూ. 1 కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇసుకదందా వెనుక ఉన్న కొందరు నేతలు జేబులో వేసుకుంటున్నారు. అంటే ఏడాదిలో రూ.12 కోట్ల నుంచి రూ.14.50 కోట్ల వరకు ఇసుకదందా ద్వారా అక్రమ ఆదాయం సమకూరుతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను సైతం లెక్కచేయడం లేదు. కీలక నేతల పేర్లు వాడుకుంటూ రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖల అధికారులపై ఒత్తిడి చేస్తుండటం ఇటీవల వివాదాస్పదంగా మారింది. వాగుల్లో ఇసుక దొంగలు మాక్లూరు మండలంలోని వల్లభపూర్, చిక్లీ, గుంజిలి వాగుల్లో ‘ఇసుక’ దొంగలు విజృంభిస్తున్నారు. వాస్తవంగా మంజీర నది చుట్టూ ‘పట్టాభూముల’లో ఇసుక మేటల తొలగింపు పేరిట పొందిన అనుమతులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏడు అనుమతులను రద్దుచేస్తూ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్టీఎంసీ ద్వారానే ఇసుక విక్రయాలు జరిపేందుకు భూగర్భ గనుల శాఖ అధికారి భాస్కర్‌రెడ్డి 8 రీచ్‌లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ తదతర ప్రాంతాల్లో ఇసుక ధరలు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు వారి అండదండలతో ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుంచి విచ్చల విడిగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మైనింగ్ కార్యాలయంలో కూడ కొందరు ఫిర్యాదు చేశారు. చిక్లీ వాగు నుంచి చిక్లీ, చిక్లీ క్యాంపు ఇసుక వ్యాపారులు గ్రామాభివృద్ది పేరిట అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గుంజిలి వాగు నుంచి గుంజిలి గ్రామానికి చెందిన కొందరు అక్రమ ఇసుక దందా సాగిస్తుం డటం వివాదాస్పదం అవుతోంది. భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్న తరుణంలో నిబంధనలకు విరుద్ధంగా వాగులను తోడేస్తున్నా... నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘భద్రత’ నిర్బంధం!
జనగామ రూరల్/నల్లబెల్లి/నర్మెట : జనగామ మండలంలోని పెద్దరాంచర్లలో ఆహార భద్రత కార్డుల జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యూయని వీఆర్ఓ అబ్బ సాయిలును స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్బంధించారు. అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేయూలని, పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ బన్సీలాల్ హామీ ఇవ్వడంతో వీఆర్ఓను వదిలేశారు. అదేవిధంగా నల్లబెల్లి మండలంలోని రాంతీర్థం గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన వీఆర్ఓ రాఘవులుతోపాటు వీఆర్ఏ అశ్విని, కారోబార్ శివకర్ణను ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అర్హులైన తమకు ఆహార భద్రత కార్డు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఆర్డీఓ వచ్చి సమాధానం చెప్పే వరకు వదిలేది లేదని గ్రామ పంచాయతీ ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. వార్డు సభ్యులు పొదుల శోభన్, గొట్టి ముక్కుల మల్లాచారి, బీజేపీ నాయకుడు మాలోత్ మహేందర్‌సింగ్, రాజారతన్‌సింగ్, భద్రు ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాంతీర్థం గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని ప్రజలను శాంతింపజేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రజలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నెట్టివేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తహసీల్దార్ డీఎస్.వెంకన్న ఫోన్ ద్వారా హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. వాంకుడోతు గోపాల్, బొచ్చు శ్రీను, మాలోత్ సరోజన, బొర్ర భాగ్య, కల్వాల శైలజ, గుగులోత్ సీత తదితరులు పాల్గొన్నారు. నర్మెట మండలం వెల్దండ, కన్నెబోయినగూడెం, అమ్మపురం, గండిరామవరం, బొత్తలపర్రె, బొంతగట్టునాగారం, అంకుషాపుర్ గ్రామాల్లో జాబితాను చదివి వినిపిస్తుంటే.. ఆయా గ్రామాల ప్రజలకు అర్హులకు ఆహార భద్రత కార్డులు అందించలేదని ప్రజాప్రతినిధులు, అధికారులతో గొడవకు దిగారు. కాగా, జనగామ మండలం పెద్దరాంచర్లలో వీఆర్ ఓ విధులకు ఆటంకం కలిగించినందుకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. సర్పంచ్ వల్లాల మల్లేశం, సంతోష్‌రెడ్డి, బత్తిని వేణు, శివరాత్రి మల్లయ్య, నాయిని బాబు, బత్తిని సిద్దులు, పొన్నాల ప్రభాకర్‌రెడ్డిలపై 143, 342, 363 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.


