హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ సంబంగి
విశాఖ మెడికల్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా డాక్టర్ సంబంగి అప్పలనాయుడు నియామితులయ్యారు. ఈ మేరకు మంగళవారం వైద్య విద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1998లో ఆంధ్ర వైద్య కళాశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2004లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు పదోన్నతిపై వెళ్లి అక్కడే ప్రొ2009లో ప్రొఫెసర్‌గా సామాజిక వైద్య విభాగాధిపతిగా పదోన్నతి పొందారు. 2012లో ఆంధ్ర వైద్య కళాశాలకు బదిలీపై వచ్చిన ఆయన అప్పటి నుంచి ఏఎంసీ సామాజిక వైద్య విభాగాధిపతిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఏఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్, పరిపాలనాధికారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీనిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆయన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎంపిక చేసింది. ఈ ఏడాది జనవరిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్టార్‌గా ఉన్న డాక్టర్ బాబురావు పదవీ విరమణ కావడంతో ఆయన స్థానంలో ఇనఛార్జి రిజిస్ట్రార్‌గా జి.అనురాధ ఇప్పటివరకూ వ్యవహరించారు. పూర్తి స్థాయి రిజిస్ట్రార్‌గా డాక్టర్ అప్పలనాయుడుని నియమించింది.