breaking news
realsed
-
నిజాయితీకి అర్థం ఉంటే అది మా సినిమానే.. 'నిలవే' హీరో సౌమిత్ రావు
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’... ఈ మూవీకి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ అన్ని రకాల ఎమోషన్స్‌కు సంబంధించిన ‘నిలవే’ పోస్టర్లను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ .. 'నిలవే' ఓ మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం.' మేం ఎంతో నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి. నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’ సినిమా. మా చిత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ .. ‘మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. మేం కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ‘నిలవే’ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవే’ చాలా మంచి సినిమా. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు. -
ఫలితాల సందడి
సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల పోటీపరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. విశాఖపట్నానికి చెందిన సవ్వాన గోపికృష్ణ 118.75 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. స్టీల్‌ప్లాంట్ ప్రాంతానికి చెందిన పొన్నాడ జ్యోతిర్మయి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులో స్టేట్ ర్యాంకు సాధించింది. స్థానిక జోన్లవారీ ర్యాంకులను ప్రకటించారు. కటాఫ్ మార్కులపై స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాలయాలకు పూర్తిస్థాయిలో మెరిట్ జాబితా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 10,872 ఉద్యోగాల కోసం 2,35,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొలువుల కోసం ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించిన పోటీపరీక్షలకు 2,10,443 మంది హాజరయ్యారు. ఈ అభ్యర్థుల్లో పొరుగు జిల్లాలవారే కాకాండా ఎంటెక్ వంటి ఉన్నత చదువులు అభ్యసించిన వారు సైతం ఉండటం విశేషం. -
దేవాదుల కాలువకు నీటి విడుదల
భీమదేవరపల్లి: దేవాదుల ఉత్తరకాలువకు అధికారులు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 23న‘ పంటలు ఎండాక నీళ్లు ఇస్తారా?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవాదుల ఉత్తర కాలువ డీఈఈ రాంమూర్తి నీటిని విడుదల చేశారు. 15 రోజుల పాటు నీటిని అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నీరు ధర్మసాగర్ మండలంలోని రెండు గ్రామాల్లో గల రెండు వేల ఎకరాలకు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజురాబాద్ మండలాల్లోని 13 గ్రామాల్లోని 15వేల ఎకరాలకు అందనుంది.