breaking news
ration dealors
-
సంక్రాంతి కానుకల్లో డీలర్ల మాయాజాలం
కళ్యాణదుర్గం : ధనికులతో సమానంగా నిరుపేదలు కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెల్లకార్డు వినియోగదారులకు ఉచితంగా సంక్రాంతి కానుకలను అందజేస్తోంది. అయితే కొందరు డీలర్లు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కానులను కాజేశారు. మరికొందరు ఇవ్వాల్సిన 6 కానుకల్లో కేవలం నాలుగు లేదా అయిదు సరుకులే పంపిణీ చేసినట్లు సమాచారం. = కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి 36 వ చౌక డిపోలో మాలమ్మ ( కార్డునం.డబ్ల్యూఏపీ 122303600197), లేపాక్షమ్మ (కార్డు నం.డబ్ల్యూఏపీ122303600136), భూలక్ష్మి (కార్డునం.డబ్ల్యూఏపీ122303600102)లతో పాటు వందలాది మందికి శనగబేడలు ఇవ్వలేదు. = బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చౌకడిపో షాప్ నంబర్ 11లో తిప్పేస్వామి (వ్యాప్ 122001011ఏ0025)అనే వినియోగదారునికి బియ్యం వేసి, వేలిముద్ర పడలేదంటూ కానుకలు ఇవ్వలేదు. పిల్లలపల్లి షాప్ నంబర్ 15లో అలివేలమ్మ, గంగన్న దంపతులు (ర్యాప్ 12201500349)కు ఇంతవరకు కానుకలే ఇవ్వలేదు. కుమారుడు అభినాష్ వేలిముద్రలు ఈపాస్‌లో నమోదవుతున్నా డీలర్ వేలిముద్రల సాకుతో కానుకలు ఇవ్వకుండా పంపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 30 శాతంకు పైగానే డీలర్లు కానుకలను కాజేసి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ----- తనిఖీలు నిర్వహిస్తాం... చౌకధాన్య డిపోల వారీగా సంక్రాంతి కానుకలు సరఫరా ఆధారంగా వినియోగదారులకు అందాయో లేదో అధికార బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తాం. ప్రతి వినియోగదారుడికి సంక్రాంతి కానుక (ఆరు సరుకులు) ఇవ్వాలి. తప్పుదారి పట్టించినట్లు తనిఖీల్లో తేలితే చర్యలు తప్పవు. – కేఎస్ రామారావు, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
రేషన్ మాఫియా!
కర్నూలు: రేషన్ దుకాణాలను అధికార పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలను తోసిరాజని ఇష్టానుసారంగా తమ అనుయాయులకు కేటాయించుకుంటున్నారు. ఇదే అదనుగా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు దక్కాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. రాయితీ సరుకులను అక్రమంగా సేకరించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉండే పట్టణ కేంద్రాల్లోనే యథేచ్ఛగా రేషన్ సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. రేషన్ సరుకులను అక్రమంగా సేకరిస్తున్న రేషన్ మాఫియా ఇప్పుడు చౌకధరల దుకాణాలపై కన్నేసింది. భారీ మామూళ్లు ఇచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ప్రజాపంపిణీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కర్నూలు జిల్లాలో దాదాపు 100కు పైగా చౌక ధరల దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంలో ఈ మాఫియా సఫలీకతమైంది. ఇదీ అసలు కథ... కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొం దరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి తాత్కాలిక ప్రాతిపదికన కొత్తవారికి అప్పగించారు. రేషన్ మాఫియా సిఫార్సు చేసిన వారికి వీటిని కేటాయించారు. అయితే రేషన్ దుకాణాలకు తాత్కాలిక కేటాయింపులు చేయవద్దని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో రేషన్ దుకాణం కోసం రూ. లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ఈ మలికి అంటించినట్లు ఆరోపణలున్నాయి. రేషన్ మాఫియాకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా తలొగ్గితే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టే ప్రమాదం ఉంది. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ ఆర్డీవోలు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీనికి కొత్త రంగు పులిమారు. 6ఎ కేసుల్లో ఉన్న ఈ ఐదు దుకాణాల నుంచి తమకు సరుకులు సక్రమంగా అందడంలేదని, దూరంగా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సృష్టించి, ఈ సాకుతో తాత్కాలిక ప్రాతిపదికన చౌకధరల దుకాణాలు కేటాయించారు. దీనిపై దుమారం రేగుతోంది. అంతా బహిరంగమే... జిల్లాలో ప్రతీ నెలా రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని సేకరించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా.. కిరోసిన్‌ను ఆటోలకు, లారీలకు అధిక ధరలకు బహిరంగంగా విక్రయిస్తున్నా మాఫియా ఆగడాలను అడ్డుకునేవారే లేరు. కర్నూలు నగరంలోనూ, జాతీయ రహదారిపైనా ఇదే పరిస్థితి. రేషన్ బియ్యంను డీలర్ల నుంచి కిలో రూ. 10 కొనుగోలు చేస్తూ, వీరు మాత్రం బయట రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. కిరోసిన్‌ది ఇదే పరిస్థితి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నారు. రేషన్ డీలర్లు విధిగా వారి వద్ద ఉన్న సరుకులను రేషన్ మాఫియాకే విక్రయించాలని, లేకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పేదలకు చెందాల్సిన బియ్యం, కిరోసిన్‌ను బోగస్ కార్డులు, తూకాల్లో తేడాలతో కొందరు డీలర్లు మిగుల్చుకుంటున్నారు. వీటిని రేషన్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు కూడా చేయడం లేదు. తూకాల్లో తేడా..? రేషన్ దుకాణాల్లో సరుకులు సరైన తూకంతో అందించడంలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చాలా దుకాణాల్లో ప్రతీనెలా 3 క్వింటాళ్ల వరకు బియ్యం మిగుల్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగతా సరుకులది అదే పరిస్థితి. కర్నూలు, నందికొట్కూరు, బనగానపల్లె తదితర చోట్ల రేషన్ దుకాణాల నుంచి ప్రతీనెలా సరుకులను సేకరించడానికి మాఫియా ప్రాంతాలను పంచేసుకున్నారు. ఇటు డీలర్లు, మాఫియా చేసేది అక్రమమైనా అధికార యంత్రాంగం మాత్రం వారిచ్చే మామూళ్లు తీసుకుంటూ నిద్ర మత్తులో జోగుతోంది.