breaking news
Ras Al Khaimah
-
యూఏఈలో రామ్కీ ఎన్విరో ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్ అల్ ఖైమా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో ఈ మేరకు రామ్కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
దుబాయ్లో సంక్రాంతి సంబరాలు
దుబాయ్: తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యు.ఎ.ఇ.లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. రస్ అల్ఖైమా నగరంలో జాతీయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు హరిదాసుల సందడి, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువులతో పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహలతో జరుపుకున్నారు. శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణ సహస్ర నామార్చన కన్నుల పండుగగా జరిగింది. సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. సంస్కృతీ సంప్రదాయాలపై చిన్న పిల్లలకు నిర్వహించిన క్విజ్, అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు తరంగిణి ప్రెసిడెంట్ సురేష్, వైస్ ప్రెసిడెంట్ మోహన్, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. చివరలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.